iDreamPost

మిసెస్ కాబోతున్న మెగా డాటర్

మిసెస్ కాబోతున్న మెగా డాటర్

మెగాస్టార్ కుటుంబంలో పెళ్లి బాజాలు మ్రోగబోతున్నాయి. నాగబాబు కుమార్తె నీహారిక త్వరలో శ్రీమతి కాబోతోంది. నిన్న సోషల్ మీడియాలో తన వివాహం గురించి రెండు మూడు క్లూస్ ఇస్తూ వచ్చిన ఈ మెగా డాటర్ చివరికి తన కాబోయే భర్తను ప్రపంచానికి పరిచయం చేసింది. అతని పేరు చైతన్య జొన్నలగడ్డ. స్వస్థలం గుంటూరు. నాన్న పేరు ప్రభాకర్. ఈయన పోలీస్ శాఖలో ఐజి. బిట్స్ పిలానీ నుంచి ఇంజనీరింగ్ పట్టభద్రులైన చైతన్య ప్రస్తుతం కాగ్నిజెంట్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ హోదాలో ఉన్నారు. మరోవైపు ప్రముఖ విద్యా సంస్థలో మేనేజ్ మెంట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నట్టు సమాచారం.

ఆగస్ట్ లో నిశ్చితార్థం చేసి వచ్చే ఏడాది అంటే 2021 ఫిబ్రవరిలో పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నట్టు వినికిడి. నాగబాబుతో పాటు చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు కలిసి ఈ మొత్తం సంబంధాన్ని పర్యవేక్షించినట్టు తెలిసింది. ఇది లవ్ మ్యారేజా లేక పెద్దలు కుదిర్చిన పెళ్లా లేక రెండూనా అనే విషయం నీహారిక బయట పెట్టలేదు. కొరోనా వైరస్ ఉదృతంగా ఉన్న నేపథ్యంలో మెగా ఫ్యామిలీ ఇప్పట్లో ఈ శుభవార్తకు సంబంధించి ఎలాంటి ఈవెంట్ చేసే ఆలోచనలో లేరు. అందుకే సింపుల్ గా ఎంగేజ్ మెంట్ చేసి వచ్చే ఏడాది గ్రాండ్ గా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసే ప్లానింగ్ జరుగుతోందట.. నీహారిక పెళ్లి గురించి నాగబాబు కొద్దిరోజుల క్రితమే హింట్ ఇచ్చారు.

అన్నట్టుగానే ఒక్కొకటిగా సెట్ చేసుకుంటూ కూతురి ద్వారానే సోషల్ మీడియా ప్రకటన ఇప్పించారు. ప్రస్తుతం ఈ జంట ఫోటో బాగా వైరల్ అవుతోంది. ఒక మనసుతో హీరోయిన్ గా పరిచయమైనా నీహారికకు సిల్వర్ స్క్రీన్ సక్సెస్ మాత్రం దక్కలేదు . సూర్య కాంతం, హ్యాపీ వెడ్డింగ్ తో పాటు తమిళ్ లో విజయ్ సేతుపతితో చేసిన మూవీ ఏదీ ఫలితాన్ని ఇవ్వలేదు. ఆఖరిగా కనిపించింది సైరాలో చాలా చిన్న పాత్రలో. అప్పటి నుంచే పెళ్లి కబుర్లు చెప్పుకుంటూ వచ్చిన నీహారిక మొత్తానికి మూడు ముళ్ళు వేయించుకోబోతోంది. చాలా కాలం తర్వాత ఇంట్లో జరుగుతున్న ఆడపిల్ల పెళ్లి కావడంతో హంగామా ఓ రేంజ్ లో జరుగబోతోందని వేరే చెప్పాలా. ఇక తర్వాతి వంతు వరుణ్ తేజ్ దే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి