iDreamPost

సూపర్-8కు ముందు టీమిండియాకు మరో టెన్షన్.. విలన్ వస్తున్నాడు జాగ్రత్త!

  • Published Jun 19, 2024 | 8:28 PMUpdated Jun 19, 2024 | 8:28 PM

సూపర్-8 పోరుకు ముందు టీమిండియాలో మరో టెన్షన్ మొదలైంది. మనకు శనిలా దాపురించిన ఓ విలన్ మళ్లీ వచ్చేస్తున్నాడు. అతడి రాకతో అభిమానులు భయపడుతున్నారు.

సూపర్-8 పోరుకు ముందు టీమిండియాలో మరో టెన్షన్ మొదలైంది. మనకు శనిలా దాపురించిన ఓ విలన్ మళ్లీ వచ్చేస్తున్నాడు. అతడి రాకతో అభిమానులు భయపడుతున్నారు.

  • Published Jun 19, 2024 | 8:28 PMUpdated Jun 19, 2024 | 8:28 PM
సూపర్-8కు ముందు టీమిండియాకు మరో టెన్షన్.. విలన్ వస్తున్నాడు జాగ్రత్త!

టీ20 ప్రపంచ కప్-2024లో భాగంగా రేపటి నుంచి సూపర్-8 పోరు షురూ కానుంది. నిన్నటి వరకు లీగ్ స్టేజ్ మ్యాచెస్ చూస్తూ ఎంజాయ్ చేసిన అభిమానులు ఇక మీదట అసలైన ఫైట్స్​ను ఆస్వాదించనున్నారు. సెమీస్ బెర్త్ దక్కించుకోవాలంటే ప్రతి మ్యాచ్​ టీమ్స్​కు డూ ఆర్ డై కానుంది. దీంతో సర్వశక్తులూ ఒడ్డి విజయం సాధించాలని జట్లు పట్టుదలతో ఉన్నాయి. టీమిండియా కూడా సూపర్-8లో సత్తా చాటాలని చూస్తోంది. వెస్టిండీస్ పిచ్​లపై తమకు ఉన్న అనుభవాన్ని బయటకు తీసి అపోజిషన్ టీమ్స్​ను ఆటాడుకోవాలని భావిస్తోంది. స్పిన్ మంత్రంతో ప్రత్యర్థుల ఆట కట్టించాలని ప్లాన్స్ వేస్తోంది. ఇన్నాళ్లూ దాచి ఉంచిన స్పిన్నర్లను ఇప్పుడు రంగంలోకి దింపి చక్రం తిప్పాలని అనుకుంటోంది.

సూపర్-8లో భాగంగా తొలి మ్యాచ్​లో రేపు ఆఫ్ఘానిస్థాన్​ను ఎదుర్కోనుంది టీమిండియా. ఈ మ్యాచ్​లో ఘనవిజయం సాధించి ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్​లకు హెచ్చరికలు పంపాలని భావిస్తోంది. ఎందుకంటే తర్వాతి మ్యాచుల్లో ఆసీస్, బంగ్లాను ఫేస్ చేయనుంది రోహిత్ సేన. ఆఫ్ఘాన్​ను చిత్తుగా ఓడిస్తే ఆ రెండు జట్లు కూడా డిఫెన్స్​లో పడే అవకాశం ఉంది. అందుకే రేపటి మ్యాచ్​లో తమ బెస్ట్ ఇవ్వాలని భారత ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు. తమ బలహీతనల్ని అధిగమించి టీమిండియాకు గ్రాండ్ విక్టరీ అందించాలని భావిస్తున్నారు. ఈ తరుణంలో మెన్ ఇన్ బ్లూకు బ్యాడ్ న్యూస్. మన జట్టుకు శనిలా దాపురించిన ఓ విలన్ సూపర్-8 మ్యాచుల్లో ఎంట్రీ ఇస్తున్నాడు. అతడు మరెవరో రాదు.. ప్రముఖ అంపైర్ రిచర్డ్ కెటిల్​బరో. అతడి పేరు వింటేనే టీమిండియా ఫ్యాన్స్ ఉలిక్కిపడతారు.

సూపర్-8 మ్యాచ్​లకు ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించే వారి పేర్లను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తాజాగా అనౌన్స్ చేసింది. జూన్​ 20వ తేదీన జరిగే ఆఫ్ఘాన్​-భారత్ మ్యాచ్​కు రాడ్నీ టక్కర్, పాల్ రిఫిల్.. 22న బంగ్లాతో మ్యాచ్​కు మైఖేల్ గాప్, ఆడ్రియన్ హోల్​స్టాక్ ఫీల్డ్ అంపైర్లుగా ఉంటారు. జూన్ 22న ఆసీస్​తో జరిగే మ్యాచ్​కు రిచర్డ్ కెటిల్​బరో, రిచర్డ్ ఇల్లింగ్​వర్త్ అంపైర్లుగా వ్యవహరిస్తారు. మిగతా అంపైర్ల మాటెలా ఉన్నా.. రిచర్డ్ కెటిల్​బరో పేరు వినగానే భారత అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఎందుకంటే ఇతడు అంపైర్​గా ఉన్న అన్ని ఐసీసీ నాకౌట్ మ్యాచుల్లో టీమిండియా ఓడిపోయింది. ఈసారి కూడా కంగారూలతో కీలక మ్యాచ్​కు అతడు అంపైర్​గా వ్యవహరించనుండటంతో ఫ్యాన్స్ కలవరపడుతున్నారు. మన జట్టు మళ్లీ ఓడుతుందేమోనని భయపడుతున్నారు. విలన్ వస్తున్నాడు జాగ్రత్త.. చెలరేగి ఆడండి లేకపోతే కష్టం అంటూ టీమిండియాను హెచ్చరిస్తున్నారు అభిమానులు. మరి.. రిచర్డ్ కెటిల్​బరోను భారత ఫ్యాన్స్ విలన్​గా చూడటంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి