iDreamPost
iDreamPost
థియేటర్లు మూతబడిపోయి ఇళ్లకే పరిమితమైన జనానికి ఓటిటినే బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తోంది. టీవీ ఛానల్స్ లో వేసిన సినిమాలే మళ్ళీ మళ్ళీ రుబ్బుతుండటంతో అందరూ డిజిటల్ కే ప్రాధాన్యం ఇస్తున్నారు. దానికి తగ్గట్టే యాప్స్ కూడా క్రమం తప్పకుండ కొత్త సినిమాలు అందించే ప్రయత్నం చేస్తున్నాయి. నిన్న విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఎలాగూ డిజాస్టర్ టాక్ వల్ల రిలీజ్ టైంలో చూడలేకపోయిన చాలా మంది ఇప్పుడు దీని మీద లుక్ వేస్తున్నారు. అఫ్ కోర్స్ కంటెంట్ మీద అప్పుడే సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా వస్తున్నాయి అది వేరే సంగతి.
రేపు రెండు కొత్త మూవీస్ రాబోతున్నాయి. నాగ అశ్విన్ అశ్వద్ధామను సన్ నెక్స్ట్ విడుదల చేస్తోంది. ఇదీ ఆశించిన ఫలితం అందుకోలేదు కాని క్రైమ్ థ్రిల్లర్ కాబట్టి రెస్పాన్స్ బాగుంటుందనే అంచనాలు బలంగా ఉన్నాయి. ఇక రిలీజ్ టైంలో వీక్ ఓపెనింగ్స్ తో మొదలై తర్వాత వేగంగా పికప్ అయిన దుల్కర్ సల్మాన్ కనులు కనులను దోచాయంటేని నెట్ ఫ్లిక్స్ లో చూడొచ్చు. బాగా వసూళ్లు వస్తున్న టైంలో ఈ థ్రిల్లర్ కి కరోనా వల్ల బ్రేక్ పడింది. మంచి థియేట్రికల్ రన్ మిస్ అయ్యింది. తమిళ వర్షన్ రెండు వారాల క్రితమే వచ్చింది.
ఒకే రోజు రెండు ఒకే జానర్ ఎంటర్ టైన్మెంట్ ని ప్రేక్షకులు ఎంజాయ్ చేయొచ్చన్న మాట. ఆపై 10 రోజుల గ్యాప్ తో సన్ నెక్స్ట్ లో 27 నుంచి నితిన్ కెరీర్ బెస్ట్ బ్లాక్ బస్టర్ భీష్మని స్ట్రీమింగ్ చేయబోతున్నారు. నెల రోజులు తిరక్కుండానే కరోనా బారిన పడిన దీన్ని సినిమా హాల్ లో మిస్ చేసిన ఆడియన్స్ చాలానే ఉన్నారు. అందులోనూ రిపీట్ వేల్యూ ఉన్న కంటెంట్ కావడంతో దీనికీ స్పందన భారీగా ఉండొచ్చు. మొత్తానికి లాక్ డౌన్ ఎక్స్ టెన్షన్ జరిగిన వేళ వినోదానికి లోటు లేకుండా ఈ సంస్థలన్నీ టైం ప్రకారం కొత్త సినిమాలు వదులుతూనే ఉన్నాయి. హిందీ, తమిళ్ తో పాటు ఇతర భాషల్లోనూ ఇదే తరహాలో క్రేజీ మూవీస్ ని లైన్ లో పెడుతున్నారు.