చంద్రముఖి సినిమాలో ఒక డైలాగ్
“చూడు… పూర్తిగా చంద్రముఖిలా మారిపోయిన గంగను చూడు”
ఫిబ్రవరిలో చేపట్టే లాంగ్ మార్చ్‌లో డైలాగ్.
“చూడు… పూర్తి బీజేపీలా మారిపోయిన జనసేనని చూడు”
అసలు పవన్ లాంగ్‌మార్చ్ అదో కామెడీ. గతంలో ఇసుకపైన ఆయన చేసిన మార్చ్, ఏప్రిల్ పూల్‌లా మారిన విషయం అందరికీ తెలుసు.
Read Also: జనసేన, బీజేపీ – లాంగ్ మార్చ్ వాయిదా
ఇప్పుడు ఖాకీ నిక్కర్లతో , కర్ర కవాతు చేసే ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన బీజేపీ కార్యకర్తలతో , ఈల వేస్తూ , కాగితాలు విసురుతూ, పవన్‌ని చూసి , కేకలు వేస్తూ పరిగెత్తే జనసైనికులతో కలిసి లాంగ్‌మార్చ్ చేయాలి.
పవన్‌కి అసలే ఇగో. తాను తప్ప ఇంకో నాయకుడు కనిపిస్తే భరించలేడు. అందుకే ఇన్నేళ్లైనా సెకండ్ లీడర్‌షిప్ లేదు. ఇపుడేమో కన్నా, ఇంకా తదితర నాయకులతో కలిసి నడవాలి.
బీజేపీకి గుడ్డిదో, నడ్డిదో ఒక సిద్ధాంతం ఉంది. సిద్ధాంతమే లేకపోవడమే జనసేన సిద్ధాంతం. బాబుని ప్రశ్నిస్తా అన్నాడు, ఐదేళ్లు సన్నాయి నొక్కులు నొక్కాడు. జగన్ మంచి పనులు చేస్తే ప్రశంసిస్తా అన్నాడు. ఒకరోజు కూడా ఆ పనిచేయలేదు. ఏడాది పాటు విమర్శించనని అన్నాడు. ఇపుడేమో విరుచుకుపడుతున్నాడు.
Read Also: పవన్‌ను బాగా మోటివేట్ చేసినట్టున్నారు
ఎప్పుడు ఏమి మాట్లాడుతాడో తెలియని పవన్‌తో బీజేపీ ఎలా వేగుతుందో తెలియదు. ఎండాకాలంలో చలిమంటలాంటి వాడు పవన్. సెగను బీజేపీ భరించాల్సిందే.
చిరంజీవి లేకపోతే ఒక జీవిత కాలం ప్రయత్నించినా నటుడు కావడం కష్టం పవన్‌కి. వడ్డించిన విస్తరితో స్టార్ట్ అయ్యాడు. అలాంటి చిరంజీవిని కూడా విమర్శించడానికి వెనుకాడడు పవన్. మరి బీజేపీ కాపురం ఎలా ఉంటుందో అర్థం అవుతాది. బీజేపీ, జనసేన కలిసి భారతీయ జనసేనగా మారుతోంది. కాకపోతే ఇద్దరి దగ్గర ఆయుధాలు లేవు. సినిమా కత్తులతో లాభం లేదు. వాటిని గుచ్చలేం, పొడవలేం.