తెలంగాణలో ఒకవైపు అధికార పార్టీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహిస్తుంటే…మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ జల దీక్షలతో ఆందోళనలు చేస్తుంది. తెలంగాణలో ఒకపక్క ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు జరుగుతుంటే…మరోపక్క ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు అరెస్టులు చోటు చేసుకున్నాయి. ఈ రెండు పరిణామాలు తెలంగాణలో సర్వత్రా చర్చ జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గన్పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఆయనతో పాటు రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, సిఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్రెడ్డి, […]
కాంగ్రెస్ పార్టీలో కలహాలు కొత్తేమీ కాదు… సాధారణ స్థాయి పోస్ట్ నుంచి.. సీఎం స్థాయి సీటు వరకూ ఏ అంశం తెరపైకి వచ్చినా నాయకులందరూ… నాకంటే నాకు ఇవ్వాలంటూ.. పోటీ పడతారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు. ఇప్పుడు తెలంగాణ పీసీసీ పీఠం కోసం కూడా అదే జరుగుతోంది. రేసులో నేను ఉన్నాను అంటే.. నేనున్నాను అని పార్టీ కీలకంగా భావించే నేతలందరూ బాహాటంగానే ప్రకటిస్తున్నారు. ప్రధానంగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్, సంగారెడ్డి ఎమ్మెల్యే […]
దేశంలో కరోనా వైరస్ (కోవిడ్-19) కట్టడిలో కేంద్రప్రభుత్వ వైఫల్యాలపై చర్చించేందుకు ప్రతిపక్ష పార్టీలు నేడు భేటీ కానున్నాయి. వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా జరిగే ఈ సమావేశంలో దాదాపు 20 పార్టీల నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షత వహించనున్న ఈ సమావేశాన్ని ఆ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ సమన్వయం చేస్తున్నారు. మార్చి 24న దేశవ్యాప్త లాక్డౌన్ విధించినప్పటి నుంచి ఈ రకమైన సమావేశానికి సోనియాగాంధీ అధ్యక్షత వహించడం ఇదే […]
కరోనా ఆపత్కాలంలో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ తన పెద్ద మనసు చాటుకున్నారు. లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పేదలు కార్మికులు వలస కూలీల ఆదుకోవాలంటూ పలు సూచనలు కేంద్ర ప్రభుత్వానికి చేసిన సోనియా గాంధీ.. ఇప్పుడు వారిని తమ శక్తి మేరకు ఆదుకునేందుకు నేరుగా రంగంలోకి దిగారు. దేశంలో మూడో విడత లాక్ డౌన్ ఈ రోజు నుంచి ప్రారంభమవుతుండగా..ఇప్పటికే వలస కార్మికులు, కూలీలను వారి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. […]
ఎవరికి నచ్చినా..లేకున్నా అర్నబ్ గోస్వామీ ఇండియాలో వివాదాస్పద జర్నలిస్టులలో ఒకరు. అసోం నుంచి హస్తినకు వచ్చి, అనతికాలంలోనే గుర్తింపు పొంది, ఇప్పుడు ఒక టీవీ చానెల్ సహా యజమానికి గా మారిన క్రమంలో అర్నబ్ ప్రస్థానం ఆసక్తిగా కనిపిస్తుంది. ఇటీవల పూర్తిగా రైట్ వింగ్ ప్రతినిధిగా ఆయన తీరు కనిపిస్తోంది. మోడీకి బలమైన మద్ధతుదారుడిగానే కాకుండా, టీవీ చర్చలలో ఇతర పార్టీలు, భిన్నవాదనలు చేసే వారి పట్ల విరుచుకుపడే అర్నబ్ తీరు కూడా చాలామందిని ఆకట్టుకుంటుంది. అందుకు […]
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తిరిగి అధికారంలో కొనసాగేందుకు కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఒకే ఒక మార్గం మూసుకుపోయింది. తన ప్రభుత్వాన్ని బలం నిరూపించుకోవాలని గవర్నర్ జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ కాంగ్రెస్ ముఖ్య మంత్రి కమల్నాథ్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. గవర్నర్ నిర్ణయాన్ని సమర్థించింది. ఈ మేరకు పలుమార్లు ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం ఈరోజు సోమవారం 68 పేజీల సుదీర్ఘ తీర్పును వెల్లడించింది. మధ్యప్రదేశ్ లో 15 ఏళ్ల తర్వాత […]