లాక్డౌన్ కారణంగా తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులను నిలిపివేసి 50 రోజులు దాటిపోయింది. తిరిగి ఎప్పుడు దర్శనాలను ప్రారంభిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ శ్రీవారి హుండీ ఖాళీగా ఉండడం లేదు. ప్రతిరోజూ అంతోఇంతో డబ్బులు హుండీలోకి వెళ్తున్నాయి. భక్తులు లేకుండా హుండీలోకి డబ్బులు ఎలా వెళ్తున్నాయి అనుకుంటున్నారా? అయితే ఇది చదవండి. శ్రీవారి ఆలయం గత కొద్ది రోజులుగా తెరుచుకోకపోయినా నిత్యం పూజారులు శాస్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అలాగే తిరుమలలో […]
ప్రతి రోజూ లక్షలాది మంది భక్తుల గోవింద నామ స్మరణతో మారుమ్రోగే తిరుమల గిరుల్లో గత నెల రోజులుగా నిశబ్ధం ఆవహించింది. కోట్లాది రూపాయల భక్తుల కానుకలతో గలగలలాడే హుండీలు వెలవెలబోతున్నాయి. మొత్తంగా కరోనా వల్ల కొనసాగుతున్న లాక్డౌన్ ప్రభావం తిరుమల కొండపై భారీగానే ఉంది. గత నెల 20 వ తేదీ నుంచి తిరుమల ఆలయం తెరుచుకోని విషయం తెలిసిందే. దీంతో మొక్కుల రూపంలో భక్తులు సమర్పించే నగదు, బంగారు, వెండితోపాటు దర్శన టికెట్లు, ఆర్జిత […]
కరొనా కల్లోలంలో ప్రజలను ఆడుకోవడంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కరొనా వైరస్ మహమ్మారి నుండి ప్రజలను కాపాడేందుకు కెంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తోడుగా టీటీడీ అందించనున్న సహాయ సహాకారాల గురించి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శనివారం మీడియా ప్రకటన ద్వారా వెల్లడించారు. లాక్ డౌన్ కారణంగా పనులు లేక అలమటిస్తున్న పేదలకు, అనాధలకు, ఈ లాక్ డౌన్ కాలంలో ప్రజలకు నిరంతరాయంగా […]
ప్రపంచంలోని అనేక దేశాలతో పాటుగా భారతదేశంలో కూడా అంచనాలకు భిన్నంగా కరోనా విస్తృతమవుతోంది. ముందస్తు చర్యలతో ప్రభుత్వం స్పందిస్తోంది. వివిధ చర్యలకు పూనుకుంటోంది. అందులో భాగంగా ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం సహా ఆలయాల్లో భక్తుల రాకపోకలు నిలిపివేశారు. విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. ఇతర వ్యాపార, వాణిజ్య కూడళ్లలో ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోం ప్రకటించింది. సిబ్బందికి తగిన రీతిలో జాగ్రత్తలు సూచించింది. ఇక […]
ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి వెంకన్న ఆలయం మూసివేశారు. కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తున్న తరుణంలో ఆలయం మూసివేయాల్సిన పరిస్థితి తలెత్తింది. నిన్న గురువారం అలిపిరి గేట్లను మూసివేసిన అధికారులు, కొండపైన ఉన్న భక్తులకు స్వామి వారి దర్శనం వేగంగా చేయించి కిందకు పంపించారు. ఆ తర్వాత ఆలయం మూసివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. శ్రీవారి ఆలయం మూసివేడం చరిత్రలో ఇది రెండోసారి. శతాబ్ధాల చరిత్ర ఉన్న తిరుమల వెంకన్న ఆలయం మొదటి సారి 128 […]