iDreamPost

అక్కడ కళ్ళు తెరిస్తే చావే.. OTTలో ఈ మూవీకి వెన్నులో వణుకు పుడుతుంది..!

  • Published Jun 21, 2024 | 4:38 PMUpdated Jun 21, 2024 | 4:38 PM

OTT Best Survival Thriller : ఇప్పుడిప్పుడు ఓటీటీ లకు బాగా బజ్ నడుస్తున్న మాట వాస్తవమే కానీ.. ఎప్పటినుంచో ఓటీటీ లో ఎన్నో మంచి మంచి సినిమాలు స్ట్రీమింగ్ అవుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఒకటి. మరి ఈ సినిమా ఏంటో మీరు ఈ సినిమాను చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

OTT Best Survival Thriller : ఇప్పుడిప్పుడు ఓటీటీ లకు బాగా బజ్ నడుస్తున్న మాట వాస్తవమే కానీ.. ఎప్పటినుంచో ఓటీటీ లో ఎన్నో మంచి మంచి సినిమాలు స్ట్రీమింగ్ అవుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఒకటి. మరి ఈ సినిమా ఏంటో మీరు ఈ సినిమాను చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

  • Published Jun 21, 2024 | 4:38 PMUpdated Jun 21, 2024 | 4:38 PM
అక్కడ కళ్ళు తెరిస్తే చావే.. OTTలో ఈ మూవీకి వెన్నులో వణుకు పుడుతుంది..!

ఓటీటీ వరల్డ్ చాలా పెద్దది.. ఇందులో లెక్కలేనన్ని సినిమాలు , సిరీస్ లు ఉంటాయి. ఇప్పుడంటే ఎప్పటికప్పుడు ఏ సినిమాలు ఏ ప్లాట్ ఫార్మ్ లో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయో అందరికి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. దీనితో ఇప్పుడిప్పుడు ఓటీటీ లకు బాగా బజ్ నడుస్తుంది. కానీ దీనికంటే ముందు కూడా ఆల్రెడీ ఓటీటీ లో కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు ,సిరీస్ లు ఉన్నాయి . ఒక్కోసారి ప్రేక్షకులు ఈ సినిమాలను చూడడం మిస్ చేస్తున్నారు. వారికోసమే ఈ మూవీ సజ్జెషన్. ఇక వాటిలో సర్వైవల్ థ్రిల్లర్స్ అంటే అందరూ ఎంతో ఇంట్రెస్ట్ గా చూస్తూ ఉంటారు. అప్పుడప్పుడు వీటిని చూస్తూ ఉండాలి కూడా… అప్పుడే జీవితం విలువ తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా అలాంటి ఓ సినిమా గురించే. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

డైరెక్ట్ గా కథలోకి వెళ్తే.. మూవీ స్టార్టింగ్ లో.. మలోరి అనే మహిళ తన ఇద్దరు పిల్లల కళ్ళకు గంతలు కట్టేసి వాటిని అసలు తీయొద్దని.. తీస్తే చచ్చిపోతారని చెప్తూ.. వారిని బోట్ లో తీసుకుని వెళ్తుంది. అసలు గతంలో ఏమైంది అనే విషయాన్నీ అప్పుడు చూపిస్తారు. గతంలో మలోరీ ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో.. ఆమె తన చెల్లి జెస్సికాతో కలిసి హాస్పిటల్ కు వెళ్ళినప్పుడు.. అక్కడ అందరు సూసైడల్ టెండెన్సీ తో ప్రవర్తిస్తూ ఉంటారు. దీనితో అది చూసిన వాళ్ళ చెల్లెలు జెస్సికా కూడా.. ఇంటికి వెళ్ళేటప్పుడు ఓ లారీ కి అడ్డుగా వెళ్లి సూసైడ్ చేసుకుని చనిపోతుంది. అది చూసి మలోరి భయంతో అక్కడినుంచి పరిగెడుతుంది. కట్ చేస్తే కడుపుతో ఉన్న మలోరిని ఓ పెద్దావిడ పిలిచి ఆశ్రయం ఇస్తుంది. కానీ ఆమె కూడా ఎదో ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి.. కాలిపోతున్న కార్ లో కూర్చుని చచ్చిపోతుంది. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్ధం కాదు. అక్కడ ఏవో వింత క్రియేచర్స్ ఉన్నాయంటూ.. అవి మనుషుల్ని చంపేస్తున్నాయి అని.. చార్లీ అని ఓ వ్యక్తి చెప్తాడు. అయితే కంటికి కనపడని ఆ వింత క్రియేచర్స్ కెమెరాలో అయినా చూద్దాం అని… ఓ ముగ్గురు వ్యక్తులు అనుకుంటారు. కానీ వారు కూడా సూసైడ్ చేసుకుని చనిపోతారు.

Bird Box

ఇక అక్కడి నుంచి టోమ్ అనే వ్యక్తి మలోరిని తీసుకుని వెళ్ళిపోతాడు. అలా అప్పటినుంచి వారంతా ఓ టీమ్ లా కలిసి ఉంటారు. ఆ వింత జీవుల నుంచి తప్పించుకోడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారంతా కళ్ళ గంతలు కట్టుకునే ఉంటారు. ఒకవేళ తెరిస్తే వారంతా చనిపోతారని వారికీ తెలుసు. ఓ రోజు అదే టీమ్ ఉండే ఓ వ్యక్తి బలవంతంగా చార్లీ కళ్ళ గంతలు విప్పి ఆ వింత క్రియేచర్స్‌ను చూసేలా చేస్తాడు. దీనితో చార్లీ కూడా తన ప్రాణాలు కోల్పోతాడు. అసలు ఆ ప్రాణులు మనుషుల్ని ఎందుకు చంపుతాయి? అదే గ్రూప్ లో ఉన్న కొందరు వ్యక్తులు వాటికి సపోర్ట్ గా ఎందుకు పనిచేస్తున్నారు? ఆ ప్రాణుల్ని చూసినపుడు ఎందుకు అందరూ వేరే ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు ! హాస్పిటల్ లో సూసైడల్ టెండెన్సీ తో ఉన్న వ్యక్తులకు దీనికి ఏమైనా సంబంధం ఉందా ! ఇలా రకరాల ట్విస్ట్స్ తో సాగే ఈ కథలో మలోరి తన పిల్లలను ఎలా కాపాడుతుంది ! చివరికి ఈ కథ ఎలా ముగిసింది ! ఇవన్నీ తెలియాలంటే “బర్డ్ బాక్స్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ చేస్తే కనుక వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి