Swetha
దుల్కర్ , రానా కలిసి నటించి , నిర్మించిన సినిమా కాంత. సినిమా రిలీజ్ కు ముందే సినిమా మీద కొన్ని అంచనాలు ఏర్పడ్డాయి. అంతే కాకుండా ఇది ఓ స్టార్ హీరో జీవితానికి సంబందించిన సినిమా అనే టాక్ కూడా వచ్చింది. దీనితో ఆ స్టార్ హీరో వారసులు దీని మీద కేసు కూడా ఫైల్ చేశారు. సరే ఇదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఎలాగూ సినిమా రిలీజ్ అయింది కాబట్టి..

దుల్కర్ , రానా కలిసి నటించి , నిర్మించిన సినిమా కాంత. సినిమా రిలీజ్ కు ముందే సినిమా మీద కొన్ని అంచనాలు ఏర్పడ్డాయి. అంతే కాకుండా ఇది ఓ స్టార్ హీరో జీవితానికి సంబందించిన సినిమా అనే టాక్ కూడా వచ్చింది. దీనితో ఆ స్టార్ హీరో వారసులు దీని మీద కేసు కూడా ఫైల్ చేశారు. సరే ఇదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఎలాగూ సినిమా రిలీజ్ అయింది కాబట్టి.. అసలు ఇది ఆ స్టార్ హీరో జీవితానికి సంబందించిన సినిమానా కాదా అనే విషయాలను చూసేద్దాం.
అసలు కాంత కథ విషయానికొస్తే.. ఈ సినిమా కథ అంతా కూడా హీరోకు దర్శకుడికి మధ్య మొదలయ్యే గొడవతో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత హీరో మీద రివెంజ్ తీర్చుకోవడం కోసం హీరోయిన్ ను పరిచయం చేయడం. హీరో హీరోయిన్ కి మధ్య ప్రేమ కలగడం.. హీరోయిన్ చనిపోవడం , ఆమె గురించి ఇన్వెస్టిగేషన్ చేయడం ఇలా కథ అంతా ఇంట్రెస్టింగ్ గా సాగిపోతూ ఉంటుంది. ఇది తెర మీద మనకి కనిపించే కథ. అచ్చం ఇలానే తెర వెనుక ఎం.కె. త్యాగరాజ భాగవతార్ జీవితంలోనూ ఇలాంటి కొన్ని సంఘటనలే జరిగాయట. ఆయన తన సినీ కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత మొదటి పదేళ్లు పీక్స్ చూసారు. ఆయన తీసిన ఓ సినిమా ఏకంగా మూడేళ్ళ పాటు ఆడిందంటేనే అర్థంచేసుకోవచ్చు ఆయన ఎంత పెద్ద హీరోనో.
ఆ తర్వాత ఓ డైరెక్టర్ తో గొడవ వలన మొత్తం మారిపోయిందట. ఆయనే అతనిని ఓ మర్డర్ కేసులో ఇరికించి జైలు పాలు చేశారట. ఆ తర్వాత 49 ఏళ్లకే ఆయన మరణించారు. ఇది ఎం.కె. త్యాగరాజ భాగవతార్ జీవితంలో జరిగిన కథ. దీనిని సినిమాగా తీసారా లేదా అనుకోకుండా మ్యాచ్ అయ్యాయా అనేది దర్శక నిర్మాతలకే తెలియాలి. ఏదైతేనేం కాంత సినిమా కారణంగా మరోసారి ఆ ఓ గొప్ప నటుడిని అంతా గుర్తుచేసుకున్నట్లు అయింది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.