Nidhan
టీ20 వరల్డ్ కప్‌లో ఓటమి అనేదే లేకుండా సెమీస్‌కు దూసుకొచ్చింది భారత్. ఎదురొచ్చిన టీమ్‌ను చిత్తు చేస్తూ నాకౌట్ ఫైట్‌కు క్వాలిఫై అయింది. పటిష్టమైన ఇంగ్లండ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది.
టీ20 వరల్డ్ కప్‌లో ఓటమి అనేదే లేకుండా సెమీస్‌కు దూసుకొచ్చింది భారత్. ఎదురొచ్చిన టీమ్‌ను చిత్తు చేస్తూ నాకౌట్ ఫైట్‌కు క్వాలిఫై అయింది. పటిష్టమైన ఇంగ్లండ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది.
Nidhan
టీ20 వరల్డ్ కప్‌లో ఓటమి అనేదే లేకుండా సెమీస్‌కు దూసుకొచ్చింది భారత్. ఎదురొచ్చిన టీమ్‌ను చిత్తు చేస్తూ నాకౌట్ ఫైట్‌కు క్వాలిఫై అయింది. పటిష్టమైన ఇంగ్లండ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. టీ20 ప్రపంచ కప్-2022 సెమీస్‌లో ఇంగ్లీష్ జట్టు చేతిలో దారుణంగా ఓడిపోయింది మెన్ ఇన్ బ్లూ. ఏకంగా 10 వికెట్ల తేడాతో చిత్తయింది. ఆ మ్యాచ్‌లో భారత్ సంధించిన 168 పరుగుల టార్గెట్‌ను మరో 24 బంతులు ఉండగానే వికెట్ నష్టపోకుండా ఛేదించింది ఇంగ్లీష్ టీమ్. దీంతో అది మన టీమ్‌కు పీడకలగా మారిపోయింది. అప్పటివరకు బాగా ఆడుతూ వచ్చిన జట్టు.. ఇంగ్లండ్ దెబ్బకు కప్పుకు రెండు అడుగుల దూరంలోనే ఆగిపోయింది. ఆ ఓటమికి ఇప్పుడు రివేంజ్ తీర్చుకోవాలని చూస్తోంది రోహిత్ సేన. అందుకు అన్ని విధాలుగా ప్రిపేర్ అవుతోంది.
కెప్టెన్ రోహిత్ నేతృత్వంలోని బ్యాటింగ్ విభాగం, జస్ప్రీత్ బుమ్రా ఆధ్వర్యంలోని బౌలింగ్ యూనిట్ భీకర ఫామ్‌లో ఉండటంతో ఇంగ్లీష్ టీమ్ ఖేల్ ఖతం అని అంతా అంటున్నారు. మనోళ్ల దెబ్బకు బట్లర్ సేన తోకముడవడం గ్యారెంటీ అని.. ఈసారి భారత్‌దే కప్పు అని అభిమానులు చెబుతున్నారు. అయితే అంతా బాగానే ఉన్నా టీమిండియాను ఒక విషయం మాత్రం బాగా టెన్షన్ పెడుతోంది. విరాట్ కోహ్లీ కంటే అతడి ఫెయిల్యూర్ టీమ్‌ను మరింత భయపెడుతోంది. మెగాటోర్నీలో కోహ్లీ సరిగ్గా రాణించడం లేదనేది అందరికీ తెలుసు. ఓపెనర్‌గా వస్తూ పరుగులు చేయలేక ఆపసోపాలు పడుతున్నాడు. ఐసీసీ టోర్నీల్లో హయ్యెస్ట్ రన్ స్కోరర్స్‌లో టాప్‌లో ఉండే కింగ్.. ఈసారి 66 పరుగులతో లిస్ట్‌లో ఎక్కడో కింద ఉన్నాడు. అయితే అతడ్ని మించిన వైఫల్యం జడేజాది. విరాట్ ఫెయిల్యూర్ చాటున జడ్డూ వైఫల్యం ఎవరికీ కనిపించడం లేదు.
ప్రస్తుత వరల్డ్ కప్‌లో జడేజా దారుణ ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటిదాకా ఆడిన మ్యాచుల్లో కలిపి అతడు చేసిన పరుగులు కేవలం 16 మాత్రమే. బౌలింగ్‌లో కూడా కేవలం 1 వికెటే తీశాడు. అతడి బౌలింగ్ ఎకానమీ 7.80గా ఉంది. అటు బ్యాటర్‌గా, ఇటు బౌలర్‌గా అతడు ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. గ్రౌండ్ ఫీల్డింగ్‌లో రన్స్ కాపాడుతూ టీమ్‌కు అండగా నిలుస్తున్నాడు. కానీ అతడి నుంచి ఆఖర్లో విలువైన పరుగులు, వికెట్లను ఆశిస్తోంది జట్టు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఒక ఓవర్ వేసి ఏకంగా 17 రన్స్ ఇచ్చుకున్నాడు జడ్డూ. బ్యాటింగ్ టైమ్‌లో భారీ షాట్లు బాదలేక, బౌలింగ్ టైమ్‌లో వికెట్లు తీయలేక టీమ్‌కు భారంగా మారాడు జడ్డూ. దీంతో ఇతర ఆటగాళ్ల మీద ఒత్తిడి పెరుగుతోంది. నెక్స్ట్ ఇంగ్లండ్‌తో నాకౌట్ మ్యాచ్. అందులో ఎట్టి పరిస్థితుల్లోనూ జడ్డూ రాణించాలి. జట్టు గెలుపులో అతడు కీలక పాత్ర పోషిస్తే అందరూ మెచ్చుకుంటారు. ఏమాత్రం తేడా వచ్చినా జడేజా టీమ్‌కు దూరమయ్యే ప్రమాదం పొంచి ఉంది. మరి.. సెమీస్‌లో జడేజా సక్సెస్ అవుతాడని మీరు అనుకుంటే కామెంట్ చేయండి.