iDreamPost
android-app
ios-app

చినబాబుపై చిన్న చూపేలా రాధాకృష్ణా..!?

చినబాబుపై చిన్న చూపేలా రాధాకృష్ణా..!?

మాజీ మంత్రి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమర్థతపై ఇప్పటికే ఒక అంచనాకు వచ్చిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ… పార్టీ నడపడం చంద్రబాబు తనయుడుకు సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చేసినట్లు ఉన్నారు. నిన్నమొన్నటి వరకు చిన్నబాబుకు విపరీతమైన కవరేజ్ ఇచ్చిన ఆంధ్రజ్యోతి క్రమంగా ఆయనకు ప్రాధాన్యతను తగ్గిస్తోంది. తాజాగా నిన్న జరిగిన విశాఖ ఘటనపై టిడిపి లోని కింది స్థాయి నేతలు ప్రకటనలు కూడా ప్రచురించిన ఆంధ్రజ్యోతి పత్రిక చినబాబు సంతాప ప్రకటనకు మాత్రం చోటివ్వలేదు.

టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు, మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, చినరాజప్ప, అచ్చెన్నాయుడు, అమర్నాథ్ రెడ్డి , కిడారి శ్రావణ్, నేతలు సత్యనారాయణమూర్తి, గద్దె రామ్మోహన్ రావు, ఆదిరెడ్డి భవాని, బిటి నాయుడు, దోనెపూడి పవన్, కార్మిక విభాగం రాష్ట్ర కన్వీనర్ ఆర్ రామ్మోహన్రావు, చివరకు మహిళా నేత దివ్యవాణి ట్వీట్లు కూడా ప్రచురించిన ఆంధ్రజ్యోతి చినబాబు ను మాత్రం విశ్వసించడం గమనార్హం.

విశాఖ ఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని.. బాధితులకు తన సానుభూతిని తెలియజేస్తున్నాం అని.. పార్టీ శ్రేణులు బాధితులకు సహాయ కార్యక్రమాలు చేపట్టాలని.. లోకేష్ నిన్న ట్విట్టర్లో కోరారు. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ ప్రకటనను ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించికపోవడంపై టిడిపి శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. బిజెపి, కాంగ్రెస్, సిపిఐ, ఎమ్మార్పీఎస్ నేతల ప్రకటనలు వారి ఫొటోలతో సహా ప్రముఖంగా ప్రచురించిన ఆంధ్రజ్యోతి.. లోకేష్ పేరు కూడా ఎక్కడా ప్రస్తావించక పోవడం వెనుక అంతర్యం ఏమిటన్నది రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది.