iDreamPost

మందు బాబులకు గుడ్ న్యూస్.. జులై 1 నుండి తగ్గనున్న ధరలు

మందు బాబులం మేము మందుబాబులం మందు కొడితే మాకు మహారాజులం అని ఫీల్ అవుతుంటారు మద్యం ప్రియులు. గొంతులో చుక్క పడనిదే కొంత మందికి పొద్దుపోదు. అలాంటి మందుబాబులకు గుడ్ న్యూస్. భారీగా ధరలు తగ్గనున్నాయి.

మందు బాబులం మేము మందుబాబులం మందు కొడితే మాకు మహారాజులం అని ఫీల్ అవుతుంటారు మద్యం ప్రియులు. గొంతులో చుక్క పడనిదే కొంత మందికి పొద్దుపోదు. అలాంటి మందుబాబులకు గుడ్ న్యూస్. భారీగా ధరలు తగ్గనున్నాయి.

మందు బాబులకు గుడ్ న్యూస్.. జులై 1 నుండి తగ్గనున్న ధరలు

బాధలు, ఆర్థిక ఇబ్బందులు,  ఇతర సమస్యల నుండి గట్టెక్కించే ఒకే ఒక్క టానిక్ మద్యమేనని భావిస్తుంటారు కొందరు. నిత్యం తీర్థం తీసుకోవడం కొంత మందికి అలవాటుగా మారిపోయింది. మద్యం తీసుకోనిదే రోజు గడవదు. పెగ్గు అయినా పుచ్చుకోనిదే పొద్దుపోదు.. నిద్ర పట్టదు. మందుబాబులైతే.. పొద్దున్న నుండి రాత్రి వరకు అందులోనే జోగుతూ.. తూలుతూ ఉంటారు. అలాగే వీకెండ్ అయితే మద్యం ప్రియులు.. గవర్నమెంట్‌కు ఎక్కువ టాక్స్ కడుతుంటారు.. ఎక్కువ మొత్తంలో మద్యం తీసుకుని ఆదాయాన్ని పెంచుతుంటారు. అయితే ఈ మధ్య కాలంలో పలు ప్రాంతాల్లో బీర్లు దొరక్క పరాయి రాష్ట్రాలకు కూడా పరుగులెత్తారు తెలంగాణ వాసులు. అయితే ఇప్పుడు ఫుల్ కిక్ ఇచ్చే వార్త ఒకటి వచ్చింది.

మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. త్వరలో భారీగా మద్యం ధరలు తగ్గనున్నాయి. జులై 1 నుండి మద్యం ధరలను తగ్గించనుంది సర్కార్. అయితే ట్విస్ట్ ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో కాదండోయ్.. ఈ రాష్ట్రాలకు సరిహద్దు పంచుకుంటున్న కర్ణాటక ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి ప్రీమియం బ్రాండ్ మద్యం ధరలు తగ్గనున్నాయి. ఇతర రాష్ట్రాల ధరలకు తగ్గట్టుగా కర్ణాటకలో మద్యం ధరలను సవరిస్తామని ఈ ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఈ ప్రకటన ఇప్పుడు అమల్లోకి రానుంది. ఆదాయాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ రేట్స్ తగ్గిస్తుంది. రాష్ట్రంలో ఎక్సైజ్ సుంకం అధికంగా ఉండటంతో పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటకలో మద్యం ధరలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పక్క రాష్ట్రాల నుంచి కర్ణాటకకు అక్రమంగా మద్యం సరఫరా అవుతున్నట్లు సమాచారం.

ఇటు ఏపీ, అటు తెలంగాణ అలాగే అటు కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు సరిహద్దు జిల్లాల నుంచి ప్రజలు పక్క రాష్ట్రాలకు వెళ్లి మద్యం కొనుగోలు చేస్తున్నారట. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ పన్నును కోల్పోతోంది. దీంతో లిక్కర్ రేట్స్ తగ్గించాలని భావిస్తుంది. మద్యం విక్రయాలను పెంచుకోవడంతో పాటు ఎక్సైజ్‌ సుంకం ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో ఈ ధరల సవరణ జరిగినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ 750 మి.లీ. ఫుల్ సైజ్ బ్రాండెడ్ మద్యం బాటిల్‌ ధర రూ.2,000 పలుకుతుండగా.. దీన్ని రూ. 1800 లేదా రూ. 1700కి తగ్గించనుంది. అలాగే బడా బ్రాండెడ్ లిక్కర్ రూ. 7100 ఉన్నది.. 5200రూపాయలకు.. అదేవిధంగా 5వేలు ఉన్న మద్యం ధర రూ. 3600-3700లకు ఫిక్స్ చేయనున్నట్లు తెలుస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి