అవినీతి, కుంభకోణాలు, అక్రమాలు చేసిన తమ నేతలను పార్టీ నేతలను వెనకేసుకురావడంలో టిడిపి అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు దేశంలో మరెవ్వరూ సాటిరారు. ఎంత అవినీతి చేసినా…ఎన్ని అక్రమాలు చేసినా ఫర్వాలేదు. ప్రజలను ఎలా దోచుకున్నా ఫర్వాలేదు. కాని పార్టీతోనే ఉండాలి. అవినీతి అక్రమాలు చేసైనా పార్టీని నిలబెట్టాలి అని చంద్రబాబు నిరంతరం ఆలోచిస్తాడు. ఈ క్రమంలోనే ఈఎస్ఐ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కె.అచ్చెన్నాయుడును పక్కా ఆధారాలతో ఎసిబి అరెస్టు చేసింది. తప్పు చేసిన […]
టిడిపి మాజీ మంత్రి, అసెంబ్లీలో టిడిపి ఉపనేత కె.అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు. అందుకు ఎసిబి ఆధారాలతో ఆయనను అరెస్టు చేశారు. దీనిపై టిడిపి దాని అనుకూల మీడియా గగ్గోలుపెడుతుంది. ఒక అవినీతి పరుడును అరెస్టు చేస్తే దానికి కులం, ప్రాంతాన్ని పులుముతూ రెచ్చగొడుతున్నారు. అచ్చెన్నాయుడు అరెస్టు విషయంలో టిడిపి ఒంటరి అయింది. బిజెపి, తదితర పార్టీలు అరెస్టును స్వాగతిస్తున్నాయి. అయితే జనసేన మీన మేషాలు లెక్కిస్తున్నా…ఆ పార్టీ సీనియర్ నేత, జనసేన అధినేత అన్నయ్య, […]
ఇటీవలి కాలంలో మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు ట్వీట్లతో సంచలనం సృష్టిస్తున్నారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో షూటింగ్ లన్ని ఆగిపోవడంతో ఇళ్లకే పరిమితమైన సినీ తారాలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్నారు. అందులో భాగంగానే మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు వివిధ రాజకీయ అంశాలపై ట్వీట్లు చేస్తున్నారు. ఇటీవలి నాథూరాం గాడ్సేను దేశ భక్తుడుగా కీర్తించిన ట్విట్ దుమారం రేపింది. తీవ్ర విమర్శలకు గురైంది. తరువాత ఆయన నివారణ చర్యలు మొదలపెట్టారు. ఆ […]
టిడిపి ప్రతి ఏడాది నిర్వహించే మహానాడు ఈ నెల 27, 28 తేదీల్లో జూమ్ ద్వారా జరిగింది. టిడిపి ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ మహానాడుకు కొంత మంది నేతలు డుమ్మా కొట్టారు. కొంత మంది హాజరైనా బహిరంగంగానే తమ అసంతృప్తిని వెల్లగక్కారు. ఈ మహానాడు కేవలం అధికార వైసిపిని తిట్టడానికి, చంద్రబాబును పొగుడుకోవడానికి పెట్టినట్టు జరిగింది. టిడిపిలో నేతలెవ్వరూ కృషి లేనట్లు..ఒక్క చంద్రబాబు కృషి మాత్రమే ఉన్నట్లు ఆయనను సంతృప్తి పరిచేందుకే ఆయన భజన బృందం మొగ్గు […]
“మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఓటమికి ప్రధాన కారణం రాయలసీమే” .. ఇది తాజాగా చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్య. రెండు రోజుల డిజిటల్ మహనాడు ముగింపు సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మొన్నటి ఎన్నికల్లో పార్టీ పది శాతం తేడాతో ఓడిపోయిందన్నారు. ఇందులో రాయలసీమలోనే బాగా దెబ్బ పడిందని చెప్పారు. నిజమే రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో టిడిపి గెలిచింది కేవలం మూడంటే మూడు సీట్లు మాత్రమే. కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లోని 52 అసెంబ్లీ సీట్లలో టిడిపి గెలిచింది […]
కరోనా వైరస్ (కోవిడ్-19) ఎఫెక్ట్ టిడిపి కార్యాలయానికి తాకింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి రెవెన్యూ అధికారులు కరోనా వైరస్ (కోవిడ్-19) నోటీసు జారీ చేశారు. మహానాడు జరుగుతున్నందున కరోనా నివారణ చర్యలు తీసుకోవాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ మేరకు మంగళగిరి తహసీల్దార్ పేరిట నోటీసు జారీ చేశారు. టిడిపి కార్యాలయ కార్యదర్శి రమణకు ఆత్మకూరు వీఆర్వో నోటీసు అందజేశారు. రెండ్రోజుల పాటు టిడిపి కార్యాలయంలో మహానాడు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. లాక్ […]
క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అందరిలోను ఇవే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పొద్దున లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకూ జగన్మోహన్ రెడ్డి సర్కార్ పై పదే పదే ఆరోపణలు చేస్తు, ఎల్లోమీడియాలో రాయిస్తు చంద్రబాబు కాలం గడిపేస్తున్నాడు. చంద్రబాబు చేస్తున్న ఆరోపణలైనా, ఎల్లోమీడియాలో అచ్చవుతున్న రాతలైనా అబద్ధాలే అన్న విషయం అందరికీ తెలిసిపోతోంది. ఇదే పద్దతిలో రాజకీయాలు చేసుకుంటూ పోతే చివరకు చంద్రబాబు నిజం చెప్పినా జనాలు నమ్మలేని స్ధితి తెచ్చుకుంటున్నాడు. చంద్రబాబు వ్యవహార శైలిపై అందరికీ […]
రైతులను ఆదుకోవటానికి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన రైతు భరోసా పథకంలో రైతులకు డబ్బులు అందుతున్నట్లు మొత్తానికి చంద్రబాబునాయుడు అంగీకరించాడు. ఒకవైపు జగన్ రైతులకు డబ్బులు ఇస్తున్నట్లు అంగీకరిస్తునే అదే సమయంలో తన హయాంలో రైతులకు డబ్బులు అందలేదని కూడా అంగీకరించాడు. పార్టీ మండల స్ధాయి నేతలతో చంద్రబాబు మాట్లాడుతూ రైతు భరోసా పథకంలో రైతులకు ఏడాదికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రూ. 37500 ఇస్తున్నట్లు అంగీకరించాడు. ఇదే సమయంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉండుంటే ప్రతిరైతుకు అన్నదాత-సుఖీభవ […]
చంద్రబాబునాయుడు మాటలు విని చివరకు తెలుగుదేశంపార్టీ నేతలే నవ్వుకుంటున్నారా ? అవుననే సమాధానం వస్తోంది. ఎల్జీ కంపెనీ అనుమతుల విషయంలో టిడిపి ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదని చంద్రబాబు చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. నేతలతో జరిగిన టెలికాన్ఫరెన్సులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు నవ్వుల పాలవుతోంది. తాజాగా ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ నుండి స్టైరిన్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనకు బాధ్యులు మీరంటే మీరేనంటూ టిడిపి, వైసిపి నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో నానా గోల జరుగుతోంది. ఇక్కడ కంపెనీకి అనుమతులు […]
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్ల తమకు నమ్మకం లేదని విశాఖ ఘటనపై నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు కేంద్ర ప్రభుత్వం విచారణ బృందాన్ని ఏర్పాటు చేయాలని టిడిపి కమిటీ కోరింది. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ లో చోటుచేసుకున్న ప్రమాదం పై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నిర్మించిన నలుగురు సభ్యుల కమిటీ ఈరోజు ఆస్పత్రిలో బాధితులను పరామర్శించింది. ఘటన ప్రదేశాన్ని సందర్శించిన కమిటీ సభ్యులు అచ్చెన్నాయుడు నిమ్మకాయల చినరాజప్ప అయ్యన్నపాత్రుడు నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ విశాఖపట్నంలో […]