iDreamPost

జట్టుకు దూరం కానున్న విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ!

  • Published Jun 19, 2024 | 1:45 PMUpdated Jun 19, 2024 | 1:45 PM

Gautam Gambhir, Rohit Sharma, Virat Kohli: టీమిండియాకు రెండు కళ్లలాంటి రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ.. టీమిండియాకు దూరం కానున్నారు. అది ఎందుకో? ఎప్పుడో ? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Gautam Gambhir, Rohit Sharma, Virat Kohli: టీమిండియాకు రెండు కళ్లలాంటి రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ.. టీమిండియాకు దూరం కానున్నారు. అది ఎందుకో? ఎప్పుడో ? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

  • Published Jun 19, 2024 | 1:45 PMUpdated Jun 19, 2024 | 1:45 PM
జట్టుకు దూరం కానున్న విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ!

ప్రస్తుతం టీమిండియా టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో బిజీగా ఉంది. ఇటు బీసీసీఐ టీమిండియాకు కొత్త హెడ్‌ కోచ్‌ను ఎంపిక చేసిన పనిలో ఉంది. టీ20 వరల్డ్‌ కప్‌ తర్వాత.. రాహుల్‌ ద్రవిడ్‌ స్థానంలో కొత్త కోచ్‌ రానున్నాడు. ఆ కొత్త కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ అనే ప్రచారం జరుగుతోంది. అయితే.. టీ20 వరల్డ్‌ కప్‌ తర్వాత టీమిండియా రెండు సిరీస్‌లు ఆడనుంది. జింబాబ్వే, శ్రీలంక జట్లతో భారత జట్టు సిరీస్‌లు ఆడనుంది. ఈ వరల్డ్‌ కప్‌ టోర్నీ ముగిసిన వెంటనే జింబాబ్వేతో ఐదు టీ20ల సిరీస్‌, శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది.

ఈ సిరీస్‌లకు భారత జట్టును ప్రకటించేందుకు సెలెక్టర్లు ప్రిపేర్‌ అవుతున్నారు. అయితే.. టీ20 వరల్డ్‌ కప్‌లో ఆడుతున్న సీనియర్‌ ప్లేయర్లకు రాబోయే సిరీస్‌లలో రెస్ట్‌ ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్‌ 2024లో సత్తా చాటిన చాలా మంది యువ క్రికెటర్లకు జింబాబ్వే టీ20 సిరీస్‌కు ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతం టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌లో ఉన్న యువ క్రికెటర్లతో పాటు హర్షిత్‌ రాణా, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, మయాంక్ యాదవ్, యశ్ దయాల్, నితీశ్ కుమార్ రెడ్డి, విజయ్ కుమార్ వైశాఖ్‌లలో కొంతమందికి జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.

అయితే.. జూనియర్లకు టీమిండియాలో చోటు కల్పించడం కరెక్టే కానీ, ఆ వంకతో టీమిండియా సీనియర్‌ ప్లేయర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీలను రెస్ట్‌ పేరుతో పూర్తిగా పక్కనపెట్టేందుకు చూస్తున్నారా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కొత్త కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ బాధ్యతలు చేపట్టాకా.. జట్టులో భారీ మార్పులు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ మార్పుల్లో భాగంగా రోహిత్‌, కోహ్లీని టీ20లకు పూర్తిగా దూరం చేసి.. కేవలం టెస్టులు, వన్డేలకే పరిమితం చేస్తాడా? అని క్రికెట్‌ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి