iDreamPost

Kalki 2898 AD Twitter Review: కల్కి 2898 AD మూవీ ట్విట్టర్ రివ్యూ!

Kalki 2898 AD Movie First Review in Telugu: ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి 2898 ఏడీ మూవీ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా రీసౌండింగ్ వస్తోంది. మరి.. ఓవర్సీస్ లో మనకంటే ముందే విడుదలైన కల్కి సినిమాకి ట్విట్టర్ ఎలాంటి టాక్ వచ్చిందో చూద్దాం.

Kalki 2898 AD Movie First Review in Telugu: ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి 2898 ఏడీ మూవీ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా రీసౌండింగ్ వస్తోంది. మరి.. ఓవర్సీస్ లో మనకంటే ముందే విడుదలైన కల్కి సినిమాకి ట్విట్టర్ ఎలాంటి టాక్ వచ్చిందో చూద్దాం.

Kalki 2898 AD Twitter Review: కల్కి 2898 AD మూవీ ట్విట్టర్ రివ్యూ!

కల్కి 2898 ఏడీ.. ఇప్పుడు ఏ సినిమా ప్రేక్షకుడి నోట విన్నా కూడా ఇదే పేరు వినిపిస్తోంది. ఈ మూవీపై ఉన్న బజ్ అంతా ఇంతా కాదు. వరల్డ్ వైడ్ గా ఉన్న ప్రేక్షకులు కొన్ని నెలలుగా ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. ఆ రోజు రానే వచ్చింది. కల్కి 2898 ఏడీ జూన్ 27న అట్టహాసంగా రిలీజ్ అవుతోంది. అయితే ఈ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ అయితే నిద్ర కూడా పోవట్లేదు. విదేశాల్లో సినిమా కొన్ని గంటల ముందే రిలీజ్ అవుతుందని తెలిసిందే. అక్కడి టాక్ అప్పుడే నెట్టింట వైరల్ కూడా అవుతోంది. మరి.. ఓవర్సీస్ లో కల్కి సినిమాకి సంబంధించి ఎలాంటి టాక్ వచ్చింది? అసలు మూవీ ఎలా ఉందో ట్విట్టర్ పోస్టుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఇప్పటికే కల్కి సినిమాకి సంబంధించి సెన్సార్ రివ్యూ ఒకటి వైరల్ అయ్యింది. ఈ మూవీ ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక అద్భుతం అంటూ వాళ్లు కామెంట్స్ చేశారు. అలాగే విజువల్స్ పరంగా కల్కి సినిమా మీ మైండ్ లో నుంచి పోదు అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు కల్కి 2898 ఏడీ మూవీ చూసిన తర్వాత అభిమానుల మాటలు కూడా దాదాపుగా అలాగే ఉన్నాయి. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలి అంటే.. హాలీవుడ్ రేంజ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నాగ్ అశ్విన్ ఇప్పటివరకు సినిమా గురించి చాలా తక్కువ చెప్పారంట. ఒక్కసారి థియేటర్లోకి అడుగు పెట్టిన తర్వాత మరో ప్రపంచంలోకి వెళ్లినట్లే ఉందని చెప్పుకొస్తున్నారు.

నాగ్ అశ్విన్ గురించి అమితాబ్ బచ్చన్ ఒక మాట అన్నారు. అసలు ఇలాంటి థాట్స్ ఎలా వస్తాయో? అని నాకు బుర్ర పనిచేయలేదు అన్నారు. ఈ మూవీ చూసిన తర్వాత నాగ్ అశ్విన్ థింకింగ్, టేకింగ్ కి ఫ్యాన్స్ కి నోట మాట రావట్లేదు. అంతేకాకుండా.. ప్రభాస్ కెరీర్లో ఈ మూవీ నిలిచిపోతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కల్కి 2898 ఏడీ ఒక సైంటిఫిక్ మైథాలజీ అంటున్నారు. అంటే పురాణాలు, ఇతిహాసాలను ఇప్పుడున్న టెక్నాలజీనే కాకుండా.. భవిష్యత్తులో వచ్చే సాకేంతికతకు జోడించి చూపించడం మాత్రం నెవర్ బిఫోర్ అంటున్నారు. సినిమాలో క్లైమ్యాక్స్ మాత్రం ప్రాణం అంటున్నారు. అయితే ఈ మూవీలో ప్రభాస్ ఎంట్రీ మాత్రం 20 నిమిషాల తర్వాతే ఉంటుందంట. మూవీలో 80 శాతం వరకు యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది అంటున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె పాత్రలను సిల్వర్ స్క్రీన్ మీద చూసి మెస్మరైజ్ అవుతారంట.

ఇంక క్యామియోల గురించి మాత్రం చాలా మంది రివీల్ చేయడం లేదు. ఎందుకంటే ఈ చిత్రంలో స్పెషల్ అప్పియరెన్సులకు చాలా ఆవశ్యకత ఉంది అంటున్నారు. వాటిని రివీల్ చేసి అందరి ఆసక్తిని తగ్గించకూడదు అనేది అభిమానుల ఆలోచన. అయితే రిలీజ్ కి ముందే ప్రభాస్ రెండు పాత్రలను లీక్ చేశాడు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ ఇద్దరూ కల్కి సినిమాలో ఉన్నారని ప్రభాస్ లీక్ చేశాడు. ఆ తర్వాత తప్పక నాగ్ అశ్విన్ కన్ఫామ్ చేశాడు. ఇంక మిగిలిన వారి గురించి మాత్రం మీరు స్క్రీన్ మీద చూసి తెలుసుకుంటే మంచిది. ఆ థ్రిల్ ని మిస్ కాకుండా ఉంటారు. ఇంక ఓవరాల్ గా ఈ కల్కి 2898 ఏడీ మూవీ ఇండియన్ సినిమాలో నిలిచిపోతుంది అంటూ కితాబు ఇచ్చేస్తున్నారు. మరి.. ఫుల్ రిజల్ట్ రావాలి అంటే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో టాక్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.

చదవండి: Kalki 2898 AD Review: ఎలాంటి స్పాయిలర్స్‌ లేని కల్కి మూవీ రివ్యూ!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి