భారత్లో కరోనా వైరస్ను నియంత్రించడంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. మంగళవారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా రాహుల్ గాంధీ ప్రత్యక్ష విలేకరుల సమావేశం నిర్వహించారు. భారత్లో సుమారు రెండు నెలలుగా కొనసాగుతున్న లాక్డౌన్ విఫలం కావడంతో దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయని రాహుల్ ఆరోపించారు. దేశంలో నాలుగు విడతలుగా విధించిన లాక్డౌన్ ప్రధాని మోదీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. అలాగే […]
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(నరేగా)కి అదనంగా 40 వేల కోట్ల రూపాయలు కేటాయించడంపై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ హాయంలో ప్రారంభించిన నరేగా పథకం విశిష్టతను గుర్తించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. కరోనా వల్ల విధించిన లాక్డౌన్తో పట్టణాలు, నగరాల నుంచి వలస కూలీలు, కార్మికులు తమ స్వగ్రామాల బాట పట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారందరికీ ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం […]
ప్రాణాంతక కోవిడ్-19 చికిత్సకు ఉపయోగిస్తున్న పరికరాలపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూలు నిలిపివేయాలని కేంద్రానికి సూచిస్తూ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.కరోనా మహమ్మారి నుండి రక్షణ పొందటానికి వాడే శానిటైజర్లు,మాస్క్లు వంటి పరికరాలపై జీఎస్టీ వసూలు చేయడం తప్పని ఆయన పేర్కొన్నారు. కరోనా వ్యాధితో, పేదరికంతో బాధపడుతున్న ప్రజల నుంచి శానిటైజర్లు, సబ్బులు,మాస్క్లు, గ్లౌజులు వంటి పరికరాలపై జీఎస్టీ వసూలు చేయడం మంచిది కాదన్నారు. జీఎస్టీ లేని కరోనా రక్షిత […]
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షుడిగా 11 మంది సభ్యులతో కాంగ్రెస్ పార్టీ విధానాలను నిర్ణయించేందుకు సంప్రదింపుల కమిటీని ఏర్పాటు చేశారు. అత్యున్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడానికి వర్కింగ్ కమిటీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కొత్తగా కమిటీని నియమించడం విశేషం. ఈ కమిటీ ప్రతిరోజు సమావేశమై కరోనా నేపద్యంలో ప్రస్తుతం దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితులపై సమాలోచనలు చేస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు,ఇంజనీర్లు, మేధావులు,సమాచార నిపుణులతో చర్చించి కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కడానికి అవసరమైన […]
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్ కు ప్రధాన న్యాయమూర్తిగా చేసి గత నవంబర్ లో పదవి విరమణ చేసిన జస్టిస్ రంజన్ గొగోయ్ ని రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు ఎంపిక చేయడంపై పార్లమెంట్లో విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలకు దిగాయి. జస్టిజ్ రంజన్ గగోయ్ సుప్రీమ్ కోర్ట్ ప్రధాన నియయమూర్తిగా ఉన్న సమయంలో బిజెపి కి అనుకుకూలంగా వ్యవహరించడం వలెనే అందుకు కృతజ్ఞతగా ‘క్విడ్ ప్రో కో’ కింద బిజెపి ప్రభుత్వం ఆయన్ని రాజ్యసభకు పంపిస్తుందని […]