iDreamPost

వీడియో: కోహ్లీ కళ్లుచెదిరే సిక్సర్.. షకీబ్​కు మైండ్​బ్లాంక్!

  • Published Jun 22, 2024 | 8:52 PMUpdated Jun 22, 2024 | 8:54 PM

బంగ్లాదేశ్​తో జరుగుతున్న సూపర్-8 పోరులో విరాట్ కోహ్లీ రెచ్చిపోయి ఆడాడు. డిఫరెంట్ షాట్స్ ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు.

టీ20 వరల్డ్ కప్-2024లో పూర్ ఫామ్​తో బాధపడుతున్న విరాట్ కోహ్లీ ఎట్టకేలకు తిరిగి రిథమ్​ను అందుకున్నాడు. ఆఫ్ఘానిస్థాన్​తో మ్యాచ్​లో ఫర్వాలేదనిపించిన కింగ్.. బంగ్లాదేశ్​తో మ్యాచ్​లో రెచ్చిపోయి ఆడాడు. ఈ మ్యాచ్​లో ఫస్ట్ బాల్ నుంచే అటాకింగ్​కు దిగిన ఈ టాప్ బ్యాటర్.. ఛాన్స్ దొరికిన ప్రతిసారి బాల్​ను గ్రౌండ్ బయటకు పంపించాడు. ఈ క్రమంలో బంగ్లా కెప్టెన్ షకీబల్​ హసన్ మీద కూడా దాడికి దిగాడు. షకీబ్ ఓవర్​లో కళ్లు చెదిరే సిక్సర్​తో అలరించాడు కోహ్లీ.

షకీబ్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ నాలుగో బంతిని ఫ్లిక్ షాట్​తో సిక్స్​గా మలిచాడు కోహ్లీ. విరాట్ టైమింగ్​కు బంతి వెళ్లి స్టేడియంలో పడింది. దీంతో బౌలింగ్ వేసిన షకీబ్ బిత్తరపోయాడు. మొత్తంగా 28 బంతులు ఎదుర్కొన్న కింగ్.. 37 పరుగులు చేసి పెవిలియన్​కు చేరుకున్నాడు. అతడి ఇన్నింగ్స్​లో 1 బౌండరీతో పాటు ఏకంగా 3 సిక్సులు ఉన్నాయి. దీన్ని బట్టే కోహ్లీ జోరు ఏ రేంజ్​లో సాగిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంత బాగా ఆడిన అతడు అనవసర షాట్​కు ప్రయత్నించి తంజిమ్ హసన్​కు చిక్కాడు. కట్టర్​ బాల్​కు భారీ షాట్ కొట్టబోయి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్రీజులో నిలదొక్కుకున్న కోహ్లీ.. బిగ్ ఇన్నింగ్స్​ ఆడితే జట్టుకు ప్లస్ అయ్యేది. మరి.. బంగ్లాతో మ్యాచ్​లో కింగ్ కోహ్లీ ఆడిన తీరు మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి