iDreamPost
android-app
ios-app

ఏప్రిల్ లో టాలీవుడ్ ఫుల్ మీల్స్

  • Published Mar 09, 2020 | 7:22 AM Updated Updated Mar 09, 2020 | 7:22 AM
ఏప్రిల్ లో టాలీవుడ్ ఫుల్ మీల్స్

మార్చ్ లో ఒక్క నాని ‘వి’ తప్ప అంతా చప్పగా గడిచిపోతోందే అని ఫీలవుతున్న టాలీవుడ్ ప్రేమికుల కోసం ఏప్రిల్ లో ఫుల్ మీల్స్ రాబోతున్నాయి. క్రేజీ సినిమాలన్ని వరసగా రాబోతుండటంతో వేసవిలో కనువిందైన వినోదం పలకరించబోతోంది. ముందుగా ఏప్రిల్ 2నే తీసుకుంటే ఏకంగా మూడు భారీ బడ్జెట్ సినిమాలు ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేయబోతున్నాయి. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన ‘ఉప్పెన’, అనుష్క రెండేళ్ళ గ్యాప్ తర్వాత చేసిన ‘నిశబ్దం’, రానా సోలో హీరోగా చాన్నాళ్ళ తర్వాత చేసిన ‘అరణ్య’ ఒకే రోజు థియేటర్లలో అడుగుపెట్టబోతున్నాయి .

వీటిలో ఏది ముందు చూడాలో ఎంచుకోవడం కూడా కష్టమే. అంత టఫ్ కాంపిటీషన్ ఒకేరోజు ఎదురు కానుంది. ఇక ఏప్రిల్ 9న రామ్ ‘రెడ్’ పలకరించబోతోంది. మొదటి సారి రామ్ డ్యూయల్ రోల్ చేసిన మూవీ కావడం, ఇస్మార్ట్ శంకర్ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వస్తున్న సినిమా వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి. అదే రోజు తమిళ స్టార్ హీరో విజయ్ ‘మాస్టర్’ వచ్చే ఛాన్స్ ఉంది. ఒక్క రోజు గ్యాప్ తో హింది మూవీ ’83’ తెలుగు వర్షన్ 10న విడుదల కానుంది. ఇండియన్ క్రికెట్ టీం మొదటిసారి ప్రపంచ కప్ గెలిచిన నేపధ్యాన్ని తీసుకుని రూపొందించిన

మహానటి తర్వాత కీర్తి సురేష్ చేసిన స్ట్రెయిట్ తెలుగు మూవీ ‘మిస్ ఇండియా’ మే 17 కన్ఫర్మ్ చేసుకుంది. అదే రోజు సత్యదేవ్ నటించిన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ కూడా పోటీ పడబోతోంది. ఇంకా ఖరారు చేయలేదు కాని సూర్య నటించిన ‘ఆకాశమే నీ హద్దురా’ 24న విడుదల కాబోతోంది. మార్పు జరిగే ఛాన్స్ ఉందని చెన్నై మీడియా టాక్. వెంకటేష్ నటిస్తున్న ‘నారప్ప’ ఏప్రిల్ లో తీసుకొస్తారా లేక మేకు షిఫ్ట్ అవుతుందా అనే క్లారిటీ ప్రస్తుతానికి లేదు. ఇవి కాకుండా ఇతర క్రేజీ హాలీవుడ్ బాలీవుడ్ సినిమాలు మనవాటితో ఆయా తేదిల్లో పోటీ పడబోతున్నాయి. హాలిడేస్ సీజన్ మొదలువుతుంది కాబట్టి ఈసారి థియేటర్లు ఈ సినిమాలతో కళకళలాడాలని ట్రేడ్ ఆశిస్తోంది. మరి ఇన్నేసి సినిమాల్లో విజేతలుగా ఎవరు నిలుస్తారో ప్రేక్షకులు డిసైడ్ చేయాలి.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alKulisbetKulisbetMadridbetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş