ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశం జరుగుతున్న వేళ ప్రతిపక్ష నేత, మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి, సంక్షేమంపై అత్యంత ముఖ్యమైన బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సమయంలో చంద్రబాబు తన పార్టీ సభ్యులతో సభ నుంచి వెళ్లిపోవడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ప్రారంభించిన వెంటనే చంద్రబాబు, టీడీపీ సభ్యులు సభ నుంచి […]
చంద్రబాబు నాయుడు గురించి అభిమానులు విజనరీ అని, అపర చాణక్యుడు అని, గిట్టనివారు మీడియా మేనేజర్ అని, మానిప్యులేటర్ అనీ అంటారు. అయితే ఎవరైనా ఒప్పుకునే విషయం ఏమిటంటే ఆయన ఎంతటి క్లిష్టమైన పరిస్థితిలో అయినా నిబ్బరం కోల్పోకుండా ఉంటారన్నది. ఎన్టీఆర్ ని దించిన ఆగస్టు సంక్షోభం సమయంలో కానీ, తన నాయకత్వంలో విజయం సాధించినప్పుడు కానీ, రాజశేఖర రెడ్డి చేతిలో రెండు సార్లు వరుసగా ఓడిపోయినప్పుడు కానీ చెక్కుచెదరకుండా నిలిచి ఉన్నాడు. ఓడిపోయినందుకు కృంగిపోకుండా రాబోయే […]
‘‘సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుని ముందుకు పోతాం’’ పలు సందర్భాల్లో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ఇది. గతంలో ఆయన ఈ మాట చెప్పినప్పుడల్లా ఏదో చెబుతున్నాడులే అనుకున్నారు. కానీ చంద్రబాబు చెప్పిన మాట అక్షర సత్యమని ఈ రోజు రుజువైంది. సంక్షోభాలను చంద్రబాబు తన రాజకీయానికి అవకాశాలుగా ఎలా మలుచుకుంటారో ఆయన్ను గమనించే వారికి ఈ రోజు బోధపడింది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు ఒక్కొక్కరుగా టీడీపీని వీడుతున్నారు. […]
ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు తన కుమారుడు మాజీ మంత్రి నారా లోకేష్‌తో కలసి తాడేపల్లి నుంచి హైదరాబాద్ పయనమయ్యారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకంటూ 63 రోజుల తర్వాత రాష్ట్రానికి వచ్చేందుకు అనుమతి తీసుకున్నారు. 25వ తేదీన హైదరాబాద్ నుంచి విశాఖకు అక్కడ నుంచి సాయంత్రం రోడ్డు మార్గాన తాడేపల్లికి చేరుకునేందుకు ఏపీ డీజీపీ నుంచి అనుమతి తీసుకున్నారు. అయితే 25వ తేదీన విమాన […]
రాష్ట్రంలో రాజకీయంగా , సామాజికంగా ఎన్ని మార్పులు జరిగినా తెలుగుదేశం పార్టికి వంత పాడే పత్రికలకు , మీడియా ఛానల్లకు అవేమి పట్టవు. చంద్రబాబు నాయుడు గారు ఏ స్థానంలో ఉన్నా , ఏ హోదాలో ఉన్నా వారికి మాత్రం ఆయన ఇంకా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నట్టే భ్రమించుకుంటారు. గడచిన ఏడాదిగా రాష్ట్రం ఎంత మేరకు అభివృద్ది సాదించింది, ఏ మేరకు వాటి నుండి సత్ఫలితాలు సాదిస్తున్నాము అనే చర్చని ముఖ్యమంత్రి జగన్ గారు “మన పాలన […]
ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వ పరిపాలన ప్రతిపక్ష పార్టీకి విమర్శలు, ఆరోపణలు చేసేందుకు ఎలాంటి అవకాశం లేకుండా సాగుతోంది. పరిపాలన, సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి విమర్శలు చేసేందుకు అవకాశం లేకుండా పోతుండడంతో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుకి ఏమి చేయాలో పాలుపోవడంతో లేదు. అందుకే రంధ్రాన్వేషణ చేసి కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్న చందంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో కరెంట్ బిల్లులు పెంచారంటూ టీడీపీ గగ్గొలు పెడుతోంది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా […]
కరెంట్ చార్జీలను మూడు నెలల పాటు రద్దు చేయాలని ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు కొత్త డిమాండ్‌ను ప్రారంభించారు. బాబు చేసిన డిమాండ్ చేసిన విషయం అటుంచితే.. రద్దు అనే మాట ఆయన నోట నుంచి రావడంతో చరిత్రను గుర్తు చేశారు. రద్దు అనే మాటకు, చంద్రబాబుకు అవినాభావ సంబంధం ఉంది. ఆ రద్దు అనే మాట వల్ల చంద్రబాబు లాభ పడినా అంతకు మించి ప్రజలను కోలుకోలేని విధంగా నష్టపరిచారు. . 2014 ఎన్నికల్లో […]
నిన్న బుధవారం సినీ నటుడు, అభిమానులు ముద్దుగా యంగ్ టైగర్‌గా పిలుచుకునే జూనియర్ ఎన్టీఆర్ 37వ పుట్టినరోజు. లాక్డౌన్ ఉన్నా.. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జూనియర్ పుట్టిన రోజును కేకులు కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు జూనియర్ ఎన్టీఆర్‌కు పుట్టిరోజు శుభాకాంక్షలు చెబుతూ ఫేస్బుక్, ట్వీట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్టులతో హోరెత్తించారు. కానీ తెలుగుదేశంపార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా […]
ఎన్నికల మ్యానిఫెస్టో అంటే తమ ఆశలు ఆశయాలు తీర్చే భరోసాపత్రం అనే స్థాయి నుండి ఓటర్లను నమ్మించి మోసం చేయటానికి తయారు చేసిన ఒక చిత్తు కాగితం అనే భావన ప్రజల్లో నాటుకుపోయేలా చేసిన ఘనత రాజకీయ నాయకులది. తాము ఎన్నుకునే నాయకులు కొండంత చెబుతారు కానీ పిసరంతయిన చేయకపోతారా అని బేరీజు వేసుకుని ఓటర్లు నాయకులను ఎన్నుకునే దుస్థితి ఏర్పడింది అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో మ్యానిఫెస్టో అనే మాట ఎంత చులకనైందో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా […]
మాములుగా ఏదైనా హీరోది కొత్త సినిమా ఓపెనింగ్ అంటే ఒకటే చూస్తాం. లేదూ ఏదైనా ప్రత్యేకత ఉంది అంటే ఒకే రోజు రెండు మొదలుపెట్టడం చాలా అరుదుగా జరుగుతుంది. అలా కాకుండా ఏకంగా 9 సినిమాలు ఒకే రోజు మొదలుపెట్టుకున్న హీరో ఉన్నారంటే కొందరు నమ్మకపోవచ్చేమో. కానీ 2002 సంవత్సరం మార్చ్ 24న ఇది జరిగింది. స్వర్గీయ ఎన్టీఆర్ వారసుల్లో ఒకరైన మోహనకృష్ణ తనయుడు తారకరత్నను లాంచ్ చేస్తూ ఏకంగా తొమ్మిది ప్రాజెక్టులకు ముహూర్తపు షాట్ కొట్టడం […]