iDreamPost

Lottery: అదృష్టం అంటే ఇది కదా.. సెక్యూరిటీ గార్డ్‌కు లాటరీలో రూ.12 కోట్లు

  • Published May 31, 2024 | 4:27 PMUpdated May 31, 2024 | 4:27 PM

జీవిత చరమాంకంలో ఉన్న ఓ వృద్ధుడిని అదృష్టం వరించింది. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. లాటరీలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 12 కోట్లు గెలిచాడు. ఆ వివరాలు..

జీవిత చరమాంకంలో ఉన్న ఓ వృద్ధుడిని అదృష్టం వరించింది. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. లాటరీలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 12 కోట్లు గెలిచాడు. ఆ వివరాలు..

  • Published May 31, 2024 | 4:27 PMUpdated May 31, 2024 | 4:27 PM
Lottery: అదృష్టం అంటే ఇది కదా.. సెక్యూరిటీ గార్డ్‌కు లాటరీలో రూ.12 కోట్లు

అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పడం కష్టం. లక్ష్మీ దేవి మన తలుపు తడితే.. చనిపోయే ముందు కూడా కోటీశ్వరులు కావొచ్చు. అదే దరిద్రం మనల్ని వెంటాడుతుంటే.. చేతిలో కోటి రూపాయలు ఉన్నా అవి మనకు అక్కరకు రావు. ఇక మన దేశంలో ఈ మధ్య కాలంలో.. లాటరీల్లో కోట్లు గెలిచి.. కోటీశ్వరులుగా మారిన వారి గురించి తరచుగా వార్తల్లో చదువుతున్నాం. ఇప్పుడు మరోకటి వెలుగులోకి వచ్చింది. జీవిత చరమాంకంలో ఉన్న ఓ సెక్యూరిటీ గార్డ్‌ని లాటరీ రూపంలో అదృష్టం వరించింది. లాటరీలో అతడికి ఏకంగా 12 కోట్ల రూపాయలు వచ్చాయి. మరి ఆ అదృష్టవంతుడు ఎవరు.. ఎలా ఇంత మొత్తం గెలిచాడు వంటి పూర్తి వివరాలు మీ కోసం..

మనదేశంలో లాటరీ టికెట్లు అనగానే అందరికి గుర్తుకు వచ్చేది కేరళ. ఇప్పుడు మనం చెప్పుకొబోయే వృద్ధుడిది కూడా కేరళనే. సెక్యూరిటీ గార్డ్‌గా చేస్తోన్న ఆ వ్యక్తి లాటరీలో ఏకంగా 12 కోట్ల రూపాయలు గెలిచి.. రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయ్యాడు. కేరళ అలప్పుజ జిల్లా, పజవీడుకు చెందిన విశ్వంభరన్‌.. సీఆర్‌పీఎఫ్‌లో పని చేసి రిటైర్‌ అయ్యాడు. ప్రస్తుతం సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్నాడు. అయితే విశ్వంభరన్‌కు లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉంది. ప్రతి నెల వాటి కోసం 500 రూపాయలు ఖర్చు చేస్తాడు. గత ఐదేళ్ల నుంచి లాటరీ టికెట్లు కొంటూ వస్తున్నాడు. ప్రతి సారి 20 టికెట్ల వరకు కొనేవాడు. కానీ ఈసారి మాత్రం.. పెద్ద మొత్తంలో లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు విశ్వంభరన్‌. అయితే ఈసారి అతడిని అదృష్టం వరించింది. లాటరీలో ఏకంగా 12 కోట్ల రూపాయలు గెలిచాడు.

ఈ సందర్భంగా విశ్వంభరన్‌ మాట్లాడుతూ.. ‘‘ఏదో ఒకరోజు లాటరీలో గెలుస్తాను అనే ఉద్దేశంతో.. గత ఐదేళ్లుగా వీటిని కొనుగోలు చేస్తూ వస్తున్నాను. ప్రతి సారి 20 టికెట్లు కొనేవాడిని. కానీ ఈసారి ఇంకా ఎక్కువ టికెట్లు కొనుగోలు చేశాను. వార్తల్లో అలప్పుజ జిల్లాకు చెందిన వ్యక్తి లాటరీ విన్‌ అయ్యాడు అని వచ్చింది. వెంటనే నా దగ్గర ఉన్న టికెట్లు బయటకు తీసి చెక్‌ చేసుకున్నాను. ఆశ్చర్యంగా లాటరీలో నేను కొన్న టికెట్‌కే ఫస్ట్‌ ఫ్రైజ్‌ తగిలింది. ముందు నేను నమ్మలేదు. ఒకటికి పది సార్లు చెక్‌ చేసుకున్నాను. అప్పుడు నాకు నమ్మకం కలిగింది. లాటరీలో నేను విన్‌ అయ్యాను.. 12 కోట్ల రూపాయలు గెలుచుకున్నాను అని తెలిసింది. ఇదంతా దేవుడి దయ. ఈ మొత్తంతో నా అవసరాలు తీర్చుకుంటాను. మరీ ముఖ్యంగా ఇల్లు కట్టుకోవాలని భావిస్తున్నాను. దీనికన్నా పెద్ద కోరిక నాకేం లేదు’’ అని చెప్పుకొచ్చాడు. విశ్వంభరన్‌ అదృష్టాన్ని అందరూ పొగుడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి