ఇంకా తెలుగులో ఓటిటి ప్రకంపనలు మొదలుకాలేదా అనుకుండగానే ఆ దిశగా అడుగులు కాస్త గట్టిగానే పడబోతున్నట్టు సమాచారం. నిన్నటి దాకా అనుష్క నిశబ్దం మాత్రమే స్ట్రెయిట్ డిజిటల్ రిలీజ్ ఉంటుందన్న వార్త ఖరారు కాక ముందే ఇప్పుడు నాని వి లైన్ లోకి వచ్చేసింది. తాజా అప్ డేట్ ప్రకారం అల్లు అరవింద్ సంస్థ ఆహా ‘వి’ని భారీ మొత్తానికి కొనుగోలు చేసి త్వరలో వరల్డ్ ప్రీమియర్ గా వేయబోతున్నట్టు వినికిడి. ఇది అధికారికంగా చెప్పింది కాదు […]
లాక్ డౌన్ మొదలైన తొలి రోజుల్లో కొంత సైలెంట్ గానే ఉన్న ఓటిటి రంగం మెల్లగా విశ్వరూపం చూపడం మొదలుపెట్టింది. ఇప్పటిదాకా రిలీజైన వాటినే టెలికాస్ట్ చేస్తూ సొమ్ములు చేసుకున్న సంస్థలు తాజాగా విడుదల కానీ వాటిని కూడా నేరుగా ప్రేక్షకుల ఇళ్లలోకి తెచ్చేలా భారీ ప్రణాళికలు వేస్తోంది. ఈ విషయంలో అందరికంటే ముందంజలో ఉంటూ అమెజాన్ ప్రైమ్ మే, జూన్ నెలల్లో కనువిందు చేయబోతోంది. నిన్న బిగ్ బి అమితాబ్ బచ్చన్-ఆయుష్మాన్ ఖురానాల కొత్త మూవీ […]
కరోనా ప్రభావం వల్ల మొదట్లో తెలియలేదు కానీ మెల్లగా దాని తాలూకు సెగలు విపరీతం వైపు మళ్లుతున్నాయి. ఇప్పటికే థియేటర్ల యాజమాన్యాలు ఫీడింగ్ లేక హాళ్లు మూతబడి గగ్గోలు పెడుతుండగా జనం ఓటిటిలకు బాగా అలవాటు పడిపోతుండటం ఖంగారుని రెట్టింపు చేస్తోంది. ఈ రోజు టాలీవుడ్ లో మొదటి సినిమాగా అమృతరామమ్ డిజిటల్ స్ట్రీమింగ్ లో నేరుగా రిలీజయింది. అది చిన్న సినిమానా పెద్ద మూవీనా అన్నది ఇక్కడ అప్రస్తుతం. అడుగైతే పడిపోయింది. రేపు పెద్దవాళ్ళే దిగొచ్చు. […]
థియేటర్ల రీ ఓపెనింగ్ ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో చిన్న సినిమాల నిర్మాతలు మెల్లగా ఓటిటి వైపు అడుగులు వేస్తున్నారు. ఎక్కువ రోజులు ల్యాబుల్లో మగ్గితే పెట్టుబడికి వడ్డీలు కట్టడం భారమవుతుంది కాబట్టి వేరే ఆప్షన్ లేక డిజిటల్ ద్వారా ప్రేక్షకులకు చేరువయ్యే నిర్ణయం తీసుకున్నారు. తమిళ్ లో వచ్చేనెల భారీ ఎత్తున స్ట్రీమింగ్ యాప్స్ ద్వారా మూవీస్ క్యూ కడుతున్న నేపథ్యంలో తెలుగులో మాత్రం ఈ బోణి అమృతరామమ్ తో మొదలైంది. మరి ఇవాళే అందుబాటులోకి వచ్చి […]
కరోనా వల్ల షూటింగులు ఆగిపోయి థియేటర్లు మూతబడి తీవ్ర సంక్షోభంలో ఉన్న సినీ పరిశ్రమకు ఇప్పుడు ఓటిటి రూపంలో కొత్త సెగలు మొదలయ్యాయి. సూర్య నిర్మాణంలో భార్య జ్యోతిక ప్రధాన పాత్రలో రూపొందిన పోన్మగళ్ వన్తాళ్ ని మే మొదటి వారంలో ప్రైమ్ ద్వారా నేరుగా డిజిటల్ రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీన్ని నిరసిస్తూ తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు ఇకపై సూర్య సినిమాలు విడుదల కానివ్వబోమని తీర్మానించి ఆ మేరకు ప్రకటన చేయడం ఇప్పటికే […]
కరోనా వల్ల వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తం అయిపోవడంతో సినిమా రంగానికి దిక్కు తోచడం లేదు. హీరోలైతే ఇంట్లో రెస్టు తీసుకుంటూ వీడియోలు చేసుకుంటూ జనంలో కాస్త చైతన్యం తెచ్చే పనులు చేస్తున్నారు కానీ జరుగుతున్న పరిణామాలు నిర్మాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. థియేటర్లు తెరిచే సూచనలు ఇప్పుడిప్పుడే కనిపించడం లేదు. సురేష్ బాబు, అల్లు అరవింద్ లాంటి అగ్ర నిర్మాతలు ఈ ఏడాది వృథా అయినట్టే అన్న తరహాలో అభిప్రాయాలు వెలిబుచ్చడం పరిస్థితి తీవ్రతకు […]
థియేటర్లు మూతబడిపోయి ఇళ్లకే పరిమితమైన జనానికి ఓటిటినే బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తోంది. టీవీ ఛానల్స్ లో వేసిన సినిమాలే మళ్ళీ మళ్ళీ రుబ్బుతుండటంతో అందరూ డిజిటల్ కే ప్రాధాన్యం ఇస్తున్నారు. దానికి తగ్గట్టే యాప్స్ కూడా క్రమం తప్పకుండ కొత్త సినిమాలు అందించే ప్రయత్నం చేస్తున్నాయి. నిన్న విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఎలాగూ డిజాస్టర్ టాక్ వల్ల రిలీజ్ టైంలో చూడలేకపోయిన చాలా మంది ఇప్పుడు దీని […]