iDreamPost
android-app
ios-app

HYDలో రేపు ఎల్లుండి భారీ వర్షాలు.. IMDహెచ్చరిక

  • Published Jun 26, 2024 | 4:48 PM Updated Updated Jun 26, 2024 | 4:48 PM

గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రానున్న రెండు రోజుల్లో హైదరాబాద్ నగరంలోని భారీ వర్షాలు కురవనున్నాయని వాతవరణ శాఖ హెచ్చరించింది. అంతేకాకుండా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేసింది.

గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రానున్న రెండు రోజుల్లో హైదరాబాద్ నగరంలోని భారీ వర్షాలు కురవనున్నాయని వాతవరణ శాఖ హెచ్చరించింది. అంతేకాకుండా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేసింది.

  • Published Jun 26, 2024 | 4:48 PMUpdated Jun 26, 2024 | 4:48 PM
HYDలో రేపు ఎల్లుండి భారీ వర్షాలు.. IMDహెచ్చరిక

నగరంలోని వాతవరణంలోని పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో.. రాష్ట్రంలోని నైరుతి రుతుపవనాలు సంభవించాయి.దీంతో పలు ప్రాంతాల్లో అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉదయం వేళ ఎండలతో వాతవరణం వేడిగా ఉన్నా.. మధ్యహ్నం, సాయంత్రం సమయంలో మబ్బులు వేసి తేలికపాటి వర్షాలతో వాతవరణం చల్లగా మారుతుంది. అంతేకాకుండా..పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలతో పాటు..భారీ వర్షాలు కూడా పడుతున్నాయి.ఇకపోతే గత రెండు రోజులు క్రితం రాష్ట్రంలో తేలికపాటి వాన పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. హైదరాబాద్ నగరంలో రాబోయే రెండు రోజులపాటు తేలికపాటి వర్షాల నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని ఐఎండీ తాజాగా వెల్లడించింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

హైదరాబాద్ నగరంలో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురస్తాయని భారత వాతవరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. కాగా, ఈ వర్షలు అనేవి ఉరుములు, మెరుపులతో కూడినవిగా పడే సూచనాలు ఉన్నట్లు వాతవరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షం నుంచి భార వర్షాలు పడతాయని తెలిపింది. అంతేకాకుండా.. పలు జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ముఖ్యంగా జూన్ 27,28 ఈ తేదీల్లో హైదరాబాద్ నగరంలో బలమన ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. అలాగే జూన్ 26వ తేదీ అనగా బుధవార సాయంత్రం నుంచి జూన్ 29వ తేదీ మధ్య వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది.

అయితే  తూర్పు తెలంగాణలో సాయంత్రం నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. ఇక, రాత్రి, అర్ధరాత్రి, తెల్లవారుజామున భారీ వర్షాలు కురిసే అవకావం ఉందని తెలిపింది. ఇకపోతే జూన్ నెలలో నైరుతి రుతుపవనాల తెలంగాణ వ్యాప్తంగా విస్తరించిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు భారీగా తగ్గి ప్రజలకు కాస్త ఊరటను ఇచ్చింది.అంతేకాకుండా..రాష్ట్రం మొత్తం మీద ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి.ఇక హైదరాబాద్ విషయానికొస్తే.. 33 డిగ్రీల సెల్సియస్ దిగువకు పడిపోయాయి. అయితే రాష్ట్రంలో రానున్న రోజుల్లో వర్షపాతం నమోదవుతుందని ఈ నేపథ్యంలోనే ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తుంది. మరి రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురవనున్నయని వాతవరణ శాఖ అంచనాపై మీ అభిప్రాయానలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.