Nidhan
పొట్టి కప్పులో ఘోర ప్రదర్శనతో విమర్శలపాలవుతోంది పాకిస్థాన్ జట్టు. గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టిన ఈ టీమ్‌ను అందరూ ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఆ జట్టు పరువు తీశాడు కోచ్.
పొట్టి కప్పులో ఘోర ప్రదర్శనతో విమర్శలపాలవుతోంది పాకిస్థాన్ జట్టు. గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టిన ఈ టీమ్‌ను అందరూ ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఆ జట్టు పరువు తీశాడు కోచ్.
Nidhan
పొట్టి కప్పులో ఘోర ప్రదర్శనతో విమర్శలపాలవుతోంది పాకిస్థాన్ జట్టు. గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టిన ఈ టీమ్‌ను అందరూ ట్రోల్ చేస్తున్నారు. ఫేవరెట్ టీమిండియాతో పాటు పసికూన యూఎస్ఏ చేతుల్లోనూ ఓడిపోయింది పాక్. ఆ తర్వాత కెనడాపై నెగ్గింది. కానీ ఆఖరి మ్యాచ్‌లో ఐర్లాండ్ మీద కొద్దిలో ఓటమి తప్పించుకుంది. ఐర్లాండ్ విసిరిన 106 పరుగుల టార్గెట్‌ను చేరుకునే క్రమంలో ఏకంగా 7 వికెట్లు కోల్పోయింది. పెద్ద టీమ్ కాబట్టి భారత్ చేతుల్లో ఓటమి అంటే లైట్ తీసుకోవచ్చు. కానీ ఐర్లాండ్, అమెరికా లాంటి స్మాల్ టీమ్స్‌ను చిత్తుగా ఓడించాల్సి పోయి.. వాళ్లతో మ్యాచ్‌లో పాక్ ప్లేయర్లు గుడ్లు తేలేయడం షాకింగ్‌గా మారింది. అందుకే దాయాది ఆటగాళ్ల మీద అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ కోవలో తాజాగా ఆ జట్టు కోచ్ కూడా చేరాడు.
టీ20 ప్రపంచ కప్‌లో దారుణ ప్రదర్శనతో విమర్శలపాలవుతున్న పాకిస్థాన్ పరువు తీశాడు కోచ్ గ్యారీ కిర్‌స్టెన్. పాక్ టీమ్‌లో ఐకమత్యం లేదంటూ అతడు షాకింగ్ కామెంట్స్ చేశాడు. వరల్డ్ కప్‌లో బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్‌తో పాక్ ఇంటిదారి పట్టింది. దీంతో పట్టరాని కోపంలో ఉన్న కిర్‌స్టెన్ ఆ జట్టు ఆటతీరు, ప్లేయర్ల ప్రవర్తనకు సంబంధించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని పాక్‌కు సంబంధించిన ఓ మీడియా ఛానెల్ పేర్కొంది. ఆ ఛానెల్ కథనం ప్రకారం.. ఎన్నో ఏళ్లుగా ఇంటర్నేషనల్ లెవల్లో కోచింగ్ చేస్తూ వస్తున్నానని.. కానీ ఇలాంటి సిచ్యువేషన్‌ను ఎప్పుడూ ఫేస్ చేయలేదన్నాడు కిర్‌స్టెన్. జట్టుగా కలసికట్టుగా ఆడుదామనే స్పృహ ఆటగాళ్లలో లేదని.. అసలు ఇది టీమే కాదని సీరియస్ అయ్యాడు.
‘పాకిస్థాన్ టీమ్‌లో ఐకమత్యం లేదు. ఆటగాళ్లు ఒకరికొకరు సహకరించుకోవడం లేదు. జట్టుగా కలసి ఆడే వాతావరణం లేదు. దీన్ని టీమ్ అని పిలవలేం. ఎవరికి వారే అన్నట్లు ప్లేయర్లు బిహేవ్ చేస్తున్నారు. జట్టులో చీలికలు ఉన్నాయి. ఇన్నేళ్ల నా కెరీర్లో ఎన్నో టీమ్స్‌తో కలసి పని చేశా. కానీ ఇంత దారుణమైన సిచ్యువేషన్‌ను ఎక్కడా చూడలేదు’ అని సన్నిహితులతో కిర్‌స్టెన్ తన ఆవేదనను పంచుకున్నట్లు పాక్ మీడియా ఛానల్ పేర్కొంది. స్కిల్స్, ఫిట్నెస్ పరంగా చూసుకుంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌కు తగ్గట్లు టీమ్ ప్లేయర్లు లేరని.. ఇంత క్రికెట్ ఆడాక కూడా ఏ టైమ్‌లో ఎలాంటి షాట్ ఆడాలనేది వాళ్లకు తెలియదని కిర్‌స్టెన్ చెప్పాడని తెలుస్తోంది. అతడి వ్యాఖ్యలు ఇప్పుడు పాక్ క్రికెట్లో సంచలనంగా మారాయి. కోచ్ అయ్యుండి టీమ్‌పై ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే నెటిజన్స్ మాత్రం ఎవరో ఒకరు నిజాలు బయట పెట్టాల్సిందేనని.. కిర్‌స్టెన్ అదే పని చేశాడని వెనకేసుకొస్తున్నారు. మరి.. కోచ్ పాక్ పరువు తీయడంపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
🚨Gary Kirsten shocking statement
” There’s no unity in Pakistan’s Cricket team,They call it a team but its not a team.They aren’t supporting each other at all,everyone is separated,left and right.I’ve worked with many teams but I’ve never seen such a situation in my life.”🚨 pic.twitter.com/MSJMfrrGzC
— Sujeet Suman (@sujeetsuman1991) June 17, 2024