Idream media
Idream media
ఇటీవలి కాలంలో మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు ట్వీట్‌లతో సంచలనం సృష్టిస్తున్నారు. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో షూటింగ్ లన్ని ఆగిపోవడంతో ఇళ్లకే పరిమితమైన సినీ తారాలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. అందులో భాగంగానే మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు వివిధ రాజకీయ అంశాలపై ట్వీట్లు చేస్తున్నారు. ఇటీవలి నాథూరాం గాడ్సేను దేశ భక్తుడుగా కీర్తించిన ట్విట్ దుమారం రేపింది. తీవ్ర విమర్శలకు గురైంది. తరువాత ఆయన నివారణ చర్యలు మొదలపెట్టారు. ఆ తరువాత సినీ ప్రముఖుల సమావేశంపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఇలా అవకాశం వచ్చినప్పుడు ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు.
ఇటీవలి నాగబాబు చేసిన ట్విట్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఆంధప్రదేశ్‌లో టిడిపి మాత్రం అధికారంలోకి రాదని స్పష్టం చేశారు. ఆయన ట్వీట్టర్లో ఇలా పేర్కొన్నారు…”ఏపిలో అధికారంలోకి వైసిపి తరువాత వైసిపి పార్టీ వస్తుందో..జనసేన వస్తుందో…బిజెపి వస్తుందో కాలమే నిర్ణయించాలి. కానీ టిడిపి మాత్రం రాదని నమ్మకంగా చెబుతున్నాను. ఎందుకంటే టిడిపి హయంలో ఏపి ప్రజలకి ఊడబోడిచిందీ ఏమీలేదు. అభివృద్ధి అంతా టీవీల్లోనూ, పేపర్లోనూ తప్ప నిజంగా చేసింది చాలా తక్కువ. క్షేత్రస్థాయిలో కనిపించింది తక్కువ. అవినీతి, ఇసుక మాఫియా, కాల్ మనీ అబ్బో ఇంకా చాలా ఉన్నాయి. ఈ ట్విట్టర్ ఎం సరిపోతుంది. లక్షల పేజీల గ్రంధాలే రాయొచ్చు. అందుకే ఎన్నికలలో చాలా ఘోరంగా ఓడిపోయిందని టిడిపి వారు గుర్తించాలి” అని టిడిపిపై విమర్శలు గుప్పించారు.
”మళ్లీ మేము అధికారంలో వస్తామని టిడిపి భ్రమల నుంచి బయటపడాలి. అలాకాదు మేము ఇలాంటి పగటి కలల్లో జీవిస్తామంటే దాన్ని స్వాగతిస్తాను. కాకపోతే మానసిక శాస్త్రంలో అలాంటి పరిస్థితిని భ్రాంతులు అంటారు. మీ భ్రాంతులకు ఆల్ ది బెస్ట్” అని వ్యంగ్య ట్విట్ చేశారు.
దీనిపై తెలుగు తమ్ములు ఏ మంటారో చూడాలి. చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఎందుకంటే జనసేన, టిడిపి అధినేతలకు బయటకు కనిపించని సంబంధం ఉంది. ఇది తెలిసి నాగబాబు ట్విట్లు చేశారో…లేక తెలియక చేశారో కాని, ఈ ట్విట్లు తెలుగు తమ్ముళ్లులో ఆగ్రహన్ని గురి చేశాయి.