ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా రానా స్పెషల్ రోల్ లో నటించారు. ఈ సినిమా నవంబర్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.మరి ఈ సినిమా ఎలా ఉంది ? అనుకున్నట్లుగా ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది రివ్యూలో చూసేద్దాం.
ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా రానా స్పెషల్ రోల్ లో నటించారు. ఈ సినిమా నవంబర్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.మరి ఈ సినిమా ఎలా ఉంది ? అనుకున్నట్లుగా ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది రివ్యూలో చూసేద్దాం.
Swetha
రానా, దుల్కర్ సల్మాన్ కలిసి నిర్మించిన సినిమా ‘కాంత’. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటినుంచి ట్రైలర్ కట్ వరకు వచ్చిన ప్రమోషనల్ అప్డేట్స్ సినిమా మీద ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసాయి. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా రానా స్పెషల్ రోల్ లో నటించారు. ఈ సినిమా నవంబర్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. కంటెంట్ మీద నమ్మకంతో ఓ రోజు ముందే తమిళం తెలుగులో ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది ? అనుకున్నట్లుగా ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది రివ్యూలో చూసేద్దాం.
కథ :
కాంత కథ అంతా కూడా తమిళనాడులోని చెన్నైలో ఉన్న స్టూడియోలలో జరుగుతుంది. అక్కడ సముద్రఖని ఓ పెద్ద దర్శకుడు. అతనే దుల్కర్ సల్మాన్ ను సినీ తెరకు పరిచయం చేస్తాడు. అతనితో ‘శాంత’ అనే సినిమాను ప్రారంభిస్తాడు. కొన్ని రీజన్స్ వలన వారిద్దరికీ గొడవలు అవుతాయి. దీనితో సముద్రఖని భాగ్యశ్రీ ని హీరోయిన్ గా దింపుతారు. ఆమె ద్వారా పగ తీర్చుకుంటానని సముద్రఖని మహదేవన్ కు ఛాలెంజ్ విసురుతాడు. కట్ చేస్తే ఆమె దుల్కర్ తో ప్రేమలో పడుతుంది. దీనితో దుల్కర్ ఆమెను వివాహం కూడా చేసుకోవాలని అనుకుంటాడు. కానీ ఊహించని విధంగా ఆమె హత్యకు గురవుతుంది. మరి ఆమెను చంపింది ఎవరు ? ఎందుకు ఆమెను చంపాల్సి వచ్చింది? నిజంగానే ముందే అనుకున్నట్లు ఇది త్యాగరాజ భాగవతార్ బయోపిక్ ఏనా? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.
నటీనటులు , టెక్నికల్ టీం పని తీరు :
ముందుగా నటీ నటుల విషయానికొస్తే.. ఎప్పటిలానే ప్రేక్షకులు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ప్రూవ్ చేసుకున్నాడు దుల్కర్. పైగా ఈ సినిమా చూసిన తర్వాత ఇది దుల్కర్ కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫామెన్స్ అని చెప్పకుండా ఎవరు ఉండలేరు. ఇక సముద్రఖని దుల్కర్ కు పోటీగా తానేంటో నిరూపించుకున్నాడు. ఇక వీరిద్దరూ ముందు భాగ్య శ్రీ అంతగా కనిపించుకోవచ్చు అనుకుంటే పొరపాటే.. ఆమె నటన కూడా అద్భుతంగా అందరిని కట్టిపడేసింది. రానా విషయానికొస్తే.. వెండితెరమీద రానా కనిపించి చాలా కాలం అయింది. దీనితో ఈ సినిమాలో రానా తనదైన మ్యాజిక్ పెర్ఫామెన్స్ ను కనబరిచాడు. వీరు కాకుండా మిగిలిన నటీనటులంతా కూడా తమ పరిధి మేర ప్రేక్షకులను మెప్పించారు.
టెక్నీకల్ టీం విషయానికొస్తే కథకు నటీనటులకు ఇచ్చే క్రెడిట్స్ కంటే ఒకింత ఎక్కువ క్రెడిట్స్ ఇవ్వాల్సింది టెక్నీకల్ టీం కే. ఆర్ట్ డిపార్ట్మెంట్ చాలా నీట్ గా వర్క్ ని చేసారు కాబట్టి సినిమా అంతా కూడా చాలా చక్కగా మలిచారు దర్శకుడు. అలాగే సినిమా ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది. దానికి రీజన్ సినిమాటోగ్రాఫర్ అని చెప్పాల్సిందే. పాటలు , బిజిఎం ఇలా ప్రతిదీ బాగానే ఆకట్టుకుంది . మొత్తం మీద ఒకప్పటి స్టూడియోస్ ను ఇప్పుడు తెర మీద చాలా అద్భుతంగా చూపించడంలో.. టీమ్ అంతా సక్సెస్ అయ్యారని చెప్పాల్సిందే.
విశ్లేషణ:
సినిమా స్టార్ట్ అయినప్పుడు పెద్దగా క్యారెక్టర్ పరిచయాలు ఏమి చేయకుండా .. నేరుగా కథలోకి తీసుకుని వెళ్ళిపోయాడు దర్శకుడు. ఒక ఆగిపోయిన సినిమా కారణంగా హీరోకు , దర్శకుడికి మధ్య తగాదా. దీనితో హీరో ఆ సినిమాను తనకు నచ్చినట్టు ఆ సినిమాను ముందుకు తీసుకుని వెళ్లాలని అనుకుంటాడు. అలా స్టోరీ మొదలవుతుంది.. అక్కడనుంచి ప్రేక్షకులు కూడా కథలోకి ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. మొదట హీరో హీరోయిన్ మధ్య బాండింగ్ సరిగా లేకపోవడం.. ముందుకు వెళ్తున్నా కొద్దీ వారిద్దరి మధ్య సాన్నిహత్యం పెరగడం ఇదంతా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. అంతా బాగానే సాగుతుంది అనుకునే సమయానికి హీరోయిన్ చనిపోతుంది. అదే సెకండ్ హాఫ్ కు లీడ్ గా మారుతుంది.
సెకండ్ హాఫ్ అంతా కూడా ఓ మర్డర్ మిస్టరీగా మారుతుంది. ఆమెను చంపింది ఎవరు.. ఎందుకు చంపారు ఇవన్నీ డీల్ చేయడం రానా పని. ఇదే సినిమాకు హైలెట్ అయింది. ఇదేనా కథ అంటే కానే కాదు. కథను ముందుకు తీసుకు వెళ్లిన విధానమే ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేస్తుంది. సినిమాలో అక్కడక్కడా మహానటి ఫ్లేవర్ కనిపిస్తూనే ఉంటుంది. కామిడి సీన్స్ , ఫైట్స్ , రొమాన్స్ ఇలాంటి మూసధోరణి ఇందులో ఉండదు. కాబట్టి అందరికి కనెక్ట్ అయ్యే కథ కాదని చెప్పొచ్చు. కానీ ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాల్సిన కథే ఇది. ప్యూర్ డ్రామా , నటీనటుల పెర్ఫార్మెన్స్ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ .
ప్లస్ లు :
– నటీనటుల యాక్టింగ్
– టెక్నీకల్ టీం
– ట్విస్ట్ లు
మైనస్ లు :
– స్లో మోషన్ సీన్స్ (కొన్ని)
– లాజిక్స్ మిస్ అవ్వడం (అక్కడక్కడ)
రేటింగ్ : 3/5
చివరిగా : ‘కాంత’ ప్రతిఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమాలో సినిమా