Swetha
ప్రస్తుతం ఇండస్ట్రీని విసిగిస్తున్న వాటిలో ప్రధానమైన పైరసీ. సినిమా రిలీజ్ అయినా సాయంత్రానికే అది డిజిటల్ స్క్రీనింగ్ అయిపోతుంది. సినిమా రిలీజ్ అయినా కొన్ని రోజులకు ఓటిటి లోకి రావడం ఓ లెక్క.. అదే సినిమా ఆరోజు సాయంత్రానికే మూవీ రూల్జ్ , ఐ బొమ్మ వాటిలో రావడం ఓ లెక్క. దీని వలన ఇండస్ట్రీకి చాలా నష్టం జరుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు

ప్రస్తుతం ఇండస్ట్రీని విసిగిస్తున్న వాటిలో ప్రధానమైన పైరసీ. సినిమా రిలీజ్ అయినా సాయంత్రానికే అది డిజిటల్ స్క్రీనింగ్ అయిపోతుంది. సినిమా రిలీజ్ అయినా కొన్ని రోజులకు ఓటిటి లోకి రావడం ఓ లెక్క.. అదే సినిమా ఆరోజు సాయంత్రానికే మూవీ రూల్జ్ , ఐ బొమ్మ వాటిలో రావడం ఓ లెక్క. దీని వలన ఇండస్ట్రీకి చాలా నష్టం జరుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీని గురించి ఎప్పటినుంచో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఎట్టకేలకు ఐ బొమ్మ అడ్మిన్ ను అరెస్ట్ చేసారు పోలీసులు.
ఆన్ లైన్ పైరసీ అధిక శాతం టొరెంట్ లింక్స్, టెలిగ్రామ్ యాప్స్ ఆపరేట్ చేయడం తెలిసిన వాళ్లకు మాత్రం డౌన్లోడ్ అయ్యేది. ఆ తర్వాత ఈ వర్గం ఆడియన్స్ ను టార్గెట్ చేసుకుంటూ ఐబొమ్మ రీసెంట్ టైమ్స్ లో చాలా పాపులర్ అయింది. ఎక్కడో విదేశాల్లో ఉంటూ కొత్త సినిమాలను పైరసీ చేస్తూ ఫ్రీ గా ఐ బొమ్మ యాప్ లో పెడుతున్న అడ్మిన్స్ ను పట్టుకోవడం పోలీసులకు పెద్ద టాస్క్ గా మారింది. ఇక ఇప్పుడు ఎట్టకేలకు తాజాగా ప్రాన్స్ నుంచి వచ్చిన ఐబొమ్మ యజమాని ఇమ్మడి రవిని హైదరాబాద్ కూకట్ పల్లి సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. కరేబియన్ దీవుల్లో ఉంటూ అక్కడే పైరసీని ఆపరేట్ చేస్తూ ఉండేవాడట ఈ అడ్మిన్.
ఇక ఇప్పుడు ఈ అడ్మిన్ ను అరెస్ట్ చేసారు కాబట్టి.. పెద్ద ప్రశ్నకు సమాధానం దొరికినట్టే. ఇతని ద్వారా మరిన్ని విషయాలు బయటకు తీసుకుని వచ్చే అవకాశం ఉంది. వేల కోట్ల రూపాయల నష్టాన్ని పరిశ్రమకు కలగజేస్తున్న ఐబొమ్మ లాంటి అనధికార యాప్స్ ఇంకా చాలానే ఉన్నాయి. త్వరలో వీటిపైన కూడా కన్నేసే అవకాశం లేకపోలేదు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.