ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ కరోనా వ్యాపించకుండా సరైన జాగ్రత్తలు తీసుకుని పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తామని మీడియా సమావేశంలో వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించడం మంచిది కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.
టిడిపి మాజీ మంత్రి, అసెంబ్లీలో టిడిపి ఉపనేత కె.అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు. అందుకు ఎసిబి ఆధారాలతో ఆయనను అరెస్టు చేశారు. దీనిపై టిడిపి దాని అనుకూల మీడియా గగ్గోలుపెడుతుంది. ఒక అవినీతి పరుడును అరెస్టు చేస్తే దానికి కులం, ప్రాంతాన్ని పులుముతూ రెచ్చగొడుతున్నారు. అచ్చెన్నాయుడు అరెస్టు విషయంలో టిడిపి ఒంటరి అయింది. బిజెపి, తదితర పార్టీలు అరెస్టును స్వాగతిస్తున్నాయి. అయితే జనసేన మీన మేషాలు లెక్కిస్తున్నా…ఆ పార్టీ సీనియర్ నేత, జనసేన అధినేత అన్నయ్య, […]
2024 ఎన్నికల్లో టీడీపీ మాత్రం అధికారంలోకి రాదు.. అని కుండబద్దలు కొట్టిన మెగా బ్రదర్స్ నాగబాబు సరికొత్త చర్చలకు తెరతీసారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేనలు ఎలక్షన్స్కు వెళ్ళాయి. కానీ 2019లో జనసేన బీజేపీతో జతకట్టడం.. ఆ తరువాత వచ్చిన ఫలితాలు తెలిసిందే. అయితే ప్రస్తుతం వాయిదా పడ్డ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ ఎదుర్కోనేందుకు క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేనలు అనధికారికంగా కలిసి పనిచేస్తున్న విషయం బహిరంగ రహస్యమే. పార్టీల బలాబలాలను అనుసరించి ఇరు పార్టీలు […]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష నేత పాత్ర పోషించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలిసో, తెలియకో లేదా.. షూటింగ్లు లేక ఖాళీగా ఉన్నాడనో ఈ రోజు భవన నిర్మాణ కార్మికులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 150 మందితో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ భవన నిర్మాణ ఇసుక కొరత సమస్య ఎదుర్కొంటోందన్నారు. ఇసుక సరఫరాను సులభతరం చేయాలని డిమాండ్ చేశారు. ఇసుక విధానంలో గత ప్రభుత్వం చేసిన తప్పదమే ఈ […]
ఏ విషయంలో కూడా రెండు పార్టీలు కలిసి పనిచేసింది పెద్దగా లేదు. రెండు పార్టీలో పొత్తులు పెట్టుకున్నట్లు చాలా ఆర్భాటంగా ప్రకటనలు చేసిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఒక్క కార్యక్రమం కూడా రెండు పార్టీలు కలిసి చేసిందే లేదు. పైగా ఏ పార్టీకాపార్టీనే కార్యక్రమాలను విడివిడిగా చేసుకుంటున్నాయి. ఇక తాజాగా కమలనాధుల వ్యవహారం చూస్తుంటే జనసేనతో దూరమైపోయినట్లేనా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ స్కీమ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి […]
ముందుండే వాడే నాయకుడు. ముందు చూపుతో వ్యవహరించేవాడే మార్గదర్శకుడు. కష్టాలు వచ్చినప్పుడు ప్రజలకు అండగా ఉండడమే అసలైన నాయకత్వం. ఆపదలో తోడుగా ఉండడమే నిజమైన నేతృత్వం. అందుకే ఇప్పుడు జగన్ ప్రభుత్వ తీరు మీద హర్షాతికేతాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా విశాఖలో ఎల్జీ పాలిమర్స్ నుంచి గ్యాస్ లీక్ ఘటనలో ప్రభుత్వ పనితీరు ని అనేక మంది అభినందిస్తన్నారు. బాధితులు కూడా తమకు ప్రభుత్వం భరోసాగా నిలిచిందనే ధీమాతో ఉన్నారు. టీడీపీ, జనసేన కార్యకర్తలు కొందరు కంపెనీ ముందు […]
వై.యస్ జగన్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి తెలుగుదేశం, జనసేన పార్టీ మద్దతుదారులుగా చెప్పుకునే కొంత మంది సోషల్ మీడియా వేదికగా అసత్యాలను, అర్ధసత్యాలను ప్రచారం చేస్తూ ప్రభుత్వం పై నిత్యం బురదజల్లే కార్యక్రమం పెట్టుకున్నారు. కొంత మంది పరిధి దాటి నాయకులని నిత్యం అసభ్య పదజాలంతో దూషించడం. సమాజంలో కులం మతం పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసి అశాంతిని రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. విధాన పరంగా కాకుండా ఒక నిర్ధిష్ట ఎజండాతో ప్రభుత్వాన్ని ముఖ్యంగా […]
జనసేన అసలు ఓ రాజకీయ పార్టీయేనా అనేది చాలామందిలో ఉండే సందేహం. ఎందుకంటే ఆరేళ్ల క్రితం పుట్టిన ఆపార్టీకి ఒక్క జిల్లా కమిటీ కూడా లేదు. అసలు వారికి స్థానిక నాయకత్వం అనే మాటే ఉండదు. ఎవరికి వారే నాయకుడు అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. చివరకు తోచింది చెబుతూ ఉంటారు. అధినేత మాత్రం మధ్య మధ్యలో సినిమాలు కూడా చేస్తూ సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటారు. ఇక మొన్నటి సాధారణ ఎన్నికలకు ముందు, తర్వాత కూడా పార్టీని ఉత్తేజపరిచే […]
ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాణవాయువు లాంటి పోలవరాన్ని రాజకీయ స్వలాభం కోసం ఏదో ఒక రూపంలో అడ్డు కోవడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తునే ఉన్నాయి. దివంగత ముఖ్యమంత్రి వై.యస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదగా ప్రారంభమైన నాటి నుండే వైరి పక్షాలు కోర్టులలో కేసులు వేస్తూ అడ్డు తగిలే ప్రయత్నం చేస్తూ వచ్చాయి. గడచిన తెలుగుదేశం పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన పోలవరం జగన్ ముఖ్యమంత్రి అవ్వగానే జలవనరుల శాఖామాత్యులు అనిల్ యాదవ్ గారి ఆద్వర్యంలో పలుపనులు వేగంగా […]
ట్విట్టర్ వేదికగా వైసీపీ ముఖ్య నేత, ఎంపీ విజయసాయిరెడ్డి.. జనసేన నేత, నటుడు నాగబాబు లు మాటల యుద్ధానికి దిగారు. వారిద్దరి మధ్య విమర్శలు శృతిమించి వ్యక్తిగత దూషణల వరకు వెళ్లాయి. కరోనా వైరస్ పై మొదలైన రాజకీయం చివరికి 2019 ఎన్నికలు, పొత్తులు గెలుపోటముల వరకు వెళ్ళింది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా ఘాటు వ్యాఖ్యలు చేసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి సర్కారు తీసుకుంటున్న […]