iDreamPost
android-app
ios-app

ఈసారి ఆ పని పక్కా చేస్తాం.. ఇంగ్లండ్​కు మండిపోయేలా కుల్దీప్ కామెంట్స్!

  • Published Jun 26, 2024 | 6:25 PM Updated Updated Jun 26, 2024 | 6:25 PM

ఇంగ్లండ్​తో సెమీస్ ఫైట్​కు సిద్ధమవుతోంది టీమిండియా. బట్లర్ సేనను చిత్తు చేసి ఫైనల్​కు దూసుకెళ్లాలని చూస్తోంది. ఈ తరుణంలో టాప్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఇంగ్లీష్ టీమ్​కు మండిపోయేలా కామెంట్స్ చేశాడు.

ఇంగ్లండ్​తో సెమీస్ ఫైట్​కు సిద్ధమవుతోంది టీమిండియా. బట్లర్ సేనను చిత్తు చేసి ఫైనల్​కు దూసుకెళ్లాలని చూస్తోంది. ఈ తరుణంలో టాప్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఇంగ్లీష్ టీమ్​కు మండిపోయేలా కామెంట్స్ చేశాడు.

  • Published Jun 26, 2024 | 6:25 PMUpdated Jun 26, 2024 | 6:25 PM
ఈసారి ఆ పని పక్కా చేస్తాం.. ఇంగ్లండ్​కు మండిపోయేలా కుల్దీప్ కామెంట్స్!

పొట్టి కప్పులో రోహిత్ సేన దూకుడు మామూలుగా లేదు. ఎదురొచ్చిన ప్రత్యర్థిని బుల్డోజర్ మాదిరిగా తొక్కుకుంటూ ముందుకెళ్తోంది. గ్రూప్ దశలో హ్యాట్రిక్ విక్టరీస్ కొట్టిన మెన్ ఇన్ బ్లూ.. సూపర్-8లో మరో హ్యాట్రిక్ నమోదు చేసింది. వరుసగా ఆఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాను చిత్తు చేసి సగర్వంగా నాకౌట్ గడప తొక్కింది. ఇంగ్లండ్​తో సెమీస్ ఫైట్​కు సిద్ధమవుతోంది టీమిండియా. బట్లర్ సేనను చిత్తు చేసి ఫైనల్​కు దూసుకెళ్లాలని చూస్తోంది. టీ20 వరల్డ్ కప్-2022 నాకౌట్​లో ఆ జట్టు చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలని డిసైడ్ అయింది. ఈ మ్యాచ్​లో గెలుపుతో రివేంజ్ తీరడంతో పాటు ఫైనల్ బెర్త్ కూడా కన్ఫర్మ్ అవుతుంది. అందుకే విజయం కోసం అవసరమైన అన్ని వ్యూహాలను రచిస్తోంది. ఈ తరుణంలో టాప్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఇంగ్లీష్ టీమ్​కు మండిపోయేలా కామెంట్స్ చేశాడు.

సెమీస్​కు ముందు ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్ మైండ్ గేమ్ స్టార్ట్ చేశాడు. టీమిండియా సీక్రెట్ తమకు తెలుసునని.. వాళ్లు దూకుడు మంత్రంతో ముందుకెళ్తారని గ్రహించామన్నాడు. తాము కూడా అటాకింగ్ ఫార్ములాను ఉపయోగించి రోహిత్ సేనను ఓడిస్తామని అన్నాడు. ఈ మ్యాచ్​లో తమ జట్టే ఫేవరెట్ అన్నాడు. అంతేగాక టీ20 ప్రపంచ కప్-2022 సెమీస్​ను గుర్తుచేస్తూ భారత్​ను మరింత రెచ్చగొట్టాడు. ఆ మ్యాచ్ తన కెరీర్​లో గొప్పదన్నాడు. ఆ విజయం తాలూకు జ్ఞాపకాలు ఇంకా కళ్ల ముందు మెదులుతున్నాయని పేర్కొన్నాడు. బట్లర్​కు భారత స్పిన్నర్ కుల్దీప్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఈసారి తమదే గెలుపని స్పష్టం చేశాడు. వరల్డ్ కప్ చేత పట్టకుండా ఇంటికి వెళ్లేదే లేదని.. ఆ పని పక్కా చేస్తామన్నాడు.

‘ఈసారి మేం ప్రపంచ కప్ కైవసం చేసుకుంటామని ఆశిస్తున్నా. కప్ కొట్టేందుకు మా శాయశక్తులా ప్రయత్నిస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటికి కప్పుతోనే తిరిగి వెళ్లాలని ఫిక్స్ అయ్యాం’ అని కుల్దీప్ చెప్పుకొచ్చాడు. అతడి మాటలు విన్న నెటిజన్స్.. ఇంగ్లండ్​కు గట్టి హెచ్చరికలు పంపించాడని అంటున్నారు. వదిలేదే లేదు.. కప్పు మాదేననే వ్యాఖ్యలతో ఇంగ్లీష్ టీమ్ పనిపడతామని వార్నింగ్ ఇచ్చాడని చెబుతున్నారు. కుల్దీప్ జోరు చూస్తుంటే నాకౌట్​ ఫైట్​లో బట్లర్ సేనకు మూడినట్లేనని కామెంట్స్ చేస్తున్నారు. ఇక, పొట్టి కప్పు ఫస్టాఫ్​లో టీమ్​లో చోటు దక్కించుకోలేకపోయిన ఈ చైనామన్ బౌలర్.. సెకండాఫ్​లో జట్టు విజయాల్లో కీలకంగా మారాడు. ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచుల్లో కలిపి 7 వికెట్లు పడగొట్టాడు. అతడి ఎకానమీ 6.25గా ఉండటం విశేషం. మరి.. భారత్​దే కప్పు అంటూ కుల్దీప్ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.