iDreamPost

ఆ విషయంలో ప్లేయర్లంతా కసిగా ఉన్నారు.. రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • Published Jun 18, 2024 | 3:06 PMUpdated Jun 18, 2024 | 3:06 PM

టీ20 ప్రపంచ కప్ గ్రూప్​ స్టేజ్​లో అదరగొట్టిన టీమిండియా.. సూపర్ పోరుకు సిద్ధమవుతోంది. ఎదురొచ్చిన ప్రత్యర్థులను తొక్కుకుంటూ పోవాలని చూస్తోంది. సెమీస్ బెర్త్​ను ఖాయం చేసుకోవాలని భావిస్తోంది.

టీ20 ప్రపంచ కప్ గ్రూప్​ స్టేజ్​లో అదరగొట్టిన టీమిండియా.. సూపర్ పోరుకు సిద్ధమవుతోంది. ఎదురొచ్చిన ప్రత్యర్థులను తొక్కుకుంటూ పోవాలని చూస్తోంది. సెమీస్ బెర్త్​ను ఖాయం చేసుకోవాలని భావిస్తోంది.

  • Published Jun 18, 2024 | 3:06 PMUpdated Jun 18, 2024 | 3:06 PM
ఆ విషయంలో ప్లేయర్లంతా కసిగా ఉన్నారు.. రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

పొట్టి కప్పు గ్రూప్​ స్టేజ్​లో అదరగొట్టిన టీమిండియా.. సూపర్ పోరుకు సిద్ధమవుతోంది. ఎదురొచ్చిన ప్రత్యర్థులను తొక్కుకుంటూ పోవాలని చూస్తోంది. సెమీస్ బెర్త్​ను ఖాయం చేసుకోవాలని భావిస్తోంది. మెగాటోర్నీలో ఇప్పటివరకు ఆడిన మ్యాచుల్లో రోహిత్ సేన హవా నడిచింది. అమెరికా, ఐర్లాండ్​లను చిత్తుగా ఓడించిన మెన్ ఇన్ బ్లూ.. దాయాది పాకిస్థాన్ మీద చెమటోడ్చింది. ఆ మ్యాచ్​లో ఓటమి తప్పదనే సిచ్యువేషన్​లో పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా, ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేయడంతో విజయం సాధించింది. కెనడాతో జరగాల్సిన ఆఖరి మ్యాచ్ వర్షం వల్ల రద్దైంది. ఇప్పుడు సూపర్-8కు సిద్ధమవుతోంది భారత్. ఆఫ్ఘానిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్​తో అమీతుమీ తేల్చుకోనుంది.

సూపర్-8కు ముందు చాలా భారత్​కు కొన్ని సమస్యలు సవాల్ విసురుతున్నాయి. ఓపెనర్​గా వస్తున్న టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విఫలమవుతుండటం, కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఫామ్​లో లేకపోవడం, బంతితో రాణిస్తున్న హార్దిక్.. అదే మ్యాజిక్​ను బ్యాట్​తో కంటిన్యూ చేయలేకపోవడం టీమిండియాను ఇబ్బంది పెడుతున్నాయి. అయితే ఈ ఛాలెంజ్​లను అధిగమించేందుకు ఆటగాళ్లు చాలా శ్రమిస్తున్నారు. ఈ విషయం నెట్ సెషన్స్​ను గమనిస్తే అర్థమవుతుంది. కోచ్ ద్రవిడ్ పర్యవేక్షణలో విరాట్ గంటల కొద్దీ శ్రమించడం, బ్యాట్ ప్రాక్టీస్​లో మునిగిపోవడం వైరల్​గా మారింది. మిగిలిన ప్లేయర్లు కూడా తమ బలహీనతల్ని అధిగమించేందుకు ప్రయత్నించడం పాజిటివ్ అంశమనే చెప్పాలి. ఈ విషయంపై సారథి హిట్​మ్యాన్ రియాక్ట్ అయ్యాడు. ప్రస్తుతం జట్టు ఆటగాళ్లంతా ఎంతో ఆకలితో ఉన్నారని అతడు అన్నాడు.

టీమ్ ప్లేయర్లు అంతా కసితో ఉన్నారని రోహిత్ తెలిపాడు. సూపర్-8 మ్యాచుల్లో తమ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పాడు. మెగా టోర్నీ సెకండ్ స్టేజ్​ కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నామని పేర్కొన్నాడు. నాకౌట్ గేమ్స్​లో సమ్​థింగ్ స్పెషల్ చేయాలి.. జట్టు గెలుపు కోసం తమ కాంట్రిబ్యూషన్ అందించాలనే పట్టుదల ఆటగాళ్లందరిలోనూ కనిపిస్తోందని రోహిత్ వ్యాఖ్యానించాడు. హిట్​మ్యాన్ కామెంట్స్ విన్న అభిమానులు.. ఇక, భారత్​కు తిరుగుండదని అంటున్నారు. అమెరికా పిచ్​లపై టీమిండియా బ్యాటింగ్ యూనిట్ అంతగా రాణించలేదు. ఈ నేపథ్యంలో అందరూ కసిగా ఉన్నారంటూ రోహిత్ వ్యాఖ్యలు చేయడంతో.. బ్యాటర్లను ఉద్దేశించే అతడు ఇలా అన్నాడని నెటిజన్స్ అంటున్నారు. సూపర్-8లో మన బ్యాటర్లు చెలరేగి ఆడటం పక్కా అని చెబుతున్నారు. మరి.. రోహిత్ వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి