iDreamPost
iDreamPost
ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాణవాయువు లాంటి పోలవరాన్ని రాజకీయ స్వలాభం కోసం ఏదో ఒక రూపంలో అడ్డు కోవడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తునే ఉన్నాయి. దివంగత ముఖ్యమంత్రి వై.యస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదగా ప్రారంభమైన నాటి నుండే వైరి పక్షాలు కోర్టులలో కేసులు వేస్తూ అడ్డు తగిలే ప్రయత్నం చేస్తూ వచ్చాయి. గడచిన తెలుగుదేశం పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన పోలవరం జగన్ ముఖ్యమంత్రి అవ్వగానే జలవనరుల శాఖామాత్యులు అనిల్ యాదవ్ గారి ఆద్వర్యంలో పలుపనులు వేగంగా జరగడమే కాకుండా గత ప్రభుత్వంలో దోపిడీకి గురైన సుమారు 800 కోట్లు రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదా చేయగలిగారు.
ఏదో ఒక రూపంలో జగన్ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసి రాజకీయ లబ్ది పొందాలని చూసే పక్షాలు కోర్టుల్లో కేసులు వేస్తూ నిత్యం సంక్షేమానికి అడ్డు తగులుతూనే వస్తున్నాయి. ఒక పక్క 2021 జూన్ లోపు పోలవరం పూర్తి చేయలని దృడ నిశ్చయంతో ఉంటే మరో పక్క జనసేన అద్యక్షుడు పవన్ కల్యాణ్ పోలవరం పనులు సాగటంలేదు అని ఆయన సహజ పందాలో ట్విట్టర్లో విమర్శలు గుప్పిస్తూవచ్చారు. అయితే ఇప్పుడు తాజాగా జనసేన నాయకులు చేసిన నిర్వాకంతో ఆ పార్టీ పోలవరం పై ఎంత చిత్త శుద్దితో ఉందో అర్ధం అవుతుంది.
లాక్ డౌన్ నిబందనలను కేంద్ర జలశక్తి శాఖ ఉల్లంఘించి పోలవరం పనులు కొనసాగిస్తుందని, కార్మికులు కరోనా బారిన పడే అవకాశం ఉందని జనసేన ఏలూరు పార్లమెంట్ అభ్యర్ధి, జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు పెంటపాటి పుల్లారావు సుప్రీం కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ జస్టిస్ ఎన్.వి రమణ నేతృత్వంలోని త్రిసభ్య దర్మాసనం పరిశీలించి పిటీషన్ లో మెరిట్ లేదంటూ కొట్టేసింది. అయితే ప్రభుత్వం అన్ని జాగ్రత్తలను పాటిస్తూ పోలవరాన్ని పూర్తి చేసి ఆంద్రప్రదేశ్ ని తిరిగి అన్నపూర్ణ గా మార్చాలని శతవిధాల ప్రయత్నిస్తుంటే ఒక పక్క ప్రజల్లో పోలవరం పై ప్రేమ ఒలకపోస్తు మరోపక్క కోర్టుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం ప్రతిపక్షాలు చేయడం శోచనీయం.