iDreamPost
android-app
ios-app

‘స్థానిక సంస్థలకు రీ నోటిఫికేషన్‌’

‘స్థానిక సంస్థలకు రీ నోటిఫికేషన్‌’

స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వాయిదా వేసిన నేపథ్యంలో టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు మరో కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. సీఎం జగన్‌ ప్రెస్‌మీట్‌పై కౌంటర్‌గా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన చంద్రబాబు.. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు రీ నోటిఫికేషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తాజాగా నోటిపికేషన్‌ జారీ చేయాలన్నారు. ఈ విషయంపై తాము అన్ని కోణాల్లో పోరాడతామన్నారు.

రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని చెప్పిన చంద్రబాబు… ఎన్నికలను కేంద్ర బలగాల పర్యవేక్షణలో నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలను వాయిదా వేయడం తమకు ఏ మాత్రం సంతృప్తిని ఇవ్వలేదని, రీ నోటిఫికేషన్‌ ఇవ్వాలన్నారు.

ఎన్నికల కమిషన్‌కు కొన్ని అధికారాలుంటాయన్న విషయం సీఎం జగన్‌ మరిచిపోయినట్లుగా ఉన్నారని చంద్రబాబు విమర్శించారు. 23 శాతం సీట్లు ఎలా ఏకగ్రీవం అవుతాయని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా కడప ఫార్మలా, పులివెందుల విధానం అమలు చేస్తున్నారని మండిపడ్డారు.