iDreamPost

‘తంత్ర’ ట్రైలర్ రివ్యూ.. ఇది నెక్ట్స్ లెవెల్ హార్రర్, సస్పెన్స్ థ్రిల్లర్!

Thantra Trailer: క్షుద్రపూజలు జానర్ లో వస్తున్న చిత్రం 'తంత్ర'. అనన్య నాగళ్ల లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. మరి ట్రైలర్ ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? ఈ రివ్యూలో చూద్దాం.

Thantra Trailer: క్షుద్రపూజలు జానర్ లో వస్తున్న చిత్రం 'తంత్ర'. అనన్య నాగళ్ల లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. మరి ట్రైలర్ ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? ఈ రివ్యూలో చూద్దాం.

‘తంత్ర’ ట్రైలర్ రివ్యూ.. ఇది నెక్ట్స్ లెవెల్ హార్రర్, సస్పెన్స్ థ్రిల్లర్!

హార్రర్, సస్పెన్స్, థ్రిల్లర్ మూవీస్ కు ఎప్పుడూ డిమాండే ఉంటుంది. ఈ మూవీలను ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడతారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. గతంలో ఈ జానర్ లో వచ్చిన ఎన్నో చిత్రాలు ఘన విజయాలు సాధించాయి. సత్యం రాజేష్ నటించిన మా ఊరి పొలిమేర 1, 2 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు ఇదే క్షుద్రపూజలు జానర్ లో వస్తున్న చిత్రం ‘తంత్ర’. అనన్య నాగళ్ల లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. మరి ట్రైలర్ ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? ఈ రివ్యూలో చూద్దాం.

కొత్తదనానికి ఎప్పుడూ బ్రహ్మరథం పడుతూనే ఉంటారు టాలీవుడ్ ప్రేక్షకులు. ఇక డైరెక్టర్లు సైతం వారి అభిరుచులకు తగ్గట్లుగానే సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అయితే హార్రర్ ఫిల్మ్స్ కు సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఈ ట్రెండ్ నే ఎక్కువగా ఫాలో అవుతూ.. హార్రర్ చిత్రాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు మేకర్స్. అందులో భాగంగా తాజాగా క్షుద్రపూజల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘తంత్ర’. తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ల లీడ్ రోల్ లో నటించిన ఈ మూవీ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే.. హార్రర్ మూవీల్లో ట్రెండ్ సెట్ చేసేలా కనిపిస్తోంది. ఓ యువతిపై క్షుద్రపూజలు ప్రయోగించడం, దాన్ని అడ్డుకోవడానికి హీరో ఏం చేశాడు? చివరికి ఏమైంది? అన్నదే ఈ తంత్ర మూవీ.

‘వజ్రోలి రతి’ అనే చేతబడిని అనన్యపై ఎందుకు ప్రయోగించారు? అన్నది ఆసక్తిని క్రియేట్ చేసే విధంగా ట్రైలర్ కట్ చేశారు. హార్రర్ చిత్రాల్లో ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తంత్ర రాబోతున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. చేతబడి విజువల్స్ ప్రేక్షకులను భయపెట్టించడం ఖాయం. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఇక అనన్య ఎప్పటిలాగానే అందమైన, అచ్చమైన పల్లెటూరి అమ్మాయిలా మెప్పించింది. హీరోయిన్ సలోని సైతం ఓ పాత్రలో మెరిసింది. ఇక మీసాల లక్ష్మణ్ కు ఈ మూవీతో మరో మంచి క్యారెక్టర్ పడటం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ మార్చి 15న ప్రేక్షకులను భయపెట్టడానికి వస్తోంది. అనన్య నాగళ్ల, ధనుష్ రఘుముద్రి, సలోని, మీసాల లక్ష్మణ్ తదితరులు నటించగా.. శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించారు. ఆర్ఆర్ ధృవన్ సంగీతమందించాడు. పిల్ల బచ్చాలు ఈ మూవీకి రావొద్దని మూవీ మేకర్స్ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్ చూస్తే.. వారు చెప్పింది నిజమనే అనిపిస్తుంది.  మరి ఈ ట్రైలర్ చూసి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: ఓటీటీలో రానున్న భారతరత్న పీవీ నరసింహారావు బయోపిక్.. దేనిలో అంటే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి