iDreamPost

ఆ పని చేస్తూ వీడియో.. ఫోన్ పోవడంతో.. తెలుగు OTTలో ఇంత బో*ల్డ్ మూవీ ఉందా?

OTT Suggestions- Best Watch Alone Movie: ఓటీటీల్లో మీరు ఇలాంటి ఒక సినిమా అస్సలు చూసుండరు. పైగా అది తెలుగులో ఉండటం ఇంకో విశేషం. ఒక అమ్మాయి చేసిన తప్పు వల్ల.. ఏకంగా వారి జీవితాలే ముగిసిపోయినంత పని అవుతుంది.

OTT Suggestions- Best Watch Alone Movie: ఓటీటీల్లో మీరు ఇలాంటి ఒక సినిమా అస్సలు చూసుండరు. పైగా అది తెలుగులో ఉండటం ఇంకో విశేషం. ఒక అమ్మాయి చేసిన తప్పు వల్ల.. ఏకంగా వారి జీవితాలే ముగిసిపోయినంత పని అవుతుంది.

ఆ పని చేస్తూ వీడియో.. ఫోన్ పోవడంతో.. తెలుగు OTTలో ఇంత బో*ల్డ్ మూవీ ఉందా?

సాధారణంగా మనం ఇలాంటి ఫాంటసీలను సినిమాల్లో చూస్తూ ఉంటాం. నిజ జీవితంలో కూడా ఎవరికైనా ఉంటే మాత్రం ఈ సినిమా వారికి బెస్ట్ హెచ్చరిక అవుతుంది. ఎందుకంటే ఏకాంతం అనే పదానికి అర్థం.. ప్రైవేట్ స్పేస్ అని. అలాంటి సమయంలో ఫోన్ లో వీడియోలు తీసుకోవడం అనేది ఎంత ప్రమాదకరం అనే విషయాన్ని ఈ మూవీలో బాగా వివరించారు. అలాంటి ఒక్క పొరపాటు వల్లు రెండు జీవితాలు మాత్రమే కాదు.. రెండు కుటుంబాల పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోతుంది. ఈ మూవీ పేరుకు మాత్రమే బో*ల్డ్. కానీ, మెసేజ్ పరంగా మాత్రం తప్పకు చూడాల్సిన సినిమా ఇది. అది కూడా తెలుగులో ఉండటం నిజంగా మంచి విషయం అని చెప్పాలి.

ఈ సినిమా అంతా గతంలో, ఇప్పుడు, భవిష్యత్తులో యూత్ ఎలా ఉండకూడదు అనే విషయాల మీద నడుస్తూ ఉంటుంది. ఈ సినిమాలో ఒక అమలాపురం కుర్రాడు హైదరాబాద్ వస్తాడు. కల్మషం లేని అతని మనసు, మాటలు చూడగానే నచ్చేస్తాడు. అతను ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో చేరతాడు. అయితే ఇంగ్లీష్ రాకపోవడం వల్ల జాబ్ పోయే పరిస్థితి వస్తుంది. అందుకు హీరోయిన్ తనకు ఇంగ్లీష్ నేర్పిస్తాను అని చెప్తుంది. అలా వారి మధ్య స్నేహం చిగురిస్తుంది. ఆ తర్వాత అది కాస్తా ప్రేమగా మారిపోతుంది. అప్పటికే ఒక బ్రేకప్ బాధలో ఉన్న హీరోయిన్ మనోడికి బాగా కనెక్ట్ అయిపోతుంది. వారి మధ్య రిలేషన్ మాటల దగ్గరి నుంచి మం*చం వరకు వచ్చేస్తుంది. అయితే అక్కడే వాళ్లు చాలా పెద్ద తప్పు చేస్తారు. ఆ విషయం వాళ్లకి కూడా తర్వాతే తెలుస్తుంది.

MR and MIsses

తొలినాటి అనుభూతి గుర్తుండిపోవాలి అంటూ ఆమె ఫోన్ లో రికార్డ్ చేస్తుంది. ఇంకేముంది.. ఆ తర్వాత ఆ ఫోన్ పోగొట్టుకుంటుంది. ఆ ఫోన్ ఎవరికి దొరికింది? అందులో ఉన్న వీడియో ఎవరు ఎలా వాడారు? ఆ తర్వాత వాళ్ల లైఫ్ ఎన్ని మలుపులు తిరిగింది? అలాంటి పిచ్చి పని నుంచి వారి కుటుంబాలను ఎలా కాపాడుకున్నారు? ఇలాంటి ఎన్నో ఆసక్తికర ప్రశ్నలకు సమాధానం కావాలి అంటే మీరు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న మిస్టర్ అండ్ మిస్ మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. అయితే ఇది A సర్టిఫికేట్ మూవీ. కాబట్టి చిన్న పిల్లలను పక్కన ఉంచుకుని ఈ చిత్రాన్ని చూడకండి. కొన్ని కొన్ని డైలాగులు, సీన్స్ కాస్త ఇబ్బందిగా అనిపిస్తాయి. మీరు ఇప్పటికే ఈ మూవీ చూసుంటే మాత్రం మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి