iDreamPost
android-app
ios-app

నాగబాబు నోటి దురుసు వ్యాఖ్యలు.. ఆపై క్షమాపణలు!

  • Published Feb 29, 2024 | 1:20 PM Updated Updated Feb 29, 2024 | 1:20 PM

వరుణ్ తేజ్ నటించిన 'ఆపరేషన్ వాలంటైన్' మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు తాజాగా క్షమాపణలు చెప్పాడు నాగబాబు.

వరుణ్ తేజ్ నటించిన 'ఆపరేషన్ వాలంటైన్' మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు తాజాగా క్షమాపణలు చెప్పాడు నాగబాబు.

నాగబాబు నోటి దురుసు వ్యాఖ్యలు.. ఆపై క్షమాపణలు!

సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు కాస్త ముందూ.. వెనకా చూసుకుని మాట్లాడాలి. లేకుంటే.. ఆ తర్వాత ఎదుర్కొవాల్సిన పర్యవసానాలు చాలా దారుణంగా ఉంటాయి. ఇక ఆ మాటలపై నెటిజన్లు విమర్శలు, ట్రోల్స్ చేస్తారు. దీంతో వారు ఎట్టకేలకు దిగొచ్చి.. తన నోటి దురుసు వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాల్సి వస్తుంది. తాజాగా అదే పని చేశాడు జనసేన నాయకుడు, నటుడు నాగబాబు. తన కొడుకు వరుణ్ తేజ్ నటించిన ‘ఆపరేషన్ వాలంటైన్’ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు తాజాగా క్షమాపణలు చెప్పాడు నాగబాబు.

టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆపరేషన్ వాలంటైన్’ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 1న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది. ఈ వేడుకలో వరుణ్ తేజ్ తండ్రి నాగబాబు తన నోటి దురుసుతో వివాదాస్పద కామెంట్స్ చేశాడు. ‘5.3 అంగుళాలు ఉండే వ్యక్తులు పోలీస్ పాత్రలు చేస్తే.. చూడ్డానికి బాగుండదు’ అని నాగబాబు ఈ ఫంక్షన్ లో మాట్లాడాడు. దీంతో కొత్త వివాదం రాజుకున్నట్లైంది. నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ లో కొందరు హీరోల్ని బాడీ షేమింగ్ చేసే విధంగా ఉన్నాయని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ప్రముఖ సెలబ్రిటీగా, రాజకీయ నాయకుడిగా ఉండి.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన తప్పు తెలుసుకున్న నాగబాబు.. సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు కోరాడు.

“ఆపరేషన్ వాలంటైన్ ప్రీ రిలీజ్ వేడుకలో నేను పోలీస్ క్యారెక్టర్ 6.3 అంగుళాలు ఉన్నవారికి బాగుంటుందని, 5.3 ఉన్న వారికి అంతగా సూట్ అవ్వదని అన్నాను. అయితే ఆ మాటలను నేను వెనక్కి తీసుకుంటున్నాను. ఈ మాటలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే.. నన్న క్షమించండి. అవి అనుకోకుండా వచ్చినవే కానీ.. కావాలని అన్నవి కాదు. అందరూ అర్థం చేసుకుని నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను” అంటూ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ లో రాసుకొచ్చాడు నాగబాబు. మరి నాగబాబు క్షమాపణలతో ఇప్పటికైనా ఈ వివాదం సర్దుకుంటుందో? లేదో? చూడాలి. మరి తప్పు తెలుసుకుని నాగబాబు క్షమాపణలు చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: ‘తంత్ర’ ట్రైలర్ రివ్యూ.. ఇది నెక్ట్స్ లెవెల్ హార్రర్, సస్పెన్స్ థ్రిల్లర్!