iDreamPost
android-app
ios-app

విశాఖ డేంజర్ జోన్లోకి వెళ్తోందా?

  • Published Mar 30, 2020 | 7:48 AM Updated Updated Mar 30, 2020 | 7:48 AM
విశాఖ డేంజర్ జోన్లోకి వెళ్తోందా?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఎందుకంటే cలో ఆదివారం రెండు కొరోనా వైరస్ పాజిటివ్ కేసులు బయటపడటంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. కొరోనా వైరస్ సమస్య మొదలైనప్పటి నుండి ప్రభుత్వానికి విశాఖపట్నం జిల్లా పెద్ద ప్రాబ్లెమ్ గా తయారైంది. ప్రభుత్వం తాజా ప్రకటనతో జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6కి చేరుకోవటంతో యంత్రాంగంలో టెన్షన్ మొదలైంది.

మొదటి నుండి విశాఖ జిల్లా యంత్రాంగాన్ని ఇబ్బంది పెడుతునే ఉంది. ఎలాగంటే విదేశాల నుండి వచ్చిన వారిలో అత్యధికులు ఈ జిల్లాలోనే ఉన్నారు. మిగిలిన జిల్లాలకు వచ్చిన విదేశీయులను ప్రభుత్వం గుర్తించి వెంటనే అందరినీ హోం క్వారంటైన్లో ఉంచటమే లేకపోతే ఐసొలేషన్ వార్డులో చేర్చటమే చేసింది. ఇదే పద్దతిని విశాఖపట్నం జిల్లాలో కూడా అమలు చేద్దామని ప్రయత్నించినపుడు యంత్రాంగానికి షాక్ కొట్టింది.

విశాఖపట్నంకు విదేశాల నుండి వచ్చిన వారిలో 453 మంది అడ్రస్ లు దొరకటం లేదు. రెండుసార్లు ఇంటింటి సర్వేలు చేయించినా ఉపయోగం కనబడకపోవటంతో జిల్లా అధికారులు టెన్షన్ పడుతున్నారు. కేంద్రమేమో జిల్లాకు వచ్చిన విదేశీయుల సంఖ్యను పంపాము కాబట్టి వెంటనే వాళ్ళందరినీ ఐసొలేషన్ వార్డుల్లో ఉంచమని ఒకటే షంటేస్తోంది. క్షేత్రస్ధాయిలో ఏమో పరిస్ధితిలు వేరుగా ఉంది.

పాస్ పోర్టుల్లో ఉన్న అడ్రస్ లను జిల్లా యంత్రాంగానికి కేంద్రమే పంపింది. అయితే పాస్ పోర్టుల్లో ఉన్న అడ్రస్సుల్లో 453 మంది ఉండటం లేదట. దాంతో వాళ్ళని పట్టుకోవటం చాలా ప్రాబ్లెమ్ అయిపోతోంది. వీళ్ళని పట్టుకోవటం ఎలాగో తెలీక జిల్లా అధికారులు నానా అవస్తలు పడుతుంటే తాజాగా రెండు కేసులు బయటపడటంతో అధికారుల్లో టెన్షన్ పెరిగిపోయింది. బ్రిటన్ నుండి వచ్చిన పేషంటును కలవటం వల్లే కొత్తగా ఇద్దరికి కొరోనా వచ్చినట్లు యంత్రాంగం నిర్ధారించుకుంది. మొత్తానికి రాష్ట్రంలో కేసుల సంఖ్య 21కి చేరుకుంది.