Unconventional politics of Jagan Man is a creature of habit అంటారు మానసిక విశ్లేషకులు. మనిషి ఒక పద్ధతికి అలవాటు పడిపోయి అలాగే జీవితం గడుపుతూ ఉంటాడు. ఏ కారణం చేతనైనా అది కొంచెం మారితే కంగారుపడిపోయి ఆ పద్ధతి తిరిగి నెలకొనేవరకూ అశాంతికి గురవుతాడు అంటారు విశ్లేషకులు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో నాయకులు తరతరాలుగా పార్టీలకతీతంగా అలవాటు పడిపోయిన పద్ధతులను ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఛిన్నాభిన్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. […]
విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో బాధితులకు అందించే పరిహారం పరిధిని రాష్ట్ర ప్రభుత్వం పెంచుకుంటూ పోతోంది. అస్వస్థతకు గురైన ప్రభావిత గ్రామాలనే కాకుండా, పక్క ప్రాంతాలనూ ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టారు. ఇప్పటికే 12 మంది మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున, చికిత్స తీసుకున్న వారికి రూ. 25 వేల నుంచి లక్ష […]
విశాఖపట్నం సమీపంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ బాధితులను కలవటానికి నారా లోకేష్ కూడా ఎందుకు ప్రయత్నం చేయటం లేదనే విషయంపై పార్టీలోనే చర్చ జరుగుతోంది. చంద్రబాబునాయుడు అంటే వయస్సయిపోయింది కాబట్టి అంత దూరం రోడ్డు మార్గంలో ప్రయాణం చేయలేడని అనుకుందాం. అందుకనే ప్రత్యేక విమానంలో వెళ్ళటానికి అనుమతి ఇవ్వాలంటూ కేంద్రప్రభుత్వాన్ని అనుమతి కోరుతు లేఖ రాస్తే అది కాస్త బుట్ట దాఖలా అయ్యిందట. సరే ఏదో కారణం చెప్పుకుని చంద్రబాబు హైదరాబాద్ లోని ఇంటినుండి […]
జనం కోసం నేను పార్టీ పెట్టానని, మార్పు తేవటం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకునే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఏమైంది ? విశాఖపట్నం సమీపంలోని ఆర్ఆర్ వెంకటాపురం ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీలో గ్యాస్ ప్రమాదం జరిగి నాలుగు రోజులైనా పవన్ ఇంకా వెళ్ళక పోవటం ఆశ్చర్యంగా ఉంది. చంద్రబాబునాయుడు వెళ్ళలేదంటే ప్రధానమంత్రి కార్యాలయం నుండి అనుమతి రాలేదు కాబట్టి వెళ్ళలేదు. ఇదే సమయంలో బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, వామపక్ష పార్టీల కార్యదర్శులు కూడా […]
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్ల తమకు నమ్మకం లేదని విశాఖ ఘటనపై నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు కేంద్ర ప్రభుత్వం విచారణ బృందాన్ని ఏర్పాటు చేయాలని టిడిపి కమిటీ కోరింది. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ లో చోటుచేసుకున్న ప్రమాదం పై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నిర్మించిన నలుగురు సభ్యుల కమిటీ ఈరోజు ఆస్పత్రిలో బాధితులను పరామర్శించింది. ఘటన ప్రదేశాన్ని సందర్శించిన కమిటీ సభ్యులు అచ్చెన్నాయుడు నిమ్మకాయల చినరాజప్ప అయ్యన్నపాత్రుడు నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ విశాఖపట్నంలో […]
సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా సెంటిమెంట్ కి పెద్ద స్థాయిలో ప్రాధాన్యత ఉంటుంది. నాయకులు అలాంటి సెంటిమెంట్లను ఆచరించడం చాలాకాలంగా ఉంది. కానీ సెంటిమెంట్లను తోసిపుచ్చి, కొత్త చరిత్ర సృష్టించేలా ఇప్పటికే వైఎస్ జగన్ రాజకీయ ప్రస్థానం కనిపిస్తోంది. అనేక అంశాల్లో జగన్ గత చరిత్రను చెరిపేశారు. ఇప్పటి వరకూ ఏ మాజీ సీఎం తనయుడు చేయలేనిది, ఎన్టీఆర్ తర్వాత ఏ ప్రాంతీయ పార్టీ వల్ల కానిది, తొలిసారి ఓటమి తర్వాత నిలదొక్కుకోకవడం అనేది ఇలాంటి అనేక […]
సమకాలీన రాజకీయాల్లో సమన్యాయం అంటూ రాజకీయం చేసిన ప్రముఖ రాజకీయవేత్త ఎవరయా అంటే కచ్చితంగా చంద్రబాబునాయుడు పేరే వినిపిస్తుంది. చంద్రబాబు రాష్ట్ర విభజనకు ముందు సమన్యాయం, రెండు కళ్లు అంటూ తనదైన రాజకీయం ప్రదర్శించారు. బహుశా అధినేత స్ఫూర్తితోనే అయ్యింటుంది… ప్రస్తుతం విజయవాడ ఎంపీ కేశినేని నాని సైతం విశాఖపట్నం గ్యాస్ దర్ఘుటన మృతుల ఎక్స్‌గ్రేషియా కేంద్రంగా సమన్యాయ రాజకీయం మొదలుపెట్టారు. విశాఖపట్నం గ్యాస్ లీకేజీ ఘటనలో మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.కోటి రూపాయలు […]
విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ లో విషవాయు లీకైన ఘటన పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్. జీ. టి) రంగంలోకి దిగింది. ఈ సంఘటనను సుమోటోగా కేసు స్వీకరించింది. ప్రాథమిక నష్టపరిహారం కింద 50 కోట్ల రూపాయలను విశాఖ జిల్లా కలెక్టర్ వద్ద జమ చేయాలని ఆదేశించింది. ప్రమాదంపై పూర్తి నివేదికను తెప్పించుకున్న తర్వాత తదుపరి విచారణ చేపట్టనుంది. కాగా, ఇప్పటికే ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయి కమిటీని విచారణ కోసం నియమించింది. పలువురు […]
విశాఖపట్నంలో నిన్న జరిగిన పాలిమర్స్ కంపెనీపై ఇప్పటికే పోలీసు కేసు నమోదవ్వడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటి కూడా తన విచారణ కొనసాగించడానికి సిద్దమైంది. అయితే సుమారు 60ఏళ్ళ క్రితం స్థాపించిన ఈ సంస్థలో నిన్న జరిగిన ప్రమాదం కాకుండానే గతంలో కుడా లీకేజ్ ఘటన ఒకటి నమోదయినట్టు తెలుస్తుంది. ఈ ఫ్యాక్టరీ నేపథ్యం చూస్తే విశాఖలో 1961 లో ఏర్పాటైన హిందుస్తాన్ పాలిమర్స్ ని 1978 వచ్చేసరికి యుబి గ్రూప్ కి చెందిన మెక్‌డోవెల్ […]
కరువులో అధికమాసమంటే ఇదేనేమో. జనాలు, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం దాదుపు 50 రోజులుగా కరోనా వైరస్ దెబ్బకు నానా అవస్తలు పడుతున్నారు. ఇటువంటి సమయంలోనే గురువారం స్టైరైన్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన జనాలు, యంత్రాంగం నెత్తిన పిడుగుపాటు లాగ వచ్చిపడింది. కరోనా వైరస్ సోకిన బాధితులకు, లక్షణాలున్న వారికోసం విశాఖపట్నం నగరంలో రెడి చేసిన క్వారాంటైన్ కేంద్రాలు, ఐసొలేషన్ వార్డులను గ్యాస్ బాధితులకోసం వాడాల్సొచ్చిందిట. హఠాత్తుగా జరిగిన గ్యాస్ లీకేజీ ప్రమాదంలో బాధితులను యంత్రాంగం ముందు వివిధ […]