iDreamPost

ఆ నగరంలో 3 రోజుల పాటు ప్రైవేట్ హాస్పిటల్స్ బంద్.. ఎందుకంటే..?

ఆ నగరంలో మూడు రోజుల పాటు ప్రైవేట్ ఆసుపత్రులు బంద్ కానున్నాయి. ఈ మేరకు ప్రైవేట్ హాస్పిటల్స్ యూనియన్ బంద్ కు పిలుపునిచ్చింది. ఈ చర్య ఎందుకంటే..?

ఆ నగరంలో మూడు రోజుల పాటు ప్రైవేట్ ఆసుపత్రులు బంద్ కానున్నాయి. ఈ మేరకు ప్రైవేట్ హాస్పిటల్స్ యూనియన్ బంద్ కు పిలుపునిచ్చింది. ఈ చర్య ఎందుకంటే..?

ఆ నగరంలో 3 రోజుల పాటు ప్రైవేట్ హాస్పిటల్స్ బంద్.. ఎందుకంటే..?

వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు. ఏదైనా అనారోగ్యం బారిన పడితే.. మానవ రూపంలో ఉన్న దేవుళ్లైన వైద్యులను సంప్రదిస్తుంటాం. సాధారణ రోగులనే కాదు.. చావు అంచుల వరకు వెళ్లిన ఎంతో మంది వ్యక్తుల ప్రాణాలు కాపాడారు డాక్టర్లు. కానీ అనూహ్యంగా వ్యక్తి చనిపోతే.. ఆసుపత్రి నిర్వాకం అని, లేకుంటే వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయారంటూ బాధిత రోగుల తరుఫు బంధువులు ఆందోళన చేపడుతుంటారు. ఇటీవల ఈ తరహా ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటీవల ఓ మహిళను హాస్పిటల్‌లో ట్రీట్ మెంట్ కోసం తీసుకు రాగా, పరిస్థితి విషమించి.. మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు బంధువులు. అక్కడ చికిత్స పొందుతూ మహిళ మరణించింది. అయితే ఆమె మరణానికి ఫస్ట్ తీసుకెళ్లిన ఆసుపత్రి వైద్యులు కారణమని పేర్కొంటూ దాడి చేశారు బాధితురాలి కుటుంబ సభ్యులు.

ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిపై బాధితురాలి బంధువులు మంగళవారం రాత్రి ఎటాక్ చేశారు.వీరిని చూసి భయభ్రాంతులకు గురైన డాక్టర్లు.. ఓ గదిలోకి వెళ్లగా.. బయటకు రాకుంటే పెట్రోల్ పోసి తగులబెడతాం అంటూ వార్నింగ్ ఇచ్చారు. తలుపులు పగులకొట్టి వైద్యులపై దాడులు చేశారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితురాలి బంధువుల్ని నియంత్రించారు. ఈ ఘటనకు నిరసనగా.. ప్రైవేట్ హాస్పిటల్స్ యూనియన్ మహబూబ్ నగర్‌లో 3 రోజుల పాటు ప్రైవేట్ ఆసుపత్రులు బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆసుపత్రి యాజమాన్యం, యూనియన్ పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించి.. అసలు విషయాన్ని వెల్లడించింది.

ఓ బాధితురాలు తీవ్రమైన అనారోగ్యంతో మహబూబ్ నగర్‌లోని ఓ ఆసుపత్రికి తీసుకు రాగా, రిస్క్ కేసు అని తెలిసి కూడా ట్రీట్ మెంట్ చేశారు వైద్యులు. ఆమెకు ఆపరేషన్ చేశారు. రాత్రంతా మేనేజ్మెంట్ చేశారు. ఆమెకు బీపీ ఎక్కువై.. అపస్మార స్థితికి వెళ్లిపోయింది. సిటీ స్కాన్ చేశారు. అయితే అందులో బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్ అయ్యింది. దీంతో బ్రెయిన్‌కు సంబంధించిన ఆసుపత్రికి రిఫర్ చేసి పంపేశారు. అక్కడ నుండి మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అలాగే ఆ హాస్పిటల్ నుండి హైదరాబాద్ తీసుకెళ్లగా.. అక్కడ చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. అయితే ఆపరేషన్ చేసిన ఆసుపత్రే.. మహిళ మృతికి కారణం అని భావించిన బంధువులు.. మృతదేహాన్ని మహబూబ్ నగర్ ఆసుపత్రికి తీసుకెళ్లి..ఎటాక్ చేశారు. పెద్ద యెత్తున బంధువులు అక్కడకు వెళ్లి.. వైద్యులపై దాడులు చేయడంతో పాటు కోటి రూపాయలు డిమాండ్ చేశారు. లేకుంటే చంపేస్తామంటూ బెదిరించారు. ఈ చర్యలను ఖండిస్తూ మూడు రోజుల పాటు బంద్‌కు పిలుపునిచ్చింది ప్రైవేట్ హాస్పిటల్స్ యూనియన్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి