iDreamPost

ప్రపంచానికి దారి చూపిన నలంద విశ్వవిద్యాలయం ఎలా నాశనమైంది? మోదీ ప్రత్యేక శ్రద్ద ఎందుకు?

Nalanda University: ఎంతో ఘన చరిత్ర కలిగిన నలంద విశ్వవిద్యాలయం పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అందుకు కారణం..ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్కడ చేస్తున్న కార్యక్రమాలు. ఈ నేపథ్యలంలోనే ఈ విశ్వవిద్యాలయం చరిత్ర గురించి తెలుసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు.

Nalanda University: ఎంతో ఘన చరిత్ర కలిగిన నలంద విశ్వవిద్యాలయం పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అందుకు కారణం..ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్కడ చేస్తున్న కార్యక్రమాలు. ఈ నేపథ్యలంలోనే ఈ విశ్వవిద్యాలయం చరిత్ర గురించి తెలుసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు.

ప్రపంచానికి దారి చూపిన నలంద విశ్వవిద్యాలయం ఎలా నాశనమైంది? మోదీ ప్రత్యేక శ్రద్ద ఎందుకు?

ప్రపంచంలోనే భారత దేశ చరిత్ర చాలా గొప్పది. జ్ఞానాకి పుట్టినిల్లుగా ఎన్నో ఏళ్ల పాటు ఇండియా విరాజిల్లింది. ఇక్కడ ఉన్న ఎన్నో పురాతన దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు అనంతమైన జ్ఞానానికి ప్రతీకలు. అలాంటి వాటిల్లో అతి ముఖ్యమైనది నలంద విశ్వవిద్యాలయం. ఏళ్ల చరిత్ర కలిగిన ఈ యూనివర్సిటీ ఓ వ్యక్తి స్వార్థానికి, అసుయాకు బలైందని చరిత్రకారులు చెబుతున్నారు. ఇలా మరుగున పడిపోయిన ఈ జ్ఞాన భాండగారానికి ప్రధానమంత్రి మంత్రి పూర్వవైభవం తెచ్చే విధంగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే బిహార్ రాష్ట్రంలోని రాజ్‌గిర్‌లో నలంద విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 17 దేశాల మిషన్స్ హెడ్‌తో సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే చాలా మందికి  నలంద విశ్వవిద్యాలయం చరిత్ర తెలుసుకునేందుకు తెగ సెర్చ్ చేస్తున్నారు. అసలు నలంద విశ్వవిద్యాలయం అంటే ఏమిటి, దీని చరిత్ర ఏమిటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం…

ప్రస్తుతం మన దేశంలోని చాలా మందికి నలంద విశ్వవిద్యాలయం గురించి తెలియదు. చాలా తక్కువ మందిక మాత్రమే దీని గురించి తెలిసింది. క్రీస్తు శకం 427 సంవత్సంరో ఈ నలంద విశ్వవిద్యాలయాన్ని కుమార గుప్తా-1 అనే రాజు కట్టించారు. ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రపంచంలోనే తొలి రెసిడెన్షియల్ యూనివర్సిటీగా చెప్తుంటారు. అంతేకాక ప్రపంచంలో మొట్ట మొదటి విశ్వవిద్యాలయంగా కూడా నలంద చరిత్రలో నిలిచిపోయింది. ఇక నలంద అనేది సంస్కృతంలోని మూడు పదాల కలయిక. న, ఆలం,ద, అనే మూడు సంస్కృత పదాల ద్వారా ఆ విశ్వవిద్యాలయంకి ఆ పేరు వచ్చింది. న ఆలం ద.. అంటే దారళంగా ప్రవహిస్తున్న జ్ఞానం అని అర్థం.

Nalanda university

ఈ విశ్వ విద్యాలయంలో దాదాపు 9 లక్షల పుస్తకాలు ఉండేవి. తూర్పు ఆసియా, మధ్య ఆసియా ప్రాంతాల నుంచి అప్పట్లోనే 10 వేల మందికి పైగా విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకునేవారని చరిత్ర చెప్తోంది. ఇక్కడ 10 వేల మంది బౌద్ద సన్యాసులు, 1516 గురువులు ఉండే వారు. ఆర్యభట్టా, హర్ష వర్ధన,వాసుబంధున నాగార్జున వంటి వారు ఈ విశ్వవిద్యాలయంలోనే చదువుకున్నారు. ఈ విశ్వవిద్యాలయంలో ప్రాచీన గణితం, సైన్సు, ఖగోళ శాస్త్రం, ఆయుర్వేద వైద్య పద్ధతులు వంటివి బోధించేవారు. ఇక్కడ ఉండే ధర్మగంజ్ లైబ్రరీ ఎంతో పెద్దది, మూడు అంతస్తులో లక్షల పుస్తకాలతో ఈ గ్రంథాలయం ఉంది. ప్రతి ఫ్లోర్ కి ఒక పేరు ఉండేది. రత్నసాగర్, రత్నోదాది, రత్నరంజక అనే పేర్లతో పిలుస్తుంటారు.

అక్కడ ఈ ఆయుర్వేద వైద్యాన్ని నేర్చుకున్న విద్యార్థులు ఈ విధానాన్ని ప్రపంచ వ్యాప్తంగా వ్యాపింపజేశారు. భారతీయ గణిత శాస్త్ర పితామహుడిగా చెప్పే ఆర్యభట్ట.. అక్కడే చదువుకుని క్రీస్తు శకం 6వ శతాబ్దంలో అదే  విశ్వవిద్యాలయానికి నేతృత్వం వహించారు. నలంద విశ్వవిద్యాలయం సుమారు 800 ఏళ్ల పాటు ఎంతో వైభవంగా వర్ధిల్లింది. 5వ శాతాబ్ధ కాలంలో అలాంటి యూనివర్సిటీ ప్రపంచంలో ఇంకేదీ ఉండేది కాదు. ఇక ఈ విశ్వవిద్యాలయాన్ని నాశనం చేయాలని మూడు సార్లు దాడులు చేశారు. రెండు సార్లు విఫలంగా కాగా మూడో సారి నలంద విశ్వవిద్యాలయం నాశనమైంది.  12వ శాతాబ్ధంలో భక్తియార్ ఖల్జీ అనే రాజు నలందను నాశనం చేశాడు. క్రీస్తుశకం1193 ఈ విశ్వవిద్యాలయంపై దండెతి నాశనం చేశాడు.

భక్తియార్ ఖల్జీ ప్రాణాలు కాపాడటమే నలంద విశ్వవిద్యాలయం చేసిన తప్పని చరిత్రకారులు చెబుతున్నారు. అతడికి ఓ వింత జబ్బు వచ్చిన సందర్భంలో ఎంతో మంది వైద్యులు వచ్చి చూసిన జబ్బు నయం కాలేదు.  ఆ సమయంలో నలంద విశ్వవిద్యాలయంలో వారు నయం చేస్తారని తెలిపారు. తొలుత బెట్టు చేసిన ఖల్జీ.. ఆ తరువాత అక్కడ చదిన రాహుల్ శ్రీ భద్ర అనే గురువు ..ఖల్జీ వ్యాధిని నయం చేశాడు.  దీంతో తన ప్రాణాలు కాపాడిన విశ్వవిద్యాలయంపై కృతజ్ఞలేక పోగా.. అసూయ, ద్వేషం పెంచుకున్నాడని చరిత్ర కారులు తెలిపారు. ఈక్రమంలోనే ఈ విజ్ఞానం భారత దేశంలోని భావితరాల వారికి అందకూడదనే ఉద్దేశంతో నలందపై దండెత్తి ధ్వంసం చేశాడు.

Nalanda university

నలంద విశ్వ విద్యాలయంలో ఉన్న పుస్తకాలను పూర్తిగా కాలిపోయేందుకు మూడు నెలల కాలం పట్టిందని చరిత్రకారులు చెబుతున్నారు. అందులో ఎన్ని లక్షల గ్రంథాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అలా నలందాలోని అఖండ జ్ఞాన సంపదను భక్తియార్ ఖిల్జీ ధ్వంసం చేశాడు. అలా కొందరి ద్వేషానికి, అసూయకు ఆ విజ్ఞానాన నిధి చరిత్రలో కలిసిపోయింది. ఇన్నేళ్ల తరువాత మోదీ.. పూర్వ వైభవం తీసుకొచ్చేలా అక్కడ క్యాంప్ ను ప్రారంభించారు. అయితే తొలత 2006 అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్ధుల్ కలాం..నలంద యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ప్రొజ్ చేశారు. ఈ క్రమంలోనే అనేక పరిణామ కొత్త యూనివర్శిటీ క్యాంపస్ పురాతన నలంద యూనివర్శిటీని ప్రతిబింబిస్తుంచేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి