తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆస్తుల విక్రయాలపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి ఆస్తుల ప్రక్రియను నిలిపివేసింది. ఈ మేరకు టీటీడీ ఈవో సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. వేలం నిర్వహణకు సంబంధించి నియమించిన రెండు బృందాలను రద్దు చేశారు. శ్రీవారి ఆస్తుల వేలం వేయాలని 2016లో అప్పటి పాలక మండలి తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ నిన్న సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. […]
లాక్డౌన్ కారణంగా తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులను నిలిపివేసి 50 రోజులు దాటిపోయింది. తిరిగి ఎప్పుడు దర్శనాలను ప్రారంభిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ శ్రీవారి హుండీ ఖాళీగా ఉండడం లేదు. ప్రతిరోజూ అంతోఇంతో డబ్బులు హుండీలోకి వెళ్తున్నాయి. భక్తులు లేకుండా హుండీలోకి డబ్బులు ఎలా వెళ్తున్నాయి అనుకుంటున్నారా? అయితే ఇది చదవండి. శ్రీవారి ఆలయం గత కొద్ది రోజులుగా తెరుచుకోకపోయినా నిత్యం పూజారులు శాస్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అలాగే తిరుమలలో […]
ఈ కరోనా వైరస్ ఎవ్వరినీ వదలటం లేదు. మనమంటే మామూలు మనుషులం కాబట్టి మనమీద కరోనా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. మరి ఏడుకొండలపై తిరుమలలో వెలసిన వడ్డీకాసుల వాడు వెంకటేశునికి ఏమైంది ? తిరుమల శ్రీవారికి కూడా వనరుల కొరత వచ్చేసినట్లు తిరుమల తిరుపతి ట్రస్టు బోర్డు ఛైర్మన్ ఎస్వీ సుబ్బారెడ్డి చెప్పారు. గడచిన 45 రోజులుగా తిరుమలలో భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని నిలిపేయటమే కారణమట. కరోనా వైరస్ దెబ్బకు యావత్ ప్రపంచం లాక్ డౌన్ […]
ప్రతి రోజూ లక్షలాది మంది భక్తుల గోవింద నామ స్మరణతో మారుమ్రోగే తిరుమల గిరుల్లో గత నెల రోజులుగా నిశబ్ధం ఆవహించింది. కోట్లాది రూపాయల భక్తుల కానుకలతో గలగలలాడే హుండీలు వెలవెలబోతున్నాయి. మొత్తంగా కరోనా వల్ల కొనసాగుతున్న లాక్డౌన్ ప్రభావం తిరుమల కొండపై భారీగానే ఉంది. గత నెల 20 వ తేదీ నుంచి తిరుమల ఆలయం తెరుచుకోని విషయం తెలిసిందే. దీంతో మొక్కుల రూపంలో భక్తులు సమర్పించే నగదు, బంగారు, వెండితోపాటు దర్శన టికెట్లు, ఆర్జిత […]
ప్రపంచంలోనే అత్యధికంగా భక్తులు వచ్చే దేవాలయాల్లో తిరుమల ఒకటి. అనునిత్యం శ్రీవారిని లక్ష మంది వరకు భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ప్రపంచంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించారు . ఈ కారణంతో తిరుమలతో పాటు అన్ని ప్రముఖ దేవాలయాల్లో భక్తులకు దర్శనం ఇతర సేవలన్నీ నిలిపేశారు కానీ అనునిత్యం ఆయా క్షేత్రాల్లోని దేవుళ్ళకి గతంలో జరిగే పూజలు యధావిధిగా కొనసాగిస్తున్నారు . అలాగే తిరుమలలో […]
తిరుమల కొండ ఒక్కసారిగా నిశ్శబ్దం కావడంతో వన్యప్రాణుల సంచారం పెరిగింది. అప్పుడప్పుడు కనిపించే చిరుతపులులు తరచూ కనిపిస్తున్నాయి. జింకలైతే ఘాట్‌రోడ్డు మీద షికార్లు చేస్తున్నాయి. వందల ఏళ్ల క్రితం తిరుమల ఆలయం చుట్టూ వన్య ప్రాణుల సంచారం అధికంగా ఉండేది. పూజలు ముగించుకుని అర్చకులు సాయంత్రానికి కొండ దిగేవాళ్లు. కొండ మీదే నివాసం ఉండే సంచార జాతులు (నక్కలోళ్లు) జంతువుల్ని తరిమేసే వాళ్లు. కాలం మారింది. నాగరికులు తిరుమలను ఆక్రమించి , సంచార జాతుల్ని, వన్యప్రాణుల్ని కూడా […]
మనుషుల వల్ల దేవుడు బతుకుతాడు. దేవుడి వల్ల మనుషులు బతుకుతారు. కరోనాని దేవుడు సృష్టించాడో లేదో తెలియదు కానీ, అది దేవున్ని కూడా భయపెడుతూ ఉంది. ఆయన కూడా మాస్క్ వేసుకోవాల్సిన స్థితి ఏర్పడింది. తిరుమలకు దారులు మూసేశారంటే , ఒక రకంగా గుడిని మూసేసినట్టే. పూజలు యధావిధిగా జరుగుతాయని అంటున్నారు. అయితే గోవిందా అని ఒకర్నొకరు తోసుకుంటూ అరుస్తూ సిబ్బందితో నెట్టించుకుంటూ భక్తులు వెళ్తూ ఉంటేనే దేవుడికి కూడా ఇగో సంతృప్తి చెందుతుంది. దేవుడు కూడా […]
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలపై కరోనా ప్రభావం పడింది. దేశ, విదేశాల నుంచి భక్తులు వస్తుండడంతో కరోనా భయాలు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. తిరుమకు వెళ్లే దారులు మూసివేశారు. కొండపై ఉన్న భక్తులను ఖాళీ చేయిస్తున్నారు. మరికొద్ది గంటల్లో తిరుమలను అధికారికంగా మూసివేస్తారనే ప్రచారం సాగుతోంది. కరోనా ప్రభావంతో ఇప్పటికే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు మూతపడ్డాయి. భద్రాచలం రామయ్య పెళ్లి భక్తులు లేకుండానే చేయాలని తెలంగాణ ప్రభుత్వం […]