దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్ కు ప్రధాన న్యాయమూర్తిగా చేసి గత నవంబర్ లో పదవి విరమణ చేసిన జస్టిస్ రంజన్ గొగోయ్ ని రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు ఎంపిక చేయడంపై పార్లమెంట్లో విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలకు దిగాయి. జస్టిజ్ రంజన్ గగోయ్ సుప్రీమ్ కోర్ట్ ప్రధాన నియయమూర్తిగా ఉన్న సమయంలో బిజెపి కి అనుకుకూలంగా వ్యవహరించడం వలెనే అందుకు కృతజ్ఞతగా ‘క్విడ్ ప్రో కో’ కింద బిజెపి ప్రభుత్వం ఆయన్ని రాజ్యసభకు పంపిస్తుందని రాహుల్ గాంధీ, అసుదుద్దిన్ ఒవైసితో పాటు పార్లమెంట్లో ఇతర విపక్షాలు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించడంతో ఒక్కసారిగా ఈ అంశంపై తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది.
రంజన్ గగోయ్ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలో అయోధ్యలో వివాదాస్పద స్థలం రాముడిదే (హిందువులదే) అని చరిత్రాత్మక తీర్పు వెలువరించిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి జస్టిస్ గొగోయ్ నేతృత్వం వహించారు. దీంతో పాటు రాఫెల్ యుద్ధవిమానాల ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వానికి క్లీన్‌చిట్ ఇచ్చిన బెంచ్‌కూ ఆయనదే నేతృత్వం వహించారు. అదేవిధంగా సుప్రీంకోర్టు చేయని వ్యాఖ్యలను బెంచ్‌కు ఆపాదించిన కేసులో విపక్ష నేత రాహుల్ గాంధీని మందలించిన కేసు మొదలైన ఎన్నో వివాదాస్పద అంశాలలో ఆయన బిజెపికి అనుకూలంగా వ్యవహరించడం వల్లే ప్రతిఫలంగా ఆయనికి రాజ్యసభ స్థానం దక్కిందని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ తో పాటు అసదుద్దీన్ ఒవైసి ఆరోపిస్తున్నారు.
మరోవైపు సుప్రీమ్ కోర్ట్ మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిజ్ మార్కండేయ ఖట్జూ కూడా జస్టిజ్ రంజన్ గగోయ్ ని రాజ్యసభకు నామినేట్ చేయడం పై తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. అదేసమయంలో జస్టిజ్ మార్కండేయ ఖట్జూ బిజెపి పాలనలో దేశంలో న్యాయవ్యవస్థ ధ్వంసం అయిపోతుందని ఆరోపించారు.
అయితే తనపై వస్తున్న ఈ విమర్శలపై స్పందించడానికి నిరాకరించిన జస్టిజ్ రంజన్ గగోయ్ తానూ రాజ్యసభలో ప్రమాణ స్వీకారం పూర్తి చేశాక మాత్రమే తనపై వస్తున్న విమర్శలన్నింటికీ తగు సమాధానం చెబుతానని తెలిపారు.