iDreamPost

పెంపుడు శునకం చనిపోయిందా? ఫోన్ చేస్తే.. ఇంటికే అంతిమయాత్ర వాహనం!

Pet Last Set: అల్లారుముద్దుగా పెంచుకున్న పెంపుడు శునకాలు మృతి చెందితే వాటి అంతిమ సంస్కారులు ఎలా చేయాలని వాటి యజమానులు సతమతమవుతున్నారు. అలాంటి వారికి ఓ శుభవార్త వచ్చింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

Pet Last Set: అల్లారుముద్దుగా పెంచుకున్న పెంపుడు శునకాలు మృతి చెందితే వాటి అంతిమ సంస్కారులు ఎలా చేయాలని వాటి యజమానులు సతమతమవుతున్నారు. అలాంటి వారికి ఓ శుభవార్త వచ్చింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

పెంపుడు శునకం చనిపోయిందా? ఫోన్ చేస్తే.. ఇంటికే అంతిమయాత్ర వాహనం!

చాలా మంది కుక్కలను పెంచుకుంటారు. తమ ఇంటి సభ్యులతో సమానంగా వాటిని చూసుకుంటారు. ఇక పెంపుడు శునకాలు సైతం…యజమాని కోసం ప్రాణాలను సైతం అర్పిస్తుంటాయి. ఇలా ఎంతో ప్రేమతో పెంచుకున్న కుక్కలను చనిపోయినప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఎంతో బాధ పడతారు. కొందరు అయితే తమ శునకాలకు కూడా మనుషులకు చేసినట్లుగా అంత్యక్రియలు నిర్వహించాలని భావిస్తారు. అయితే కొందరికి సాధ్యమైన.. అందరికి సాధ్యం కాదు. అలాంటి వారి కోసం ఈ వార్త. ఎవరి ఇంట్లోనే పెంపుడు కుక్క చనిపోతే.. ఫోన్ చేస్తే.. అంతిమయాత్ర వాహనం ఇంటికే వస్తుంది.  మరి… ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

అల్లారుముద్దుగా పెంచుకున్న పెంపుడు శునకాలు మృతి చెందితే వాటి అంతిమ సంస్కారులు ఎలా చేయాలని వాటి యజమానులు సతమతమవుతున్నారు. ముఖ్యంగా పెంపపుడు కుక్కలు, ఇతర పెంపుడు జంతువుల ఖననం చేయడం, దహన సంస్కారలు చేయడానికి స్థలం లేక యానిమల్ లవర్స్  నరకయాతన అనుభవిస్తున్నారు. అపార్ట్‌మెంట్, విల్లా లో జీవనశైలి ప్రారంభమయ్యాక పెంపుడు జంతువుల ఖననం చేసేందుకు మరుభూమి లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి  కష్టకాలంలో జీహెచ్‌ఎంసీ, పీపుల్‌ ఫర్‌ ఎనిమల్స్‌ స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. జంతు ప్రేమికులకు ఓ శుభవార్తను అందించాయి.

ఎవరైన అల్లారు ముద్దుగా పెంచుకున్న జంతువులు మృతి చెందితే తీసుకెళ్లి ఎక్కడో పడేయకుండా సంప్రదాయబద్ధంగా వాటి కూడా దహన సంస్కారాలు చేస్తారు. జీహెచ్‌ఎంసీ, పీపుల్‌ ఫర్‌ ఎనిమల్స్‌(పీఎఫ్‌ఏ) కలిసి ఇంటి వద్దకే అంతిమయాత్ర  వాహన సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఫోన్ చేస్తే చాలు ఇంటికే వచ్చి మృతి చెందిన శునకాన్నో, ఇతర పెంపుడు జంతువునో ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో సంప్రదాయబద్ధంగా తీసుకెళ్లే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఫోన్‌ చేస్తే చాలు ఇంటికే వచ్చి పెట్ ల కళేబేరాన్ని ఫతుల్లాగూడలోని క్రిమేషన్‌కు తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం దూరాన్ని బట్టి ఫీజుగా వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం ఫతుల్లాగూడలో మాత్రమే అందుబాటులో ఉన్నపెట్‌ క్రిమేషన్‌ త్వరలోనే గాజుల రామారం, గోపన్‌పల్లిలో కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ  కార్యక్రమాన్ని 2022 నుంచి ప్రారంభించారు. చాలా మంది తమ ఇంట్లో పెంపుడు జంతువులు చనిపోతే ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియక కన్నీరు మున్నీరవుతుంటారు. వాది బాధను గమనించిన పీఎఫ్‌ఏ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. యానిమల్ లవర్స్ తమ ఇళ్లలో పెంపుడు జంతువులు చనిపోతే..73374 50643, 95055 37388 నంబర్‌కు ఫోన్‌ చేస్తే .. ఇంటికే వాహనం వస్తుంది. అలా ప్రత్యేకంగా అలంకరించిన అంతిమయాత్ర వాహనంలోవాటిని వలంటీర్లు క్రిమేషన్‌కు తీసుకెళ్తారు. మొత్తంగా ఇది జంతువు ప్రేమికులకు శుభవార్తే అని పలువురు అభిప్రాయా పడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి