iDreamPost

భార్యను అలా చూసి భర్త షాక్ .. OTT లో మైండ్ బ్లాక్ అయ్యే మూవీ

  • Published Jun 22, 2024 | 1:33 PMUpdated Jun 22, 2024 | 1:33 PM

OTT Best Thriller Movie: రెగ్యులర్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ తో పాటు.. ఇంకా చాలానే ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో ఎన్నో మంచి మంచి సినిమాలు స్ట్రీమింగ్ అవుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

OTT Best Thriller Movie: రెగ్యులర్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ తో పాటు.. ఇంకా చాలానే ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో ఎన్నో మంచి మంచి సినిమాలు స్ట్రీమింగ్ అవుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

  • Published Jun 22, 2024 | 1:33 PMUpdated Jun 22, 2024 | 1:33 PM
భార్యను  అలా చూసి భర్త షాక్ .. OTT లో మైండ్ బ్లాక్ అయ్యే మూవీ

ఈ వారం కూడా చాలా వరకు చూడదగిన సినిమాలే ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతూ ఉన్నాయి. ఒకవేళ ఈ సినిమాలను కూడా చూసేసి.. ఓ మంచి థ్రిల్లర్ మూవీ కోసం సెర్చ్ చేస్తున్నట్లైతే.. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా బెస్ట్ సజ్జెషన్ అని చెప్పి తీరాలి. అయితే రెగ్యులర్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ తో పాటు.. ఇంకా చాలానే ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో ఎన్నో మంచి మంచి సినిమాలు స్ట్రీమింగ్ అవుతూ ఉన్నాయి. రెగ్యులర్ ప్లాట్ ఫార్మ్స్ లో వచ్చే సినిమాలనే అప్పుడప్పుడు మిస్ చేస్తూ ఉంటారు ప్రేక్షకులు. మరి ఇది డిఫ్ఫరెంట్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ కాబట్టి ఈ సినిమాను మిస్ చేసే అవకాశం ఉంది. మరి ఈ సినిమా ఏంటో అసలు ఏ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతుందో.. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

థ్రిల్లర్ మూవీస్ లిస్ట్ లో ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా టాప్ లో ఉంటుందని చెప్పి తీరాలి. ఈ సినిమా కథ విషయానికొస్తే.. అలెక్సాండర్ , మార్గోట్ ఇద్దరు చిన్నపటినుంచి ఒకరినొకరు ప్రేమించుకుని.. పెళ్లి చేసుకుంటారు. అలా ఓసారి వారు తమ పెళ్లి రోజును సెలెబ్రేట్ చేసుకోడానికి ఓ రిసార్ట్ కు వెళ్తారు. అక్కడ ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు వారిపై ఎటాక్ చేయగా.. ఆ అటాక్ లో మార్గోట్ చనిపోగా .. అలెక్స్ గాయాలతో బయటపడి కోమాలోకి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే సినిమాను 8 సంవత్సరాల తర్వాత చూపిస్తారు. అప్పుడు అలెక్స్ ఓ చిల్డ్రన్ డాక్టర్ గా పని చేస్తూ ఉంటాడు. తన భార్యను మర్చిపోలేక మరో పెళ్లి కూడా చేసుకోకుండా అలానే సింగల్ గా ఉండిపోతాడు. ఇక ప్రెసెంట్ లో సరిగ్గా మళ్ళీ వాళ్ళ పెళ్లి రోజుకు ముందు.. అలెక్స్ కు ఓ మెయిల్ వస్తుంది. అందులో పలానా టైం కు ఆ మెయిల్ ఓపెన్ చేయాలనే ఓ లింక్ ఉంటుంది.

ఇంతలో మరో వైపు.. అలెక్స్ ను అలెక్స్ చెల్లి అన్నాను కలవడానికి ఓ పోలీస్ ఆఫీసర్ వాళ్ళ ఇంటికి వస్తాడు. వారి ఫార్మ్ హౌస్ లో రెండు శవాలు బయటపడ్డాయని.. అందుకే దానికి సంబంధించిన విచారణ జరపాలని చెప్తారు. దానికి అలెక్స్ , అన్నా ఇద్దరూ కూడా సరే అంటారు. ఇక ఈ ప్రాసెస్ లో తన పెళ్లి రోజున వచ్చిన మెయిల్ లో ఓపెన్ చేసి చూడగా.. అక్కడ ఓ సిసిటీవీ లైవ్ ఫుటేజీ ఉంటుంది. అందులో మార్గెట్ ను చూసి అలెక్స్ ఆశ్చర్యపోతాడు . మార్గెట్ చనిపోయిందని కన్ఫర్మ్ చేసుకోడానికి తన తల్లిదండ్రులను కూడా కలుస్తాడు. మరో వైపు ఫార్మ్ హౌస్ లో కనిపించిన డెడ్ బాడీస్ కు, మార్గెట్ హత్యకు కూడా అలెక్స్ ఏ కారణం అని ఓ పోలీస్ ఆఫీసర్ అనుమానిస్తూ ఉంటాడు, పైగా ఆ పోలీస్ ఆఫీసర్ కు.. మార్గెట్ ను ఎవరో అట్టాక్ చేసిన ఫొటోలతో పాటు ఓ గన్ కూడా కనిపిస్తుంది.

ఇక ఆ పోలీస్ ఆఫీసర్ అలెక్స్ కోసం విచారణ కొనసాగిస్తున్న సమయంలోనే.. అలెక్స్ కు మరో మెయిల్ వస్తుంది. తానూ మార్గెట్ అంటూ తనను కలవమంటూ.. ప్లేస్ , అడ్రస్ అలెక్స్ కు మెయిల్ రావడంతో. అలెక్స్ అక్కడికి వెళ్ళి చూస్తాడు. కానీ అక్కడ మార్గెట్ కనిపించదు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మార్గెట్ బ్రతికే ఉందని ఆధారాలతో సహా ఆ పోలీస్ ఆఫీసర్ అలెక్స్ కు చెప్తాడు. అసలు మార్గెట్ బ్రతికి ఉందా చనిపోయిందా ! ఒకవేళ బ్రతికే ఉంటె చనిపోయినట్లుగా ఎందుకు నటిస్తుంది ! మార్గెట్ తండ్రికి ఆమె చావుకి ఏదైనా లింక్ ఉందా ! అలెక్స్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కున్నాడు ! ఇవన్నీ తెలియాలంటే “టెల్ నో వన్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం ఆపిల్ టీవీ ప్లస్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి