iDreamPost

కోహ్లీ కోసం రోహిత్ కెరీర్ నాశనం చేస్తున్నారా? దీన్ని ప్రశ్నించేది ఎవరు?

  • Published Jun 22, 2024 | 12:49 PMUpdated Jun 22, 2024 | 12:49 PM

Rohit Sharma, Virat Kohli, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌లో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ చేస్తున్న ఒక తప్పుతో రోహిత్‌ కెరీర్ నాశనం అయ్యేలా ఉంది. అది కూడా కోహ్లీ కోసం చేస్తున్నతప్పులా ఉంది. దాని గురించి వివరంగా తెలుసుకుందాం..

Rohit Sharma, Virat Kohli, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌లో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ చేస్తున్న ఒక తప్పుతో రోహిత్‌ కెరీర్ నాశనం అయ్యేలా ఉంది. అది కూడా కోహ్లీ కోసం చేస్తున్నతప్పులా ఉంది. దాని గురించి వివరంగా తెలుసుకుందాం..

  • Published Jun 22, 2024 | 12:49 PMUpdated Jun 22, 2024 | 12:49 PM
కోహ్లీ కోసం రోహిత్ కెరీర్ నాశనం చేస్తున్నారా? దీన్ని ప్రశ్నించేది ఎవరు?

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భాగంగా టీమిండియా తమ రెండో సూపర్‌ 8 మ్యాచ్‌ కోసం సిద్ధమైంది. ఈ రోజు(శనివారం) బంగ్లాదేశ్‌తో ఆంటిగ్వా వేదికగా మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌ గెలిస్తే.. టీమిండియాకు సెమీస్‌ అవకాశాలు ఇంకా మెరుగుపడతాయి. ఇప్పటికే ఆఫ్ఘనిస్థాన్‌పై విజయంతో టీమిండియా ఖాతాలో రెండు పాయింట్లు ఉన్నాయి. ఇప్పుడు బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లోనూ గెలిస్తే.. నాలుగు పాయింట్లతో టీమిండియా గ్రూప్‌ 1లో టేబుల్‌ టాపర్‌గా ఉంటుంది. అందుకే బంగ్లాతో మ్యాచ్‌లో టీమిండియా చాలా సీరియస్‌గా తీసుకుంది. అయితే.. ప్రస్తుతం టీ20 వరల్డ్‌ కప్‌లో టీమిండియా వరుస విజయాలు సాధిస్తున్నా.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కెరీర్‌ను నాశనం చేస్తున్నారు? అనే విమర్శలు, ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అది కూడా టీమిండియాకు మరో పెద్ద దిక్కు అయిన విరాట్‌ కోహ్లీ కోసమే రోహిత్‌ కెరీర్‌ను పనంగా పెడుతున్నారా? అని కొంతమంది క్రికెట్‌ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అయితే.. కోహ్లీ కోసం రోహిత్‌ కెరీర్‌ను ఎందుకు నాశనం చేస్తారు? ఎలా నాశనం చేస్తారనే డౌట్‌ రావొచ్చు. ఈ టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో రోహిత్‌ శర్మకు జోడీగా విరాట్‌ కోహ్లీ ఓపెనర్‌గా ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వరకు నాలుగు మ్యాచ్‌లు.. మూడు గ్రూప్‌ స్టేజ్‌ మ్యాచ్‌లు, ఒక సూపర్‌ 8 మ్యాచ్‌.. ఈ నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఈ జోడీ సక్సెస్‌ కాలేదు. కోహ్లీ దారుణంగా విఫలమైతే.. రోహిత్‌ శర్మ ఒక మ్యాచ్‌లో పర్వాలేదనిపించి.. మిగతా మ్యాచ్‌ల్లో విఫలం అయ్యాడు. స్క్వౌడ్‌లో యశస్వి జైస్వాల్‌ రూపంలో ఒక నిఖార్సయిన ఓపెనర్‌ ఉన్నా.. కోహ్లీని ఓపెనర్‌గా దింపుతున్నారు. కోహ్లీ పవర్‌ ప్లేలో వేగంగా ఆడలేకపోతున్నాడు. అతను ఎక్కువ టైమ్‌ క్రీజ్‌లో ఉండి, ఎక్కువ బంతులు ఎదుర్కొవాలి అని ఓపెనర్‌గా ఆడిస్తున్నారు. తొలి మూడు మ్యాచ్‌ల్లో 1, 4, 0 పరుగులు మాత్రమే చేశాడు. తాజాగా ఆఫ్ఘనిస్థాన్‌పై 24 బంతుల్లో 24 పరుగులు చేశాడు.

ఒక వేళ కోహ్లీ పరుగులు చేసి.. ఇలా బాల్‌ టూ బాల్‌ చేస్తాడు కానీ, పవర్‌ ప్లేలో వేగంగా ఆడలేడు. ఆ బాధ్యతను రోహిత్‌ శర్మ తీసుకోవాల్సి వస్తుంది. సహజంగానే దూకుడుగా ఆడే రోహిత్‌.. మరింత వేగంగా ఆడే క్రమంలో వికెట్‌ పారేసుకుంటున్నాడు. ఒక ఎండ్‌లో కోహ్లీ వేగంగా ఆడకపోవడంతోనే రోహిత్‌పై ఒత్తిడి పెరిగి అతను వేగంగా ఆడాల్సిన పరిస్థితి వస్తుంది. అదే జైస్వాల్‌ ఉంటే.. అతను వేగంగా ఆడి.. రోహిత్‌కు కాస్త టైమ్‌ ఇచ్చేవాడు క్రీజ్‌లో కుదురుకోవడానికి. కానీ కోహ్లీ వల్ల ఆ వీలు లేకుండా పోయింది. ప్రస్తుతం విజయాలు వస్తున్నాయి కాబట్టి ఇది పెద్దగా ప్రొజెక్ట్‌ కావడం లేదు. మ్యాచ్‌ ఓడిపోతే.. టీ20 వరల్డ్‌ కప్‌ తర్వాత రోహిత్‌ టీ20 కెరీర్‌ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి