iDreamPost

పాక్ టీమ్​పై కోచ్ గ్యారీ కిర్​స్టెన్ షాకింగ్ కామెంట్స్.. ఇలా అనేశాడేంటి?

  • Published Jun 18, 2024 | 8:13 AMUpdated Jun 18, 2024 | 8:13 AM

పొట్టి కప్పులో ఘోర ప్రదర్శనతో విమర్శలపాలవుతోంది పాకిస్థాన్ జట్టు. గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టిన ఈ టీమ్​ను అందరూ ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఆ జట్టు పరువు తీశాడు కోచ్.

పొట్టి కప్పులో ఘోర ప్రదర్శనతో విమర్శలపాలవుతోంది పాకిస్థాన్ జట్టు. గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టిన ఈ టీమ్​ను అందరూ ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఆ జట్టు పరువు తీశాడు కోచ్.

  • Published Jun 18, 2024 | 8:13 AMUpdated Jun 18, 2024 | 8:13 AM
పాక్ టీమ్​పై కోచ్ గ్యారీ కిర్​స్టెన్ షాకింగ్ కామెంట్స్.. ఇలా అనేశాడేంటి?

పొట్టి కప్పులో ఘోర ప్రదర్శనతో విమర్శలపాలవుతోంది పాకిస్థాన్ జట్టు. గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టిన ఈ టీమ్​ను అందరూ ట్రోల్ చేస్తున్నారు. ఫేవరెట్ టీమిండియాతో పాటు పసికూన యూఎస్​ఏ చేతుల్లోనూ ఓడిపోయింది పాక్. ఆ తర్వాత కెనడాపై నెగ్గింది. కానీ ఆఖరి మ్యాచ్​లో ఐర్లాండ్ మీద కొద్దిలో ఓటమి తప్పించుకుంది. ఐర్లాండ్ విసిరిన 106 పరుగుల టార్గెట్​ను చేరుకునే క్రమంలో ఏకంగా 7 వికెట్లు కోల్పోయింది. పెద్ద టీమ్ కాబట్టి భారత్​ చేతుల్లో ఓటమి అంటే లైట్ తీసుకోవచ్చు. కానీ ఐర్లాండ్, అమెరికా లాంటి స్మాల్ టీమ్స్​ను చిత్తుగా ఓడించాల్సి పోయి.. వాళ్లతో మ్యాచ్​లో పాక్ ప్లేయర్లు గుడ్లు తేలేయడం షాకింగ్​గా మారింది. అందుకే దాయాది ఆటగాళ్ల మీద అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ కోవలో తాజాగా ఆ జట్టు కోచ్ కూడా చేరాడు.

టీ20 ప్రపంచ కప్​లో దారుణ ప్రదర్శనతో విమర్శలపాలవుతున్న పాకిస్థాన్ పరువు తీశాడు కోచ్ గ్యారీ కిర్​స్టెన్. పాక్ టీమ్​లో ఐకమత్యం లేదంటూ అతడు షాకింగ్ కామెంట్స్ చేశాడు. వరల్డ్ కప్​లో బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్​తో పాక్ ఇంటిదారి పట్టింది. దీంతో పట్టరాని కోపంలో ఉన్న కిర్​స్టెన్ ఆ జట్టు ఆటతీరు, ప్లేయర్ల ప్రవర్తనకు సంబంధించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని పాక్​కు సంబంధించిన ఓ మీడియా ఛానెల్ పేర్కొంది. ఆ ఛానెల్ కథనం ప్రకారం.. ఎన్నో ఏళ్లుగా ఇంటర్నేషనల్ లెవల్​లో కోచింగ్ చేస్తూ వస్తున్నానని.. కానీ ఇలాంటి సిచ్యువేషన్​ను ఎప్పుడూ ఫేస్‌ చేయలేదన్నాడు కిర్​స్టెన్. జట్టుగా కలసికట్టుగా ఆడుదామనే స్పృహ ఆటగాళ్లలో లేదని.. అసలు ఇది టీమే కాదని సీరియస్ అయ్యాడు.

‘పాకిస్థాన్ టీమ్​లో ఐకమత్యం లేదు. ఆటగాళ్లు ఒకరికొకరు సహకరించుకోవడం లేదు. జట్టుగా కలసి ఆడే వాతావరణం లేదు. దీన్ని టీమ్ అని పిలవలేం. ఎవరికి వారే అన్నట్లు ప్లేయర్లు బిహేవ్ చేస్తున్నారు. జట్టులో చీలికలు ఉన్నాయి. ఇన్నేళ్ల నా కెరీర్​లో ఎన్నో టీమ్స్​తో కలసి పని చేశా. కానీ ఇంత దారుణమైన సిచ్యువేషన్​ను ఎక్కడా చూడలేదు’ అని సన్నిహితులతో కిర్​స్టెన్ తన ఆవేదనను పంచుకున్నట్లు పాక్ మీడియా ఛానల్ పేర్కొంది. స్కిల్స్, ఫిట్​నెస్ పరంగా చూసుకుంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్​కు తగ్గట్లు టీమ్ ప్లేయర్లు లేరని.. ఇంత క్రికెట్ ఆడాక కూడా ఏ టైమ్​లో ఎలాంటి షాట్ ఆడాలనేది వాళ్లకు తెలియదని కిర్​స్టెన్ చెప్పాడని తెలుస్తోంది. అతడి వ్యాఖ్యలు ఇప్పుడు పాక్​ క్రికెట్​లో సంచలనంగా మారాయి. కోచ్ అయ్యుండి టీమ్​పై ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే నెటిజన్స్ మాత్రం ఎవరో ఒకరు నిజాలు బయట పెట్టాల్సిందేనని.. కిర్​స్టెన్​ అదే పని చేశాడని వెనకేసుకొస్తున్నారు. మరి.. కోచ్ పాక్ పరువు తీయడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి