iDreamPost

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. RTC బస్సుల్లో ఇక డిజిటల్ చెల్లింపుల ద్వారా టిక్కెట్ల జారీ

ప్రయాణికులకు తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ గుడ్ న్యూస్ అందించింది. ఇకపై బస్సుల్లో డిజిటల్ చెల్లింపుల ద్వారా టిక్కెట్లను జారీ చేయనున్నారు. త్వరలోనే నగరమంతా ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు అధికారులు.

ప్రయాణికులకు తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ గుడ్ న్యూస్ అందించింది. ఇకపై బస్సుల్లో డిజిటల్ చెల్లింపుల ద్వారా టిక్కెట్లను జారీ చేయనున్నారు. త్వరలోనే నగరమంతా ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు అధికారులు.

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. RTC బస్సుల్లో ఇక డిజిటల్ చెల్లింపుల ద్వారా టిక్కెట్ల జారీ

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ టిక్కెట్ల జారీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రయాణికులకు ఆర్టీసీ బస్సుల్లో చిల్లర కోసం ఇబ్బందులు పడాల్సిన అవసరం లేకుండా ఉండబోతోంది. చేతిలో నగదు లేకున్నా సరే ఆర్టీసీ బస్సుల్లో ఆన్ లైన్ ద్వారా టిక్కెట్లు తీసుకుని ప్రయాణం చేయొచ్చు. మరికొన్ని రోజుల్లో డిజిటల్‌ చెల్లింపుల ప్రక్రియను ఆర్టీసీ వేగవంతంగా తీసుకురాబోతుంది. ఇకపై ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం, డెబిట్‌, క్రెడిట్‌ కార్డు స్వైపింగ్‌ తదితర అన్నీ రకాల పేమెంట్స్‌ విధానాలతో టికెట్లు జారీ చేయనున్నారు అధికారులు. ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ చెల్లింపుల ప్రక్రియ అందుబాటులోకి వస్తే టిక్కెట్లు తీసుకునే సమయంలో చిల్లర కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు.

హైదరాబాద్ నగరంలో నిత్యం వేలాది మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు టీజీఎస్ ఆర్టీసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. రాష్ట్రంలో మహాలక్షీ పథకం అమల్లోకి వచ్చాక ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగింది. ఇక ఆర్టీసీ బస్సుల్లో టిక్కెట్ల జారీలో చిల్లర కోసం కండక్లర్లకు, ప్రయాణికులకు తిప్పలు తప్పనున్నాయి. ఆన్‌లైన్‌ చెల్లింపులను ప్రోత్సహించి టికెట్స్ జారీ చేయడానికి గ్రేటర్‌ ఆర్టీసీ అధికారులు చర్యలు ప్రారంభించారు. దీనిలో భాగంగానే బండ్లగూడ డిపోను పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసి 70 బస్సుల్లో టికెట్‌ జారీ యంత్రాలను కండక్టర్లకు అందజేశారు.

20 రోజుల నుంచి డిజిటల్‌ చెల్లింపులతోనే ప్రయాణికులకు టికెట్లు జారీ చేశారు. డిజిటల్ చెల్లింపుల ద్వారా టిక్కెట్ల జారీ ప్రక్రియపై సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. ఆ యంత్రాల పనితీరు, పేమెంట్ కావడానికి ఎంత టైమ్ పడుతున్నది? స్కాన్ చేయడంలో ఏమైనా లోపాలున్నాయా? తదితర సాంకేతిక సమస్యలపై ఆర్టీసీ స్టడీ చేసింది. ఈ ప్రాజెక్టులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదని తేలడంతో నగర వ్యాప్తంగా డిజిటల్‌ చెల్లింపుల ప్రక్రియను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నది. ఆర్టీసీ బస్సుల్లో ఆన్‌లైన్‌ చెల్లింపుల ప్రక్రియ తీసుకురాబోతుండటం, చిల్లర కష్టాలకు చెక్ పడుతుండటంపై ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి