iDreamPost

OTT లో ఈ మూవీ ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు! స్నేహితురాలి భర్తకి దగ్గరై!

  • Published Jun 19, 2024 | 4:54 PMUpdated Jun 19, 2024 | 4:54 PM

OTT Best Thriller Movie: కొన్ని సినిమాలు వినడానికి రొటీన్ గా అనిపించినా కూడా.. ఎందుకో సినిమా చూసే కొద్దీ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ ఇంట్రెస్టింగ్ కథ గురించే. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

OTT Best Thriller Movie: కొన్ని సినిమాలు వినడానికి రొటీన్ గా అనిపించినా కూడా.. ఎందుకో సినిమా చూసే కొద్దీ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ ఇంట్రెస్టింగ్ కథ గురించే. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

  • Published Jun 19, 2024 | 4:54 PMUpdated Jun 19, 2024 | 4:54 PM
OTT లో ఈ మూవీ ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు! స్నేహితురాలి భర్తకి దగ్గరై!

వారం వారం ఓటీటీ లకు వచ్చే సినిమాలే కాకుండా.. అప్పుడప్పుడు ఆల్రెడీ ఉన్న సినిమాలపై కూడా ఓ లుక్ వేస్తూ ఉండాలి. లేదంటే కొన్ని మంచి ఇంట్రెస్టింగ్ సినిమాలను మిస్ అయిపోతూ ఉంటారు మూవీ లవర్స్. వారికోసమే ఈ మూవీ సజ్జెషన్. ఇప్పటివరకు థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన అన్ని సినిమాలను కవర్ చేసేసి ఉంటారు. ఈ ప్లాట్ లో వచ్చే సినిమాలన్నీ కూడా వినడానికి, స్టార్టింగ్ చూడడానికి రొటీన్ గా అనిపించినా కూడా.. కథ ముందుకు సాగుతున్న కొద్దీ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఇలాంటిదే. మరి ఈ సినిమా మీ వాచ్ లిస్ట్ లో ఉందో లేదో ఓ లుక్ వేసేయండి. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. బెథ్ తన బెస్ట్ ఫ్రెండ్ కేట్ ను కలవడానికి అమెరికా నుండి క్రాషియా వెళ్తుంది. ఫ్రెండ్స్ ఇద్దరు చాలా డేస్ తర్వాత కలిశారు కాబట్టి.. అక్కడే ఓ హోటల్ లో స్టే చేస్తారు. వారిద్దరూ కలిసి ఉన్న సమయంలో బెథ్ కు తన భర్త నుంచి కాల్ వస్తుంది. అప్పటికే బెథ్ కు పెళ్ళయ్యి ఓ పాపా కూడా ఉంటుంది. అలాగే ఆరోజు ఈవెనింగ్ వారిద్దరూ ఓ రెస్టారెంట్ కు వెళ్తారు. అప్పుడు కేట్ కు ఓ కాల్ వస్తుంది. ఆ కాల్ లో కేట్ గట్టిగ గొడవపడుతూ మాట్లాడుతుంది. కాల్ లో ఎవరని అడుగుగా తన ఎక్స్ హస్బెండ్ అని కేట్ చెప్తుంది. మూడ్ బాలేదని అక్కడి నుంచి ఇద్దరు హోటల్ కు వెళ్ళిపోతారు. తర్వాత రోజు ఉదయం బెథ్ లేచి చూసేసరికి.. అక్కడ కేట్ కనిపించదు.

Wife Story

దీనితో బెథ్ అక్కడ హోటల్ స్టాఫ్ ని అడుగుగా.. ముందు రోజు రాత్రి కేట్ ఇద్దరు అబ్బాయిలను హోటల్ రూమ్ కు తీసుకుని వచ్చారని.. ఆలా చేయడం కరెక్ట్ కాదని చెప్పానని చెప్తాడు. దీనితో విషయం అర్ధమైన బెథ్.. కేట్ కోసం సెర్చింగ్ స్టార్ట్ చేస్తుంది. ఈ క్రమంలో ఆమెకు అనుకోకుండా.. ఓ రోజు పోలీసుల నుంచి కేట్ శవం సముద్రంలో దొరికిందని కాల్ వస్తుంది. దీనితో బెథ్ చాలా బాధపడుతుంది. అప్పుడే కేట్ ఫోన్ ను అన్ లాక్ చేసిన బెథ్ కు కొన్ని ఊహించిన నిజాలు తెలుస్తాయి. అదేంటంటే.. కేట్ కు.. బెథ్ భర్త కు వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది. వెంటనే ఇదే విషయాన్నీ పోలీసులకు కూడా చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది ! కేట్ కు, బెథ్ భర్తకు మధ్య ఎలాంటి సంబంధం ఉంది ! కేట్ ఈ విషయాన్నీ బెథ్ దగ్గర ఎందుకు దాచింది ! బెథ్ తన భర్తను ఈ విషయంపై నిలదీసిందా లేదా ! అసలు కేట్ మిస్ అయినా రోజు ఏం జరిగింది ! కేట్ ఎలా చనిపోయింది ! ఇవన్నీ తెలియాలంటే.. “ది వీకెండ్ అవే” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను మిస్ అయ్యి ఉంటే కనుక వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి