iDreamPost

కల్కి మూవీలో నాని, రానా, విజయ్ ల పాత్రలు లీక్.. కృష్ణుడి క్యారెక్టర్ మాత్రం!

Rana, Nani, VD, DS Characters In Kalki: కల్కి మూవీలో నాని, రానా, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ లు క్యామియో రోల్స్ చేశారని.. వాళ్ళ పాత్రలు ఇవే అంటూ ఒక వార్త వైరల్ అవుతోంది. ఆ వార్త ప్రకారం.. ఈ నలుగురూ చేసిన క్యారెక్టర్స్ ఏంటి? అలానే శ్రీకృష్ణుడి పాత్రలో ఎవరు నటిస్తున్నారు?

Rana, Nani, VD, DS Characters In Kalki: కల్కి మూవీలో నాని, రానా, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ లు క్యామియో రోల్స్ చేశారని.. వాళ్ళ పాత్రలు ఇవే అంటూ ఒక వార్త వైరల్ అవుతోంది. ఆ వార్త ప్రకారం.. ఈ నలుగురూ చేసిన క్యారెక్టర్స్ ఏంటి? అలానే శ్రీకృష్ణుడి పాత్రలో ఎవరు నటిస్తున్నారు?

కల్కి మూవీలో నాని, రానా, విజయ్ ల పాత్రలు లీక్.. కృష్ణుడి క్యారెక్టర్ మాత్రం!

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ కోసం అభిమానులు, తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ జూన్ 27న విడుదల కాబోతుంది. ఇప్పటికే టికెట్స్ విషయంలో మూవీ రికార్డులు నెలకొల్పుతుంది. ప్రభాస్ సినిమా కోసం అభిమానులు ఏకంగా జపాన్ నుంచి వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు సినిమాకి ఏ రేంజ్ లో హైప్ ఉందో అనేది. ఆ హైప్ కి తగ్గట్టే మూవీ టికెట్లు కూడా వేలల్లో అమ్ముడవుతున్నాయి. కాగా ఈ మూవీలో పెద్ద స్టార్ క్యాస్ట్ ఉండడం మరొక ప్లస్ పాయింట్. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ, శోభన, మాళవిక నాయర్, బ్రహ్మానందం,  వీడే మూవీలో విలన్ గా చేసిన తమిళ నటుడు పశుపతి వంటి స్టార్ క్యాస్ట్ ఉండడంతో సినిమాకి మంచి హైప్ వచ్చింది.

ఇదిలా ఉంటే ఈ మూవీలో దుల్కర్ సల్మాన్, నాని, విజయ్ దేవరకొండ, రానా వంటి హీరోలు కూడా క్యామియో రోల్స్ లో నటించారన్న వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఆ మధ్య దుల్కర్ సల్మాన్ కూడా కల్కి సెట్స్ కి వెళ్లారు. కానీ నటిస్తున్న విషయాన్ని మాత్రం ఎక్కడా కూడా నిర్ధారించలేదు. దీనికి సంబంధించి రోజూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ వంటి వారు కూడా ఉన్నారని వార్తలు వచ్చాయి. విష్ణు యసస్-సుమతి పాత్రల్లో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ కనిపిస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ ఇద్దరూ కలిసి సీతారామం సినిమాలో నటించారు. జోడీ బాగుందని కల్కి మూవీలో తీసుకున్నట్లు సమాచారం.

కాగా ఈ మూవీలో నాని, విజయ్ దేవరకొండ, రానా, దుల్కర్ లకు సంబంధించి పాత్రలు ఇవే అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. కల్కిలో కురువంశ పరీక్షిత్ మహారాజు పాత్రలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నారని.. విజయ్ దేవరకొండ అర్జునుడి పాత్రలో నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అభిమన్యుడి పాత్రలో నాని, దుర్యోధనుడిగా రానా నటిస్తున్నారని కొన్ని లీకులైతే బయటకు వచ్చాయి. కానీ కథ మొత్తాన్ని నడిపించే శ్రీకృష్ణుడి పాత్రను ఎవరు చేస్తున్నారనే విషయాన్ని మాత్రం సస్పెన్స్ అని అంటున్నారు. ఈ పాత్ర మాత్రం సర్ప్రైజ్ అని అంటున్నారు. మరి కల్కి మూవీలో క్యామియో రోల్స్ లో నాని, విజయ్, రానా, దుల్కర్ సల్మాన్ లు ఈ పాత్రల్లో నటిస్తున్నారన్న వార్త నిజమైతే ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ మూమెంట్ అవుతుందనే చెప్పాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి