iDreamPost

అమాయకంగా కనిపిస్తుంది.. కిరాతకంగా ప్రాణాలు తీస్తుంది.. OTTలో స్కేరీ మూవీ!

OTT Suggestions- Best Thriller Orphan Movie: ఓటీటీల్లో ఉన్న థ్రిల్లర్స్ అన్నీ ఒకెత్తు ఈ మూవీ మాత్రం ఒకెత్తు అని చెప్పాలి. ఎందుకంటే ఈ మూవీ ఆ రేంజ్ లో ఉంటుంది. ఒక అమ్మాయి వరుసగా హత్యలు చేస్తూ అందరినీ బెంబేలెత్తిస్తుంటుంది. అసలు ఆ అమ్మాయి ఎందుకు చంపుతుందో ఎవరికీ తెలీదు.

OTT Suggestions- Best Thriller Orphan Movie: ఓటీటీల్లో ఉన్న థ్రిల్లర్స్ అన్నీ ఒకెత్తు ఈ మూవీ మాత్రం ఒకెత్తు అని చెప్పాలి. ఎందుకంటే ఈ మూవీ ఆ రేంజ్ లో ఉంటుంది. ఒక అమ్మాయి వరుసగా హత్యలు చేస్తూ అందరినీ బెంబేలెత్తిస్తుంటుంది. అసలు ఆ అమ్మాయి ఎందుకు చంపుతుందో ఎవరికీ తెలీదు.

అమాయకంగా కనిపిస్తుంది.. కిరాతకంగా ప్రాణాలు తీస్తుంది.. OTTలో స్కేరీ మూవీ!

థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి ఒక అదిరిపోయే ఫీస్ట్ లాంటి మూవీ తీసుకొచ్చాం. ఈ సినిమా చూసిన తర్వాత మీరు వావ్ అనడమే కాదు.. వణికిపోతారు కూడా. ఎదుకంటే ఇది అలాంటి ఇలాంటి సినిమా కాదు. ఓటీటీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ అనమాట. ఈ సినిమాలో ఒక్కో ట్విస్టుకి బుర్ర హీటెక్కిపోతుంది. మీరు సైకో కిల్లర్ సినిమాలు చూసే ఉంటారు. ఇది కూడా అదే కేటగిరీకి చెందుతుంది. కానీ, పది థ్రిల్లర్స్ ని కలిపి చూస్తే ఎంత కిక్కొస్తుందో అంత కిక్కు ఈ ఒక్క సినిమాలో వస్తుంది. అలాగే పది హారర్ చిత్రాలు చూసినంత కంగారు, వణుకు కూడా పుడుతుంది. మరి.. ఆ సినిమా ఏది? అంత స్పెషల్ ఏంటో చూద్దాం.

థ్రిల్లర్ మూవీస్ అంటే కచ్చితంగా ఒక సీక్రెట్, సంథింగ్ స్కేరీగా ఉండాలి. ఇందులో అలాంటి ఎలిమెంట్స్ టన్నుల కొద్దీ ఉంటాయి. ఒక జంట బిడ్డను కోల్పోతారు. ఆ తర్వాత ఆ బాధ నుంచి బయట పడేందుకు ఒక అనాథను దత్తత తీసుకోవాలి అని ఫిక్స్ అవుతారు. అందుకోసం ఒక అనాథాశ్రమానికి వెళ్తారు. అక్కడ ఉన్న ఒక అమ్మాయిని దత్తత తీసుకోవాలి అని ఫిక్స్ అవుతారు. అప్పటి వరకు ఎంతో ఆనందాగ సాగిపోతున్న వారి జీవితం ఆ తర్వాత ఎంత విషాదంగా మారబోతోంది అనే విషయాన్ని వాళ్లు అప్పుడు గ్రహించలేకపోయారు. ఆ అమ్మాయి ఎప్పుడైతే వారి లైఫ్ లోకి అడుగుపెట్టిందో.. అప్పటి నుంచే వారి జీవితాలు అస్తవ్యవస్తం అవుతాయి.

Orphan

ఆ అమ్మాయి ఎవరి ఇంటికి వెళ్తే.. వారు ప్రాణాలతో ఉండటం దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి. ఆ అమ్మాయి ఒక సైకో కిల్లర్ అనే విషయం వారికి తెలియదు. ఎంతో ప్రేమగా ఆ అమ్మాయిని పెంచుకోవాలి అనుకుంటారు. కానీ, ఆ అమ్మాయి మాత్రం వారి జీవితాలను నాశనం చేయడానికే ఫిక్స్ అవుతుంది. ఈ సినిమా చూసేటప్పుడు మీకు వెన్నులో వణుకుపుట్టే సీన్స్ ఎన్నో ఉంటాయి. ఇది హారర్ థ్రిల్లర్ కాకపోయినా కూడా ఒంటరిగా చూడాలి అంటే కాస్త భయంగానే ఉంటుంది. ఇవన్నీ ఒకెత్తు అయితే.. ఆ అమ్మాయి జీవితంలో చాలా పెద్ద రహస్యం దాగుంటుంది. ఆ రహస్యం రివీల్ అయినప్పుడు మీకు బుర్ర గిర్రున తిరగడం ఖాయం అనే చెప్పాలి. ఎందుకంటే అది అలాంటి ఇలాంటి సీక్రెట్ కాదు.

మొత్తం సినిమా మీద మీ అభిప్రాయాలను మార్చేసే రహస్యం. అలాంటి విషయాన్ని ఆ జంట తెలుసుకుందా? అసలు ఆ అమ్మాయి చేతిలో నుంచి ఆ కుటుంబం ప్రాణాలతో బయటపడిందా? అసలు ఆ అమ్మాయి ఎందుకు హత్యలు చేస్తోంది? ఏ ఉద్దేశంతో చేస్తోంది? అనే విషయాలు మీకు చివరి వరకు అర్థం కాదు. కానీ, ఆ సీక్రెట్ చెప్తే మీరు సినిమా చూడటం కూడే దండగే అవుతుంది. ఈ సినిమా పేరు ఆర్ఫన్. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. కానీ, రూ.119కు రెంట్ కు తీసుకోవాలి. ఇది యూట్యూబ్ లో కూడా రెంట్ బేసిస్ మీదే అందుబాటులో ఉంది. అలాగే గూగుల్ ప్లే మూవీస్ లో కూడా 120 రూపాయలకు రెంట్ బేసిస్ మీద అందుబాటులో ఉంది. చిత్రం ఏ రేంజ్ లో ఉండకపోతే.. ఇప్పటికీ రెంట్ కే పెట్టారో మీరో అర్థం చేసుకోండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి