విజయ్ హీరోగా విజయ్ సేతుపతి విలన్ గా కార్తి ఖైదీతో పేరు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన మాస్టర్ విడుదలకు సిద్ధంగా ఉంది. కరోనా తాకిడి లేకపోతే ఏప్రిల్ 9నే విడుదలయ్యి ఉండేది. కాని ఇప్పటికిప్పుడు థియేటర్లు తెరిచే పరిస్థితి లేకపోవడంతో దీపావళికి ప్లాన్ చేసినట్టుగా కోలీవుడ్ టాక్. ఇదిలా ఉండగా ఈ కథకు సంబంధించి ఓ కీలకమైన లీక్ ఫిలిం నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం ఇందులో హీరో పాత్ర […]
తమిళ స్టార్ హీరో విజయ్ కొంత ఆలస్యంగానే అయినా కరోనా సహాయ చర్యలకు తన వంతు విరాళం బాగానే అందించాడు. అయితే అందరిలాగా తమ రాష్ట్రానికే లేదా పిఎం కేర్స్ కో పరిమితం కాకుండా తనను ఆదరిస్తున్న 6 రాష్ట్రాలకు సొమ్ముని ప్రకటించాడు. వివరాల్లోకి వెళ్తే మాతృ రాష్ట్రం తమిళనాడుకు 50 లక్షలు, కేరళకు 10 లక్షలు, కర్ణాటకకు 5 లక్షలు, ఆంధ్రప్రదేశ్ కు 5 లక్షలు, తెలంగాణకు 5 లక్షలు, పాండిచ్చేరికి 5 లక్షలు ఆయా […]
అదేంటి ఉప్పెన ఇంకా రిలీజే కాలేదు అప్పుడే రీమేక్ న్యూస్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా. విషయం వేరే ఉంది లెండి. మెగా మేనల్లుడు కం సాయి ధరం తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా డెబ్యు డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన ఉప్పెన వాస్తవానికి ఏప్రిల్ 2న విడుదల కావాల్సింది. కరోనా వల్ల ఇప్పటికీ ఫిక్స్ కాని డేట్ కి పోస్ట్ పోన్ అయ్యింది. తమిళ వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి విలన్ గా చాలా కీలకమైన పాత్ర […]
తమిళ హీరో విజయ్ కి తెలుగులో మార్కెట్ పెరగడానికి దోహద పడిన సినిమా తుపాకీ. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ టెర్రరిస్ట్ థ్రిల్లర్ ఇప్పటికీ యాక్షన్ లవర్స్ కి హాట్ ఫెవరెట్ మూవీ. ఇప్పుడు దీనికి సీక్వెల్ రూపొందే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది. ప్రస్తుతం మాస్టర్ షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న విజయ్ కరోనా వల్ల వాయిదా వేయక తప్పలేదు. దీని తర్వాత సుధా కొంగరకు కమిట్ మెంట్ ఇచ్చిన విజయ్ దాని […]