iDreamPost
android-app
ios-app

వీడియో: ఒకే ఓవర్​లో ఏకంగా 46 పరుగులు.. ఇంగ్లండ్ బౌలర్ చెత్త రికార్డు!

  • Published Jun 26, 2024 | 6:56 PM Updated Updated Jun 26, 2024 | 7:10 PM

ఒక ఓవర్​లో 36 పరుగులు చేయడం గురించి విని ఉంటారు. కానీ సింగిల్ ఓవర్​లో 46 పరుగులు. ఊహకందని ఈ ఫీట్ నమోదైంది. ఎవరు ఈ ఘనతను అందుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

ఒక ఓవర్​లో 36 పరుగులు చేయడం గురించి విని ఉంటారు. కానీ సింగిల్ ఓవర్​లో 46 పరుగులు. ఊహకందని ఈ ఫీట్ నమోదైంది. ఎవరు ఈ ఘనతను అందుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jun 26, 2024 | 6:56 PMUpdated Jun 26, 2024 | 7:10 PM
వీడియో: ఒకే ఓవర్​లో ఏకంగా 46 పరుగులు.. ఇంగ్లండ్ బౌలర్ చెత్త రికార్డు!

ఒక ఓవర్​లో 36 పరుగులు చేయడం గురించి విని ఉంటారు. అరంగేట్ర టీ20 వరల్డ్ కప్​లో భారత లెజెండ్ యువరాజ్ సింగ్ ఈ ఫీట్ నమోదు చేశాడు. ఇంగ్లండ్​తో మ్యాచ్​లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్​లో అతడు ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది 36 పరుగులు పిండుకున్నాడు. యువీ తర్వాత కొందరు ఆటగాళ్లు ఈ ఫీట్​ను నమోదు చేశారు. ముప్పై ఆరు పరుగులు ఓకే గానీ.. సింగిల్ ఓవర్​లో 46 పరుగులు చేయడం గురించి ఎప్పుడైనా ఊహించారా? ఎవరి ఆలోచనలకు అందని ఈ ఫీట్ నమోదైంది. ఇంగ్లీష్​ కౌంటీ ఛాంపియన్​షిప్​లో ఈ అరుదైన ఘనత నమోదైంది. సస్సెక్స్, లీసెస్టర్​షైర్ మధ్య బుధవారం మ్యాచ్ జరిగింది.

సస్సెక్స్ బౌలర్, ఇంగ్లండ్ స్టార్ ఓలీ రాబిన్సన్ వేసిన ఓవర్​లో లీసెస్టర్​షైర్ బ్యాటర్ లూయిస్ కింబ్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రాబిన్సన్ ఓవర్​లో ఏకంగా 5 సిక్సులు బాదాడతను. అలాగే 3 బౌండరీలు కూడా కొట్టాడు. ఓ సింగిల్ కూడా తీశాడు. భారీగా పరుగులు ఇచ్చుకున్న రాబిన్సన్.. ఈ ఓవర్​లో 3 నోబాల్స్ కూడా వేశాడు. దీంతో మొత్తంగా సింగిల్ ఓవర్​లో 46 పరుగులు లీక్ అయ్యాయి. ఈ చెత్త ప్రదర్శనతో 134 ఏళ్ల ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్​లో మోస్ట్ ఎక్స్​పెన్సివ్ ఓవర్ వేసిన బౌలర్​గా పరువు తీసుకున్నాడు రాబిన్సన్. ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడే బౌలర్ అయ్యుండి, మంచి అనుభవం ఉన్నా ఇలా చెత్త బౌలింగ్​తో వార్తల్లోకి ఎక్కాడు. అటు ఇంగ్లండ్ జట్టు పొట్టి కప్పులో భారత్​తో సెమీస్ ఫైట్​కు సిద్ధమవుతోంది. ఈ తరుణంలో ఆ టీమ్ పేసర్ ఇలా పరువు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మరి.. ఒకే ఓవర్​లో 46 పరుగుల రికార్డును ఫ్యూచర్​లో ఎవరైనా బ్రేక్ చేస్తారని మీరు భావిస్తే కామెంట్ చేయండి.