iDreamPost

CM Revanth Reddy: రేవంత్‌ సర్కార్‌ బిగ్‌ ట్విస్ట్‌.. ఇందిరమ్మ ఇళ్లు వాళ్లకు మాత్రమేనట

  • Published Jun 18, 2024 | 8:20 AMUpdated Jun 18, 2024 | 8:20 AM

ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రేవంత్‌ రెడ్డి సర్కార్‌ భారీ ట్విస్ట్‌ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. కేవలం వాళ్లకు మాత్రమే ఇళ్లను జారీ చేస్తారంట. ఆ వివరాలు..

ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రేవంత్‌ రెడ్డి సర్కార్‌ భారీ ట్విస్ట్‌ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. కేవలం వాళ్లకు మాత్రమే ఇళ్లను జారీ చేస్తారంట. ఆ వివరాలు..

  • Published Jun 18, 2024 | 8:20 AMUpdated Jun 18, 2024 | 8:20 AM
CM Revanth Reddy: రేవంత్‌ సర్కార్‌ బిగ్‌ ట్విస్ట్‌.. ఇందిరమ్మ ఇళ్లు వాళ్లకు మాత్రమేనట

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉంది. అధికారంలోకి రాగానే అనేక హామీలు అమలు చేసింది. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోగా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్‌ సర్కార్‌ ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. అయితే మధ్యలో సార్వత్రిక, ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోడ్‌ అమల్లోకి రావడంతో మార్చి నుంచి జూన్‌ నెల మధ్య వరకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంది. దాంతో కీలక హామీల అమలుకు అంతరాయం ఏర్పడింది. ఇప్పుడు ఎన్నికల కోడ్‌ ముగియడంతో మిగతా గ్యారెంటీలు, హామీలను అమలు చేసేందుకు రెడీ అవుతోంది రేవంత్‌ రెడ్డి సర్కార్‌. వీటిల్లో ముఖ్యమైన 2 లక్షల రైతు రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఆగస్ట్‌ 15 లోగా దాన్ని పూర్తి చేస్తామని వెల్లడింది. అలానే ఇందిరమ్మ ఇండ్ల పంపిణీపై కూడా కీలక నిర్ణయం తీసుకోనుంది రేవంత్‌ సర్కార్‌. ఆ వివరాలు..

పేదల సొంతింటి కల నెరవేర్చాలనే ఆశయానికి కాంగ్రెస్‌ సర్కార్‌ కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇప్పటికే అనేక సార్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ విషయంలో బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చేందుకు రెడీ అవుతోన్నట్లు తెలుస్తోంది. అది ఏంటంటే కేవలం తెల్ల రేషన్‌ కార్డు ఉన్న వారికే ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేయాలని రేవంత్‌ సర్కార్‌ భావిస్తోంది. అది కూడా మహిళల పేరు మీద మాత్రమే ఇల్లు వస్తుందని తెలిపింది. తొలి దశలో భాగంగా సొంత స్థలం ఉండి.. ఇల్లు లేనివారికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందనుంది. లబ్ధిదారులు స్థానికంగా నివాసం ఉండాలి. అద్దెకు ఉన్నవారు కూడా ఈ పథకానికి అర్హులేనని ప్రభుత్వం ప్రకటించింది.

ఈ ఏడాది మార్చి 11వ తేదీన ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. ఇందిరమ్మ ఇళ్లకు అర్హత ఏంటీ.. ఎవరెవరికి మంజూరు చేస్తారన్న గైడ్‌లైన్స్ కూడా రిలీజ్ చేశారు. ఇక తాజాగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలోనే తొలి విడత ఇవ్వబోతున్న ఇందిరమ్మ ఇండ్ల కోసం.. డ్రా పద్ధతిలో లబ్దిదారులను ఎంపిక చేయబోతున్నట్లు సమాచారం. ఈ పథకానికి సంబంధించి ఇతర రాష్ట్రాల అమలు తీరును పరిశిలీస్తున్న రేవంత్ సర్కార్.. చివరకు ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.

ఈ పథకానికి సంబంధించి మొత్తంగా 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేస్తామని.. దీని కోసం 22,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు కాంగ్రెస్‌ సర్కార్‌ వెల్లడించింది. అంతేకాక రాష్ట్రంలోని ప్రతి నియోజక వర్గానికి 3500 ఇండ్ల ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వీటికి మరికొన్ని ఇండ్లు జోడించి లబ్ధిదారుల సంఖ్యను పెంచేలా కార్యాచరణ రూపొందిస్తున్నారని సమాచారం. దీంతో.. ప్రభుత్వం అందించే ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వాళ్లంతా ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి